Search This Blog

 • అమ్మ ఓడి - లేటెస్ట్ అప్డేట్స్.. NEW...
 • MORE TO VIEW

Friday, 2 November 2018

Sardhar vallabahi Patel Brief Note

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి- జాతీయ ఐక్యతా దినోత్సవం
October 31


స్వాతంత్ర్య సమరంలో ఉక్కు పిడుగు. ఆలోచనల్లో అగ్గిపిడుగు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు భారత ముఖచిత్రాన్ని మార్చేశాయి. సమైక్య భారతాన్ని ఆవిష్కరించాయి. ఒక్కసారి కమిట్ అయితే వెనక్కి తగ్గని నైజం ఆయనది. ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడేవారు కాదు. కుండ బద్దలు కొట్టినట్లు సూటిగా ఉన్నట్లు చెప్పేయడమే ఆయన తత్వం. అదే ఆయన్ను మిగతా సమరయోధులకు భిన్నంగా చరిత్ర పుటలపై నిలిపింది. జీవితాంతం ఉక్కు సంకల్పంతో కదిలిన ఆ దార్శినీకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్. 

సర్దార్ వల్లభాయ్ పటేల్.... ఈ పేరు వింటే చాలు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఎందుకంటే సూటిగా, నిజాయితీగా, నిర్భయంగా, నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టడం పటేల్ నైజం. 

1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు పటేల్. పదో తరగతి పాస్ కావడానికి చాలా ఏళ్లు పట్టింది. 22 ఏళ్ల వయసులో మెట్రుక్యులేషన్ పూర్తిచేశారు. ఆవారాగా తిరగడానికి తప్ప మరెందుకూ పనికిరాడని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అందుకే పటేల్ పై పెద్దపెద్ద ఆశలు కూడా పెట్టుకోలేదు వారు. కానీ.. పటేల్ మొండి మనిషి. పట్టుదల బాగా ఎక్కువ.

 పట్టుబడితే వే ప్రసక్తే లేదు అన్నట్లు ఉండేవారు. ఆ పట్టుదలతోనే తెలిసున్న లాయర్ల దగ్గర పుస్తకాలు తీసుకుని కష్టపడి బారిస్టర్ కోర్సు పూర్తి చేశారు. అదికూడా మామూలు బారిస్టర్ కాదు. పటేల్ వాదించాడంటే కేసు గెలిచినట్లే. అంత గొప్ప బారిస్టర్ అయ్యారు. ఆ సమయంలోనే బ్రిటీష్ వాడి దాష్టీకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

తెల్లోడి నీడ చూసినా పటేల్ రక్తం సలసలా కాగిపోయేది. గుండె కసితో రగిలేది. కళ్లు చింతనిప్పులయ్యేవి. బతుకుదెరువుకు ఇక్కడికొచ్చి మన నేలపై మన బతుకులను చిద్రం చేయడమేంటని మండిపోయేవారు పటేల్. ఆగ్రహంతో భగ్గుమనేవారు. అదే పటేల్ కు దూకుడు నేర్పింది.

ఓసారి గుజరాత్ లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పంటలు లేక బోరుమంటున్నారు.

 సరిగ్గా ఆ సమయంలోనే బ్రిటిష్ అధికారులు పన్నులు కట్టలేదని ప్రజల ఆస్తిపాస్తులను కబ్జా చేసుకోవడం, అడ్డొచ్చిన వారిని కొట్టడం, ఎదురు తిరిగితే కాల్చి చంపడం చేశారు. దాన్ని సహించలేకపోయారు పటేల్. అందర్నీ ఒకతాటిపైకి తెచ్చి ఉద్యమాలు చేయించారు. ఎవరూ పన్నులు కట్టొదని ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో బ్రిటిష్ అధికారులు బెంబేలెత్తిపోయారు. పటేల్ ను అరెస్ట్ చేశారు. అయితే సర్దార్ లేకపోయినా ఆయనిచ్చిన స్ఫూర్తి జనం గుండెల్లో ఉండిపోయింది. ఎవరూ పన్నులు కట్టమన్నారు. చివరికి చేసేది లేక ఆ ఏడాదికి పన్నులు రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో జనం దృష్టిలో పటేల్ పెద్ద హీరో అయ్యారు. ఆయన ధీరత్వానికి మురిసిన జనం సర్దార్ బిరుదునిచ్చారు. అప్పటి నుంచే సర్దార్ పటేల్ అయ్యారాయన.

36 ఏళ్ల వయసులో లండన్ వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసిన పటేల్... తర్వాత అహ్మదాబాద్ లో సెటిల్ అయ్యారు. మొదట్లో ఇంగ్లీష్ స్టైల్లో వేషధారణతో కనిపించారు. అయితే ఆ తర్వాత దాన్ని పక్కనపడేసి ఖాదీ ధరించడం మొదలు పెట్టారు. అద్భుతమైన లాయర్ గా పేరుగడించినా స్వతంత్ర పోరాటం కోసం లాయర్ వృత్తిని పక్కనపెట్టేసి స్వాతంత్ర్య సమరభూమిలోని దూకారు. ఇక అక్కడి నుంచి పటేల్ వెనుదిరిగి చూడలేదు.

దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. గుజరాత్ లో సర్దార్ అలుపెరుగని పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారు.

 సరిగ్గా ఆ సమయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందిపుచ్చుకున్న పటేల్ గుజరాత్ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జయప్రదం చేశారు. గాంధీ పోరు బాట, ఆలోచన తీరుపట్ల ఆకర్షితులైన ఆయన... రాత్రి, పగలు తేడా లేకుండా పోరాటాల్లోనే గడిపారు. ఫలితంగా తరచూ జైలు కెళ్తూ ఉండేవారు.

గుజరాత్ లో స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఓ గట్టి నాయకుడు ఉంటే బాగుంటుందని గాంధీ అనుకున్నారు.

పటేల్ సమక్షంలోనే ఆ ప్రస్తావన వచ్చింది. అంతే మరో ఆలోచనే లేకుండా సర్దార్ నేనుటానంటూ ముందుకొచ్చారు. గాంధీ పొంగిపోయారు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహానికి గాంధీ పిలుపునిచ్చారు. మళ్లీ పటేలే దాన్ని భుజానికెత్తుకొని గుజరాత్ అంతటా నినాదాలతో మార్మోగించారు.

ఉద్యమాల కాలంలో గాంధీ, పటేల్ ఇద్దరూ ఎరవాడ జైలులో బంధీలుగా ఉన్నారు. ఆ జైలు జీవితంలో వారి మధ్య మంచి స్నేహం కుదిరింది. గాంధీ సిద్దాంతాలు, ఆలోచనలు విన్నాక గాంధీపై పటేల్ కు విపరీతమైన గౌరవం పెరిగింది. పటేల్ ఆలోచనలు విన్న గాంధీ ఆయన్ను అమితంగా ప్రేమించారు.

గాంధీని ఓ పెద్దన్నలా చూసేవారు పటేల్. పటేల్ ను ఓ చిన్న తమ్ముడిలా ఆప్యాయత పంచేవారు గాంధీ.

 జైలులో రోజూ దేశ, విదేశీ రాజకీయాల గురించి చర్చించుకోవడం, స్వాతంత్ర్య సమరంపై సమాలోచనలు చేయడం గాంధీ, పటేళ్ల రోజూవారీ కార్యక్రమాలయ్యాయి. ఆ సమయంలోనే గాంధీజీ... పటేల్ కు సంస్కృత భాష నేర్పించారు. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి జైలు జీవితం వారికి బాగా ఉపకరించింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో క్విట్ ఇండియా  ఉద్యమాన్ని నెహ్రూ ప్రతిపాదించారు. కాంగ్రెస్ లో గాంధీ మినహా మెజారిటీ ప్రజలు దానికి సై అన్నారు. గాంధీని అన్ని విషయాల్లో సమర్ధించే పటేల్ కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు తెలిపారు.


ఎందుకంటే ఆ నినాదం చేసిన వెంటనే బ్రిటీష్ వాడు తమ దేశం వెళ్లకపోవచ్చు కానీ.. భారత్ లో మనల్ని ఎంతోకాలం ఉండనివ్వరన్న సంకేతం మాత్రం వారికి వెళ్తుందన్నది పటేల్ ఆలోచన. అందుకే మరో ఆలోచనే లేకుండా క్విట్ ఇండియా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

బ్రిటిష్ పాలకుల దుర్నీతిని ఎండగట్టే క్రమంలో పటేల్ రాజీ లేకుండా వ్యవహరించారు.

 కేవలం పోరాడండని పిలుపునిచ్చి ఊరుకోకుండా తానే పోరాటానికి సారధ్యం వహిస్తూ ముదుకు నడిపించారు. తనకు ఆత్మబంధువులాంటి మహాత్మా గాంధీ ప్రాణాలు కోల్పోయినప్పుడు పటేల్ కుప్పకూలిపోయారు. తాను హోంమంత్రిగా ఉండి కూడా బాపూజీని రక్షించుకోలేకపోయానే అంటూ కుమిలిపోయారట.

నాన్చుడు వ్యవహారాలు, మాటలు మార్చడాలు పటేల్ కు ఇష్టం ఉండవు
 ఎదుటివారు ఏమనుకున్నా సరే మనసులో ఉన్న మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేయడమే ఆయనకు తెలిసింది. అదే ఆయన బలం,  బలహీనత కూడా. అందుకే ఆయన్ని చరిత్ర పుటలపై తిరుగులేని యోధుడిగా నిలబెట్టింది.
----------------------
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయమది. అంతటా పండుగ వాతావరణం. కానీ.. అంతలోనే విషాదం. మతపరంగా దేశవిభజన.

 ఆ క్రమంలో వెలువెత్తిన హింస నెత్తుటేరులు పారించింది. ముస్లింలంతా పాక్ వైపు, హిందువులంతా భారత్ వైపు వలసలు పోయారు.

ఎర్రకోటపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దాదాపు రెండు శతాబ్దాల భారత ప్రజల నిరీక్షణ ఫలించింది. సరిగ్గా ఆ సమయంలోనే దేశంలో అల్లర్లు మొదలయ్యాయి. హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు రేకెత్తాయి. పాకిస్తాన్ కు ప్రత్యేక దేశ ప్రతిపత్తి కావాలంటూ ఉద్యమాలు జరిగాయి.

దేశం విడిపోవడానికి వీల్లేదని కాంగ్రెస్ లో కొందరి వాదించారు.

 అయితే పటేల్ మాత్రం దేశ విభజనకే మొగ్గు చూపారు. ఇప్పుడు ఒక్క విభజనను అడ్డుకోవాలని చూస్తే ఎన్నో విభజనలకు ఆస్కారం రావచ్చంటూ వ్యాఖ్యానించారు. అందుకే భారత్ పాకిస్తాన్ లలో ఎవరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చని పటేల్ పిలుపునిచ్చారు.

చాలామంది ముస్లింలు పాక్ వైపు పరుగులు తీశారు. అక్కడి నుంచి ఎక్కువమంది హిందువులు భారత్ వైపు తరలారు.  ఈ క్రమంలో పెద్దఎత్తున హింస చెలరేగడం, కేవలం మతమే ప్రాతిపదిక కావడం పటేల్ ను కలచివేసింది.

దీంతో ఆయన స్వయంగా సరిహద్దు గ్రామాల్లో తిరిగి అల్లర్లు పెద్దవి కాకుండా ప్రసంగాలు చేశారు. పాకిస్తాన్ వెళ్లే ముస్లింలపై దాడులు చేస్తే భారత్ వచ్చే వారిపై దాడులు జరుగుతాయంటూ.. అది సబబు కాదని ప్రజలకు పిలుపునిచ్చారు.

పటేల్ పిలుపు తర్వాత కూడా అల్లర్లు ఆగలేదు. ముసలి, ముతక, చిన్నా, పెద్దా అన్న తేడా లేదు ముష్కర మూకలు నెత్తుటేరులే పారించాయి. ఈ సమయంలోనే ఢిల్లీలోని లక్షలాది ముస్లింలకు ధైర్యం చెప్పడానికి పటేల్ బయలుదేరి వెళ్లారు.

వారిలో కొందరు పటేల్ పై నిప్పులు చెరిగారు. కొందరు మా ప్రాణాల్ని బలితీసుకుంటున్నారంటూ వాపోయారు. ఇదేం న్యాయమంటూ ప్రశ్నించారు. వెంటనే పోలీసుల్ని పిలిచి ఒక్క ముస్లిం కూడా తనకు అన్యాయం జరుగుతుందని అనడానికి వీళ్లేదంటూ, వారి ప్రాణాలకు మీ ప్రాణాలు అడ్డు పెట్టండంటూ పటేల్ ఆదేశాలు జారీ చేశారు. 

స్వాతంత్ర్యం ఓ సంబరం అయితే దేశ విభజన పెను విషాదాన్ని మిగిల్చింది.

 ఆనాటి ఘోరాలను తలచుకుంటే గుండెలు బరువెక్కుతాయి. కళ్లు చెమర్చుతాయి. ఆరోజున సరిహద్దు రేఖలు నెత్తుటి ఛారికలయ్యాయి. ఉపఖండం ప్రజలు కాలం పరిచిన కత్తుల వంతెనపై నడిచారు.

దేశ సరిహద్దులు కత్తి గాట్లయితే, నగరాలు నిప్పుల కుంపట్లయ్యాయి. ఎక్కడ చూసినా అల్లకల్లోలం. హాహాకారాలు, ఆర్తనాదాలు. ఆ అరుపులతో ఉపఖండం ప్రతిధ్వనించింది. ఊళ్లకు ఊళ్లు, నగరాలకు నగరాలు ఖాళీ అయ్యాయి.

ఆ హింసాకాండలో దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మనిషి తెచ్చిన మహా విలయం. ఎడ్లబండ్లు, రైళ్లు, ఇతర వాహనాలు, వలస జీవులతో కిక్కిరిసిపోయి అటూ  ఇటూ పరుగులు తీశాయి. మనిషి తెచ్చిన ఈ ప్రళయం కోట్లాదిమంది గుండెలను నిలువునా కోసింది. మానని గాయం చేసింది. 


స్వతంత్ర్య పోరాటం సక్సెస్ అయింది.. తెల్లవాడి దాస్యసుంకలాలనుంచి దేశానికి విముక్తి లభించింది.

 కానీ.. స్వతంత్ర భారతానికి ఎన్నో సవాళ్లు. వాటిని అధిగమించాలంటే ఓ గొప్ప నాయకుడు కావాలి. ఆ సమయంలో గాంధీ, నెహ్రూలకు ఒకే ఒక్కడు గుర్తుకొచ్చాడు. ఆ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్.

తెల్లవాడు పోయాడు. పరాయి పాలన తెల్లారింది. అయితే 500కు పైగా స్వతంత్ర సంస్థానాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వాటన్నింటిని కలుపుకొని సమైక్య భారతాన్ని ఆవిష్కరించాలన్నది కాంగ్రెస్ ఆలోచన.  అయితే అది అంత తేలికైన పని కాదు.

ఆ సంస్థానాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాజ్యాలు కూడా ఉన్నాయి. వాటిపై పాకిస్తాన్ కన్నేసింది. ఏ మాత్రం దుందుడుకు నిర్ణయాలు తీసుకున్నా దేశంలో మతపరంగా అల్లకల్లోలాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఆ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో పాలుపోలేదు.

అప్పుడు గాంధీజీ పటేల్ ను పిలిపించి ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుందని, నువ్వు రంగంలోకి దిగక తప్పదని భుజం తట్టారు. నెహ్రూ కూడా పటేల్ చొరవ తీసుకోవాలని కోరారు. అలా ఓ బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు భారత్ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.

సంస్థానాల అధిపతులను పిలిపించుకొని వారితో మర్యాద పూర్వకంగా చర్చలు జరుపుతూనే స్వతంత్ర్య భారతంలో మీరు భాగస్వామ్యులు కావాలంటూ ఆహ్వానించారు. సంస్థానాలను దేశంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తరపు నుంచి భారీ నజరానాలు పారితోషకాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.

పటేల్ మాట ఇస్తే దాని మీదే నిలబడతారని అందరికీ తెలుసు. అందుకే ఆయనతో చర్చలు జరిపిన ప్రతి సంస్థానాధిపతి మరుక్షణంలోనే తమ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి ముందుకొచ్చారు. కేవలం మూడే మూడు సంస్థానాలు  విలీనానికి ముందుకు రాలేదు. అవే కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ జునాఘడ్ పై పాకిస్తాన్ కన్నేసింది. అయితే పటేల్ అక్కడకు వెళ్లి స్వయంగా అక్కడి ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.

ఎవరైనా సరే భారత్ లో ఉండాలనుకునే వారు ఇక్కడే ఉండిపోవచ్చు. పాకిస్తాన్ వెళ్లాలనుకునేవారు సగౌరవంగా అక్కడికి వెళ్లొచ్చంటూ ఉద్వేగభూరిత ప్రసంగం చేశారు. అంతే మెజారిటీ ప్రజలంతా భారత్ లో జునాఘడ్ విలీనం కావాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం విలీనం చేయడానికి మాత్రం నిజాం ఒప్పుకోలేదు. రజాకార్ వ్యవస్థకు ఆధ్యుడైన కాసిం రజ్వీ ఈ విషయంలోనే పటేల్ ను కలిసి హైదరాబాద్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేసేది లేదని స్పష్టం చేశారు.

 అనవసరంగా తమ జోలికి వస్తే భారత సైన్యానికి సృంగభంగం తప్పదని అల్టిమేటం కూడా ఇచ్చారు. అయితే రజ్వీతో చిరునవ్వుతో చర్చలు సాగించిన పటేల్.. తన ఉక్కు సంకల్పాన్ని మాత్రం బయటపెట్టలేదు. రజ్వీ హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజుల్లోనే పటేల్ యుద్ధ వ్యూహం అమలయ్యింది.

ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా దేశంలో విలీనం చేయాలని పటేల్ వ్యూహ రచన చేశారు. సెప్టెంబర్ 18న హైదరాబాద్ భారత హస్తగతమైంది. నిజాం నవాబు లొంగిపోయాడు.

పటేల్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చుంటే కశ్మీర్ సమస్య తలెత్తేదే కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్, జునాఘడ్ లను విలీనం చేసినట్లే సర్దార్ పటేల్ జమ్మూ కాశ్మీర్ ని కూడా విలీనం చేసి ఉండేవారని చెబుతున్నారు. నెహ్రూ తదితరలు అడ్డుపడడం వల్లే కశ్మీర్ విషయంలో ఏం చేయలేకపోయారని, ఇప్పుడదే కాశ్మీర్ రావణకాష్టంలా కాలుతోందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పటేల్ లాంటి ఉక్కుమనిషిని చిరస్మరణీయంగా భారతీయులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు...

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top