రెండు కొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న వాట్సాప్
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం Consecutive Voice Messages, Group Call Shortcut పేర్లతో మరో రెండు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిందిConsecutive Voice Messages
వాట్సాప్ ఈ Consecutive Voice Messages ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్ అయిన 2.8.362 లో పొందుపరిచింది. ఈ ఫీచర్ లో Consecutive Voice Messages ను కంటిన్యూస్ గా ప్లే చేసి వినిపిస్తుంది. వాట్సాప్ రెండు,మూడు వాయిస్ మెసేజ్‌లను డిటెక్ట్ చేసిన వెంటనే ఈ ఫీచర్ వర్క్ చేయడం ప్రారంభిస్తుంది.ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని వాట్సాప్ రిసీవర్ కు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను ఆటోమేటిక్ గా సీక్వెన్స్ లో ప్లే చేయడం జరుగుతుంది
ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే...
ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే రిసిప్టెంట్ కనీసం ఒక వాయిస్ నోట్‌నైనా ప్లే చేయవల్సి ఉంటుంది . ఒక్కో వాయిస్ నోట్ ఎండ్ అయ్యే సమాయానికి వాట్సాప్ ఓ షార్ట్ ఆడియో టోన్‌ను ప్లే చేస్తుంది. ఈ ఇండికేటర్ టోన్‌ను తరువాత ప్లే అవ్వటానికి సిద్థంగా ఉన్న వాయిస్ నోట్‌కు సంబంధించినదిగా యూజర్ గుర్తించాల్సి ఉంటుంది.
Group Call Shortcut...
ఈ గ్రూప్ కాలింగ్ కోసం ఒకరికి కాల్ చేసిన తర్వాత మరొకరికి కాల్ చేసుకోవాల్సి ఉండేది . అయితే వాట్సప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో ఇప్పుడు ఒకే సారి అనుకున్న వారితో గ్రూప్ కాలింగ్ చేసుకోవచ్చు. గ్రూప్ కాల్ బటన్‌తో ఏక కాలంలో ఎంపిక చేసిన వారిని కాల్లోకి తీసుకోవచ్చు. అయితే ఈ గ్రూప్ కాలింగ్ నలుగురితో మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆడియో, వీడియో కాల్స్‌కు ఇది వర్తిస్తుంది....
ఆడియో, వీడియో కాల్స్‌కు ఇది వర్తిస్తుంది. అంతే కాకుండా గ్రూప్‌లోని ముగ్గురు వ్యక్తులతో ఒకేసారి చాట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐఓస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
0 comments:
Post a Comment