⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Monday, 26 November 2018

Salihundam - వెలుగు చూసిన బుద్ధుని ఏక శిలా విగ్రహం- సాలిహుండాం లో బయటపడ్డ వైనం -శ్రీకాకుళం లో బౌద్ధ సంస్కృతి దంతపురి -జగతి మెట్ట--దుబ్బకవానిపేట - ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శాలిహుండం కాళీయ మర్దన వేణుగోపాలుని యాత్ర / సాలిహుండాం యాత్ర

వెలుగు చూసిన బుద్ధుని ఏక శిలా విగ్రహం- సాలిహుండాం లో బయటపడ్డ వైనం





సాలిహుండాం 
జిల్లాలోని గార మండలం శ్వేతగిరి  పై వెలసియున్న కాళీయ మర్దన వేణుగోపాలుని కొండపై బుద్ధుని ఏకశిలా విగ్రహం వెలుగుచూసింది. జగతిపుట్టగా పేరొందిన ఈ ప్రాంతంలో బుద్ధుని విగ్రహం వెలుగుచూడడంతో సమీపంలో గల బుద్ధుని కొండతో పాటు ఈ కొండ పై కూడా బౌద్ధ్భిక్షువులు సంచరించి ఆవాసాలు ఏర్పాటు చేసుకుని మత ప్రచారం గావించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


 పరిచారికలు వింజామరలు విసురుతుండగా బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఏక శిలావిగ్రహం వెలుగు చూడడంతో స్థానికంగా పలు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బుద్ధుని కొండ గుట్ట పైన నుయ్యి వంటి ప్రదేశం మాదిరే వేణుగోపాలుని కొండ పై కూడా పడమటి భాగ శిఖరాగ్రాన ఉండి అక్కడ ఈ విగ్రహం వెలుగుచూసింది. పూర్వము శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారము) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు. శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నగ్రామము. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగపట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరములో ఉంది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధకాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.

శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశములో ఎ.హెచ్.లాంగ్‌హర్స్ట్, టి.ఎన్.రామచంద్రన్ మరియు ఆర్.సుబ్రహ్మణ్యన్ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. గతంలో సముద్ర గర్భాన ఖనిజాల అన్వేషణకి  గాను నావికాదళం వారు జర్జంగి, సాలిహుండాం కొండలపైనుండి పరిశోధనలు గావించారు. అప్పట్లోనే ఈ అవశేషం వెలుగు చూసినా అంతగా ప్రాచుర్యం పొందలేదు. వేణుగోపాలుని ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో గుట్ట మాదిరి ఉన్న ప్రదేశంలో ఈ విగ్రహం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో చుట్టూ నాలుగు రాతి స్తంభాలతో మండపం మాదిరి ఉన్న కట్టడం ఉండేదని, ఆ పక్కనే ఈ ఏకశిలా విగ్రహం ఉండేదన్నది స్థానికుల కథనం. ప్రస్థుతం ఈ ప్రాంతంలో మండపం జీర్ణావస్థకు చేరింది. అలాగే బ్రిటీష్ కాలంలో కళింగపట్నం వాడరేవు వినియోగంలో ఉన్నప్పుడు నావికులు ఈ కొండను దిక్సూచిగా ఉపయోగించుకునేవారన్నది చారిత్రక కథనం. ఇందుకు నిదర్శనంగా ఈ కొండ శిఖరాగ్రాన అప్పట్లో నిర్మించిన దిమ్మెను పోలిన కట్టడం నేటికీ చెక్కుచెదర కుండా ఉంది. ఇప్పటికే ఈ కొండ ను ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెల్తుంది. బుద్ధుని కొండను ప్రభుత్వం శాఖాపరంగా ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో అదే మాదిరి వేణుగోపాలుని కొండను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటక పరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉండగా పోలాకి మండలం దుబ్బకవానిపేట సమీపాన జరిపిన త్రవ్వకాల్లో క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నాటి బౌద్ధస్థూపం బయటపడింది. జగతిపాడు దిబ్బపైన ఇటుకుల అరుగులమీద ఇది నిర్మిమై ఉంది. ఈ స్థూపం తక్షశిలలోని భౌద్ధస్థూపాన్ని తలపిస్తుంది. తవ్వకాల్లో బయటపడిన విహారాలు, వరండాలు, నేలపై సున్నపు కాంక్రీటు రెండువేల ఏళ్ళుగా చెక్కుచెదరకపోవడం విశేషం. ఒక్కొక్క ఇటుక 60 సెంటీమీటర్ల పొడు, 30 సెంటీర్ల వెడల్పు మందముంది. ఈ ఇటుకలు శాతవాహన కాలంనాటవని, తవ్వకాల్లో భౌద్ధ్భిక్షువులు నివసించిన విహారాలు, అప్పట్లో మురిగినీటి కాలువలు నిర్మాణం నాటి ఇంజనీరింగ్ వ్యవస్థకు అద్దం పడుతుంది

శ్రీకాకుళం లో బౌద్ధ సంస్కృతి

దంతపురి :

కళింగ సీమ ఒకనాడు స్వర్ణయుగాన్ని అనుభవించిన బౌద్ధ సంస్కృతికి పట్టుగిమ్మ . ఆ నాడు బౌద్ధ వాజ్ఞ్మయానికి ప్రధాన కేంద్రం గా సరుబుజ్జిలి మండలం లోని దంతపురి విలసిల్లినది . కొన్ని శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది . ఎంతో విలువైన , అపురూపమైన ప్రాచీన వారసత్వ సంపదకు సాక్షీభూతంగా నిలిచింది,. ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురియైనది . ఎన్నో విగ్రహాలు మాయమైపోయాయి. రాజుల కాలం నాటి రాతి విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు . ఫలితం గా ఇది శిధిలావస్థకు చేరింది .


దంతపురి స్థల విశిస్టతను తెలియజేసేందుకు ప్రబుత్వము 2005 సం.లో తొలిసారిగా బౌద్ధ ఉత్సవాలు నిర్వహించినది . సమావేశమందిరము , అతిధి గృహము నిర్మించినది . అనంతరము వాటి నిర్వహణ బాధ్యత తీసుకోలేదు . ఇప్పుడవి శిధిలావస్థకు చేరుకున్నాయి. కొంతకాలము క్రితం ఇక్కడ ప్రభుత్వము పేపర్ మిల్లు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సుమారు 500 ఎకరాలు భూమిని సేకరించినది . తరువాత ఆ విషయమే మర్చిపోయింది .



జగతి మెట్ట--దుబ్బకవానిపేట :
వేల సంవత్సరాల నాటి బౌద్ధ సంస్కృతి ఆనవాళ్ళు బయల్పడిన పోలాకి మండలం దుబ్బకవానిపేటలోని జగతి మెట్ట ప్రాంతం . ఇక్కడ విలువైన వస్తువులు వంటగది , కొలను , నివాస స్థలాలు బయటపడ్డాయి. ఇక్కడ లభించిన ఆధారాలకు గార మండలం లోని శాలిహుండాం వంశధార పరివాహక ప్రాంతం లో ఉన్నవాటితో పోలికలు ఉన్నాయి . ఇక్కడ ప్రాచీన కాలం నాటి ఇటుకలు , రాళ్ళు ఉన్నాయి




విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జాతర్లకు, సామూహిక ఉత్సవాలకు కొదువ లేదు. నిజానికి ఈ మూడు జిల్లాల్లోనూ కలిపి జరిగే రెండు జాతర్లకు దేశ వ్యాప్త ప్రాచుర్యం వుంది. శ్రీకాకుళం జిల్లాలో.... ఏప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలను విలువనిచ్చే విధంగా పర్వదినాలు, ఉత్సవాలు జరుపుకుంటారో ఆ ప్రాంతం వైభవంగా విరాజిల్లుతుందని పెద్దలు చెబుతారు. భీష్మ ఏకాదశి రోజున సాలిహుండాలం వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగే జాతరకు ప్రత్యేకత ఉంది. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. భీష్మ ఏకాదశి జాతరను సాలిహుండాం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి ఆనందోత్సాహలతో జరుపుకుంటారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శాలిహుండం కాళీయ మర్దన వేణుగోపాలుని యాత్ర / సాలిహుండాం యాత్ర

శ్రీకాకుళం జిల్లాలో పది టూరిజం స్పాట్స్ లో సాలిహుండాం కి ఒక సముచిత స్థానము ఉన్నది . ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశము . సాలిహుండాం వంశధార నది దక్షిణ ఒడ్డున బోరవానిపేట గ్రామానికి ఆనుకొని కళింగపట్నం కి 05 కిలోమీటర్లు , శ్రీకాకుళం టౌన్‌ కి 18 కిలోమీటర్ల దూరములో ఉన్నది . ఈ Buddist hill ని సాలివాటిక (Rice emporium) అని పిలుస్తారు . ఈ కొండపైన పురాతన వేణుగోపాలస్వామి ఆలయము సాలివాహన కాలము నుండి వెలసియున్నట్లు చరిత్ర చెబుతోంది . ప్రతిసంవత్సరము భీష్మ ఏకాదశి రోజున వమరవిల్లి రెడ్డి వారి కుటుంబీకులు వేణుగోపాలస్వామి పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నారు . దీనినే కాళీయ మర్దన వేణుగోపాలుని యాత్ర , సాలిహుండాం యాత్ర(Salihundam yatra)లేదా '' కొండమీద యాత్ర '' అని పిలుస్తారు . సాలిహుండాం జాతరకు వివిధ జిల్లాల నుంచి ప్రయాణీకులు అత్యధిక సంఖ్యలో వస్తారు . ప్రక్క రాస్టమైన ఒరిస్సా నుండి చాలామంది భక్తులు ఈ శ్రీక్రిష్ణ దేవుని దర్శించడానికి వస్తూఉంటారు . భీష్మ ఏకాదశి జాతరను సాలిహుండాం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి ఆనందోత్సాహలతో జరుపుకుంటారు.
ఏటా మాఘశుద్ధ ఏకాదశి(భీష్మఏకాదశి)రోజున నిర్వహించే ఈ యాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి సుమారు 50వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. 12వ శతాబ్దానికిచెందినదిగా భావిస్తున్న ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాలస్వామి అనే పేరు ఉంది. సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించి, పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం.
వంశధారలో పవిత్ర స్నానాలు..
భక్తులు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్యస్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్త్తెన ఈ కొండపైకి వెళ్లేందుకు వీలుగా మెట్లదారి ఉంది. దర్శనం పూర్తయిన తరువాత కొండ దిగేందుకు మరో మెట్లదారి ఉంది. కొండపైన వేణుగోపాలుని దర్శించిన భక్తులు అక్కడకు దగ్గర్లోని వీరవసంతేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీ.
స్వామి చక్రస్నానం...
వేణుగోపాలుని ఉత్సవమూర్తులను పల్లకిలో భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే మేళ, తాళాలతో ఊరేగింపుగా వంశధార నది మధ్యలో అర్చక స్వాములు చక్రస్నానం చేయిస్తారు. అక్కడ నుంచి తిరువీధి నిర్వహిస్తారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top