Thursday, 20 December 2018

Angkor Wat -History of Ancient Temple - ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది అలనాటి కాంభోజ రాజ్యము, తర్వాత కంపూచియ, నేటి కంబోడియ.లోని “అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం” - టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలో మీటర్ల పరిధిలో దేవతలకు నిలయమైన పవిత్రస్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయం- క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఈ ఆలయ నిర్మాణం- దగ్గరలోని మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్‌ థోమ్.- ఆ దేవాలయం చరిత్ర తెలుపు తెలుగు వీడియో - ఆ దేవాలయం వద్ద తీసిన వీడియో ...మనం అ ప్రాంతం లో ఉన్న భావన కలిగించే వీడియో

భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని “అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం”. ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.కాంబోడియ, అలనాటి కాంభోజ రాజ్యము, తర్వాత కంపూచియ, నేటి కంబోడియ.
Angkor Wat -History of Ancient Temple - ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది అలనాటి కాంభోజ రాజ్యము, తర్వాత కంపూచియ, నేటి కంబోడియ.లోని “అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం” - టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలో మీటర్ల పరిధిలో దేవతలకు నిలయమైన పవిత్రస్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయం-  క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఈ ఆలయ నిర్మాణం- దగ్గరలోని మరో అద్భుత ప్రదేశం  ఆంగ్‌కోర్‌ థోమ్.

చరిత్రను ఓ సారి పరికిస్తే… హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే రుజువులు ఉన్నాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. దీనికి నిదర్శనం కంబోడియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణు దేవుని ఆలయం. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతున్న ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను నాసా బయటి ప్రపంచానికి అందించింది. అక్కడ దాదాపు ప్రపంచానికి తెలియకుండా దాగిన 200 అద్భుతమైన చిత్రాలను కనుగొన్నది. ఆంగ్‌కోర్ వాట్ దేవాలయంలో దాగిన రహస్యాలపై స్పెషల్ స్టోరి.

ఉత్తర కాంబోడియాలో సియమ్‌రీప్‌ అను పట్టణం దగ్గర 200 చదరపు కిలో మీటర్ల పరిధిలో దేవతలకు నిలయమైన పవిత్రస్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంగ్‌కోర్‌ వాట్‌, బయాన్‌ అను దేవాలయాలతోబాటు అనేక దేవాలయాలు విలసిల్లు చున్నవి. ఖెమర్‌ రాజులచే కట్టబడిన ఈ దేవాలయం మన హిందూ నాగరికతకు ఆనవాళ్ళు. మూడవ శతాబ్దం నుండి దాదాపు వేయి సంవత్సరాలకు పైగా హైందవ నాగరికత కంబోడియలో విరాజిల్లింది
విష్ణు భగవానుడు

కాంబోడియలో దాదాపు 1016 దేవాలయాలున్నాయని ప్రసిద్ధి. అందులో అంగ్‌కోర్‌ ప్రావిన్స్‌ నందు 294 దేవాలయాలున్నాయి. వీటిలో అంగ్‌కోర్‌ ప్రాంతంలో 198దేవాలయాలున్నవి. బట్టంబాన్స్‌ ప్రావిన్స్‌ ధాయిలాండ్‌ సరిహద్దులో నున్నది. ఆ ప్రాంతమునందు 340 దేవాలయాలు వున్నవి. సియామ్‌రీప్‌ పట్టణానికి చుట్టుపక్కల హిందూ దేవాలయాలతో బాటు బౌద్ధ దేవాలయాలు కూడా వున్నాయి.

హిందూ దేవాలయాలతో మొదలైన నాగరికత మధ్యలో 12వ శతాబ్ద మందు ఏడవ రాజు జయవర్మన్‌ కంటే ముందు బౌద్ధమత వ్యాప్తి జరిగింది. రాజు బౌద్ధమతం అవలంబించుటచే స్వతహాగా, రాజు అనేక బౌద్ధ దేవాలయాలు నిర్మించినప్పటికి… ఆ దేవాలయములందు హిందూ దేవతల ప్రతిమలు చెక్కబడినట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎనిమిదవ జయవర్మన్‌ రాజు 13వ శతాబ్దమందు అనేక బౌద్ధ దేవాలయములను హిందూ దేవాలయాలుగా మార్పు చేసారు.

ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది.

ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం భారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
భారతదేశం లో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందినది.

ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందదనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.

ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్‌ ఆర్కియాలజిస్ట్‌ ఫిలిప్‌ గ్లోసియర్‌ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధ్రువపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపిస్తాయి

ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు… ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు అలాగే ఉండిపోతారు కూడా.

ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్‌ – రిలీఫ్స్‌ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న ‘మంటన్‌’ అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి.

కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్‌ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురుషాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్‌ వాట్‌ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.

భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో ‘కాంభోజ దేశం’ అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది.

కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్‌ సాప్‌ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి.

ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆ దేశ జాతీయ పతాకంలో స్థానం సంపాదించుకుంది. సుమారు 30 సంవత్సరాలు నిర్మించిన ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు.

ఆనాటి ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని వాడారు. ఆ అద్భుత టెక్నాలజీని ఆంగ్‌ కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడటంతో ఆ దేవాలయం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

ఇంజనీరింగ్ అద్భుతం అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అర్కియాల జస్టులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు.

ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్’ రాళ్లనుఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్’ రాళ్లను ఎంపిక చేశారు. అది నాసా తీసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలనువాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు.

నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయి.


 దేవాలయంలో దాగి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ ను నాసా లేజర్ టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది. గోడలపై ఏనుగులు అలాగే దేవుడి బొమ్మలు అలాగే టవర్స్ వంటి చిత్రాలను గీసారు. ఈ చిత్రాలను చూస్తే భవిష్యత్ టెక్నాలజీకి వారు ముందు అంకురార్పణ చేశారని అనిపిస్తుంది.

సంగీతానికి సంబంధించిన అనేక పరికరాలు ఈ చిత్రాల్లో దాగి ఉన్నాయి. అలాగే ఆ కాలంలోనే వాడిన బోట్ల టెక్నాలజీని చూసిన శాస్ర్తవేత్తలు ఆశ్చర్యపోతున్నారు వారి తెలివికి సలాం చెబుతున్నారు. రామయణానికి సంబంధించిన పెయింటింగ్స్ గోడలపై అబ్బురపరుస్తున్నాయి. సింహాలు, కోతులు, అలాగే ఆంజనేయస్వామి వంటి చిత్రాలను నాసా తన కెమెరాలో బంధించింది.మొత్తం 500 ఎకరాల్లో దాదాపు 200 పెయింటింగ్ చిత్రాలను ఆస్ట్రేలియన్ అర్కియాలజిస్ట్ సేకరించారు. చీకటి ప్రపంచంలో దాగిన ఈ కళాఖండాలను వెలుగు ప్రపంచంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కింది.

ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్ చిత్రాల్లో గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాలు. ఆ కాలంలోనే గుర్రపు స్వారీల్లో ఆరితేరిపోయినట్లుగా కనపడుతున్నాయి. అంతే కాకుండా భవిష్యత్ లో ఈ నాగరికత గురించి తెలుసుకునేందుకు వారు ముందుగానే అక్కడ ఈ పెయింటిగ్ చిత్రాలు వేశారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

మొత్తం అయిదు శిఖరాలు ఉంటాయి. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి. 1,352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్’ పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. ఉషోదయ వేళ గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది.

అప్పట్లో రారాజుగా.. వేద భూమిగా మన్ననలు పొందిన ఈ దేవాలయం ఆ తర్వాతి కాలంలో తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కొన్ని ఏళ్ల తరువాత కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఆ ఆలయం తిరిగి వెలుగు చూసింది.

కంబోడియా జాతీయ పతాకంపై ‘ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయ చిత్రం ఉంటుందంటే, ఆ దేశం ఈ ఆలయానికి ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించిన సూర్యవర్మ మరణానంతరం తన అస్థికలను ఒక పేటికలో ఉంచాలని ఆదేశించాడట. తన మరణానంతరం అలా చేయగానే ఆయన మోక్షం పొందాడనేందుకు సూచనగా విష్ణుమూర్తి విగ్రహం కళ్లు తెరిచిందట. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన దివ్యధామం ‘ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయం.

ఆంగ్‌కోర్‌ థోమ్.

ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్‌ థోమ్. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్‌ రాజు ప్రతిమలు, బెయాన్‌, బఫూన్‌ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్‌ థోమ్‌ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్‌ టవర్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్‌ దేవాలయం ఆంగ్‌కోర్‌ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది.
ఖ్మేర్‌ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మన్‌ - 6 ఆంగ్‌కోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే ‘గ్రేట్‌ సిటీ’ అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏను గుల మిద్దెలు, లెపర్‌ రాజు ప్రతిమలు, బెయాన్‌, బఫూన్‌ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్‌ థోమ్‌ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్‌ టవర్‌ (బెయాన్‌) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్‌ (బుద్ధుని) దేవాలయంలో ఆంగ్‌కోర్‌ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది.ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూ చియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి

ప్రపంచం లోనే అతి పెద్ద వైష్ణవ దేవాలయం గురించి తెలుసా..? | Angkor Wat History | Eyecon Facts





ANGKOR WAT TEMPLE  VIDEO...ఆ దేవాలయం వద్ద తీసిన వీడియో

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top