Araku Valley- Tourist Spots in Araku Valley - ఆంధ్రా ఊటీ సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ప్రకృతి ఒడిలో అందమైన హరివిల్లు -అరకు లోయ - వలిసె పూలు-గిరిజన మ్యూజియం-పుణ్యగిరి ఆలయం, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్,బొర్రా గుహలు,అనంతగిరికాఫీతోటలు,‘బొంగు’ చికెన్,పనస వైన్,రణజిల్లెడ జలపాతం,చాపరాయి జలపాతం,మత్స్యగుండం జలపాతం ,అనంతగిరి జలపాతం కటికి జలపాతం,డుడుమ జలపాతం,కొత్తపల్లి జలపాతం లతో అరకులోయ అందాలు
ప్రకృతి ప్రేమికులకి కాశ్మీర్, డార్జీలింగ్, నైనిటాల్, ముస్సోరి,ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులు, మనాలి పేర్లు గుర్తొస్తే చాలు అవా సూపర్ ప్లేసెస్ అనేస్తారు,వాటికి ఏమాత్రం తగ్గని అందాలతోపాటు గ్రామీణ, గిరిజన సంస్కృతి ఉట్టిపడుతూ , ప్రకృతి ఒడిలో అందంగా కనిపించే హరివిల్లు ‘అరకు’ ..అందుకే అరకు ని ఆంధ్రా ఊటీ అంటారు.
ఆంధ్రప్రదేశ్ …విశాఖపట్నం జిల్లా ‘డుంబ్రిగుడ ‘మండలానికి చెందిన గ్రామం అరకు. అరకు లోయ సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవై…. కొండలతో లోయలతో…. ఔత్సాహిక పర్యాటకులని ఆకర్షిస్తూ సహజ సాందర్యానికి సజీవ రూపం గా నిలుస్తోంది.ఒరిస్సా సరిహద్దు కి సమీపం లో ఉన్న అరకు, రాష్ట్రం లో ని అత్యంత సుందరమైన ప్రాంతాలలో ఒకటి గా గుర్తింపు పొందిన పర్యాటక ఆకర్షణప్రాంతం.
దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం జిల్లాలో అరకు వాలీ ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ పట్టణం అందమైన తూర్పు కనుమలలో వుండి ఎంతో గొప్ప సంస్కృతి మరియు ప్రాచీన సంప్రదాయాలు కలిగి వుంది. అరకు వాలీ వైజాగ్ కి సుమారు 114 కి. మీ.లు దూరం వుంటుంది. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దు. వాలీ లో అధిక జీవ వైవిధ్యం కల అనంతగిరి మరియు సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ లు . వాలీ చుట్టూ రక్త కొండ, చితమో గొంది, గాలికొండ మరియు సుంకరి మెట్ట కొండలు కలవు. గాలికొండ రాష్ట్రం లోనే అతి పొడవైన కొండగా చెపుతారు. చేతికందే ఎత్తులో వుండే మంచు తెరల్ని ముద్దాడాలని, గిలిగింతలు పెట్టే చలిలో ఉల్లాసంగా గడపాలని, కోరుకునే పర్యాటకులు ఈ కాలంలో ఏజెన్సీకి పోటెత్తుతారు. ముఖ్యంగా ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి సందర్శన ఓ అద్భుత అవకాశంగా భావిస్తారు. శీతాకాలంలో ఏకంగా అక్కడ మైనస్ నుంచి 3 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోడై వుంటాయి.
అరకు ఎలా వెళ్ళాలీ అంటే..
విశాఖపట్నం నుండి అరకు వెళ్ళటానికి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే లైను కొత్తవలస-కిరండల్ మార్గం లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వస్తాయి.ప్రకృతి అందాలు చూడాలంటే, వెళ్లేటప్పుడు ట్రైన్, వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. ట్రైన్ అయితే వైజాగ్ లో ఉదయం ‘కిరండల్’ వెళ్లే పాసింజర్ ఎక్కాలి.అది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఉదయం 6:50 కు బయలుదేరి కొండలు, గుహలు, లోయలు దాటుకుంటూ సుమారు 4 గంటలు ప్రయాణం చేసి 10:40 గంటలకు ‘అరకు’ చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో “సిమిలిగుడ” అనే స్టేషన్ వస్తుంది, ఇది భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్‌గేజ్ స్టేషన్ .వెహికిల్ లో ప్రయాణించేవారు కూడా అన్నిటినీ చూస్తూ వెళ్ళచ్చు.
అరకు వెళ్ళేదారిలో అనంతగిరి,సుంకరిమెట్ట అభయారణ్యాలు ఉన్నాయి, అలాగే అరకు చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ ని ,రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్ వంటివాటిని ఇష్టపడేవాళ్ళకి అనుకూలం గా ఉంటాయి.
వెళ్లేపుడు ట్రైన్ లో వెళ్లినా… వచ్చేపుడు బస్సు ప్రయాణం గాని లేదంటే ఒక వెహికిల్ అద్దెకు తీసుకుంటే వచ్చేదారిలో చూడాల్సినవి చూడడానికి ఉంటుంది,వచ్చే దారిలో ‘టైడా’లో జింగిల్ బెల్స్, అనంతగిరి కాఫీ తోటలు లాంటివి చూడవచ్చు.
ఒంపులు తిరిగే రోడ్ లో ప్రయాణం, ఒకరకమైన భయన్ని కలిగించినా ప్రయాణం సాగుతూ ఉంటే ఇష్టం మొదలవుతుంది అలా అనంతగిరి, డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి మండలాల గుండా సాగుతుంది.
ఇక్కడ శీతాకాలం లో వలిసె పూలు బాగా విడుస్తాయి. వలిసె పూల అందంతో పకృతికి పసుపు చీర కట్టినట్టనిపిస్తుంది.అరకు టూర్లో ముఖ్యంగా చూడాల్సినవి..
గిరిజన మ్యూజియం:
మన్యం ప్రజల జీవన విధానం, వారి ఆచార, సాంప్రదాయాలను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించండి. ఇక్కడి చూడచక్కని బొమ్మలు భలే ఆకట్టుకుంటాయి. ఇక్కడ దింసా నృత్య ప్రతిమలు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు బాగుంటాయి. గిరిజన వస్తువులు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయి. ఈ మ్యూజియం అరకులోయలోనే ఉంది.
పుణ్యగిరి ఆలయం..
చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో జలపాతాల హోరు,ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి…. ఉమా కోటిలింగేశ్వర ఆలయం ఉన్న ప్రాంతంలో కోటిలింగాలు, త్రినాథ గుహ, దార గంగమ్మ పుణ్య జలపాతాలను చూడతగ్గవి.పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది.
పద్మాపురం బొటానికల్ గార్డెన్స్
అరకులోయకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మాపురం గ్రామంలో ఈ ఉద్యానవనం ఉంది. విభిన్న వృక్ష, పుష్పజాతులు, ఫలాలను చూడాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్. అరకు లోయ వస్తే తప్పకుండా ఈ ఉద్యానవనాన్ని సందర్శించండి. ఇక్కడి పూల తోటల అందాలు ఫొటోలు తీసుకోడానికి చాలా బాగుంటాయి.
రణజిల్లెడ జలపాతం:
అరకులోయకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. పద్మాపురం ఉద్యానవనం సందర్శించిన తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించండి.
చాపరాయి జలపాతం:
అరకులోయకు 13 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం వుంది. నునుపైన రాయిపై సొగసుగా జాలువారే నీరు పర్యటకులను కనువిందు చేస్తుంది. నీటి వేగం తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు. అయితే, ఇటీవల ఇక్కడ తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మండు వేసవిలోని మిట్ట మధ్యాహ్నం అయినా చాపరాయిలో నీళ్లు చల్లగా ఉంటాయి.
బొర్రా గుహలు:
విశాఖ నుంచి అరకు లోయకు వెళ్లే మార్గంలో అనంత గిరి పర్వత శ్రేణుల్లో, గోస్తానీ నది తీరానికి సమీపంలో ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద గుహలుగా వీటికి పేరుంది. సముద్రమట్టానికి సుమారు 2,313 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహలను 1807లో గుర్తించారు. పర్యటకులు సందర్శించేందుకు వీలుగా ఇందులో రంగు రంగుల విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. బ్రిటీష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ బొర్రా గుహలను వెలుగులోకి తెచ్చారు.
ఒరియా భాషలో బొర్ర అంటే రంధ్రమని అర్థం.అలా సహజంగా ఏర్పడిన బొర్రా గుహలలు కొంతకాలం పాటు నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటంతో గుహలూగా ఏర్పడ్డాయి. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగులతో ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియమ్ బై కార్బనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటివల్లే నేలపై దిబ్బలుగా ఏర్పడ్డాయి. వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారు.ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఈ గుహలలో లైట్ల ని ఏర్పాటు చేసారు.ఈ గుహలో సహజ సిద్దం గా ఏర్పడిన ‘శివ లింగం’ పర్యాటకులని అమితం గా ఆకర్షిస్తుంది.
మత్స్యగుండం జలపాతం
అలాగే మత్య్స గుండం..ఇది రెండు కొండల మధ్య గల గలపారే జలపాతం..వాటిలో ఉన్న బండరాళ్ల మధ్య ఇమిడి ఉన్న ఓ చిన్న గుండమే.. మత్స్యగుండం.
అనంతగిరి జలపాతం:
అరకు లోయకు 26 కిమీల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడి కాఫీ తోటలు, వాతావరణం, జలపాతాలు, ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అనంతగిరిలో వసతి సదుపాయాలకు ఎలాంటి సమస్య ఉండబోదు. ఏపీ టూరిజానికి చెందిన ఒక రిసార్ట్‌తో పాటు పలు హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అనంతగిరికి 11 కిమీల దూరంలోని తైడాలో జంగిల్ బెల్ రిసార్ట్‌లో కూడా స్టే చేయొచ్చు. అనంతగిరికి 9 కిమీల దూరంలో బొర్రా గుహలు ఉంటాయి. ఇక్కడికి వెళ్లేందుకు బస్సు, ఆటో సేవలు అందుబాటులో ఉంటాయి.
అనంతగిరికాఫీతోటలు
రకాల రకాల తోటలకి అరకు వాలీ ప్రసిద్ది చెందింది.అనంతగిరికాఫీతోటల కాఫీ గింజల పరిమళం అరకు లో కి ప్రవేశించగానే పలకరిస్తుంది. . 2007 నుండి ఇక్కడ ‘అరకు ఎమరాల్డ్’ అనే బ్రాండ్ పేరుతో వేలాది మందికి ఉపాధి కలిగించే ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకాన్ని మొదటి సారిగా ప్రవేశపెట్టారు.ఈ కాఫీ తోటల నుండి ఉత్పత్తి చేయబడిన కాఫీ గింజలు మనదేశం లోనే కాదు వీటిని వివిధ దేశాలకు కూడా ఉత్పత్తి చేస్తారు.
అరకు రోడ్డు లో చూడాల్సిన మరో ప్రదేశం.ఇవి తూర్పు కనుమలలోని ఒక భాగం. పూర్వం, ఈ తోట యొక్క ముఖ్య ఉద్దేశం .. రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న సైనికులకు కూరగాయలను సరఫరా చెయ్యడం. ఇప్పుడు ఇది కేవలం బొటానికల్ గార్డెన్ గానే ఉంది. ఈ గార్డెన్ లో వివిధ రకాలైన చెట్లు,పువ్వులూ ఉండి కనువిందుచేస్తాయి.పట్టు పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకం ఎలా జరుగుతుందో… పర్యాటకులకి వివరిస్తారు. పట్టుపురుగులు చుట్టూ అల్లుకున్న గూళ్ల నుంచి పట్టు దారాన్ని ఎలా తీస్తారో అక్కడి వారు చూపిస్తారు.
కటికి జలపాతం:
బొర్రా గుహలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. కొత్తవలస - కిరండోల్ రైలు మార్గంలో 44వ టన్నెల్ వద్ద ఈ జలపాతం ఉంది.
డల్లాపల్లి గిరిజన గ్రామం:
పాడేరుకు 20 కిమీల దూరంలో ఈ గ్రామం ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు.. మధ్యలో గ్రామం. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూస్తే.. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా మనసు పాడేసుకుంటారు.
డుడుమ జలపాతం:
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ముంచంగిపుట్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం వుంది. దూరం నుంచి చూస్తే ఈ జలపాతం పాల ధారను తలపిస్తుంది. దాదాపు 3వేల అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం పారుతోంది. దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఉంది.
కొత్తపల్లి జలపాతం:
పాడేరుకు 30 కిలోమీటర్ల దూరంలో జి.మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామానికి ఆనుకుని చూడచక్కని జలపాతం వుంది. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఈ జలపాతం వుండడంతో ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు.
‘జంగిల్ బెల్స్’ ఫారెస్ట్ రిసార్ట్
విశాఖపట్నం-అరకు ఘాట్ రోడ్డు పై ఉన్న ‘జంగిల్ బెల్స్’ అనే అందమైన ఫారెస్ట్ రిసార్ట్, ఇది రాష్ట్ర పర్యాటక శాఖ తో కలిపి అటవీ శాఖవారు ఉమ్మడిగా ప్రారంభించిన ఎకో టూరిజం ప్రాజెక్ట్ ‘టైడా’లో భాగం.
‘జంగిల్ బెల్స్’ అనే ఈ ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్ అయిదు ఎకరాల మేరకు విస్తరించబడిఉంది.ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 18 కాటేజీలు ఏర్పాటు చేసింది. వివిధ రకాల వన్య మృగాలు ఈ ప్రాంతం లో కనిపిస్తాయి
ఇంకా ఎన్నో...
⦿ సినిమాల్లో చూపించే పసుపు పచ్చని వలిసె పూల తోటలు చూడాలంటే.. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో అరకులోయకు వెళ్లాలి.
⦿ అరకులో ఎక్కడ చూసినా ‘బొంగు’ చికెన్ కనిపిస్తుంది. వెదురు బొంగుల్లో వండే ఈ చికెన్ భలే రుచిగా ఉంటుంది.
⦿ అరకులో పనస వైన్ కూడా బాగా ఫేమస్. అరకు వెళ్తే తప్పకుండా దీన్ని రుచి చూడండి.
⦿ అరకు లోయలో కాఫీ తోటలు కూడా చూడదగినవి.
⦿ అరకులో సాయంత్రం వేళ్లలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వర్షపు తుంపర్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
⦿ వర్షకాలం మినహా ఏ సీజన్లోనైనా అరకులోయను సందర్శించవచ్చు.
⦿ అరకు అందాలను చూడాలంటే రైలు ప్రయాణమే ఉత్తమం. ఈ మార్గంలో విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంది.
ఎలా చేరుకోవాలి?
అరకులోయ విశాఖ జిల్లాలో ఉంది. ఇక్కడికి చేరాలంటే విశాఖపట్నం చేరుకోవాలి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి అరకుకు ఉదయం వేళలో రైలు అందుబాటులో ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి.

![]() |
పద్మాపురంగార్డెన్స్ - ఎంట్రన్స్ |

చాపరాయి జలపాతం |

0 comments:
Post a Comment