Thursday, 29 November 2018

Penchalakona- పెంచల కోన- చెంచులకోనే పెంచల కోన - పెనుశిల లక్ష్మీనసింహస్వామి - చెంచులక్ష్మీ- పెంచలకోన జలపాతం

చెంచులకోనే పెంచల కోన

పెంచలకోన , నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము. చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచల కోన గా మారింది.దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది

శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తుంటారు. ఆ  సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది.

విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... నర-మృగ రూపు విగ్రహం నుంచి స్వేదం అదే భక్తులకు తీర్థం ఇక్కడ దీంతో ఆమే ధైర్య సాహసాలు, అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు.
ఈ క్షేత్రాన్ని కులమతాలకు అతీతంగా ముస్లీం సోదరులు కూడా సందర్శిస్తుండటం ఇక్కడ గమనార్హం.


అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహిస్తారు. ఈ విషయమై స్వామివారితో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుటుంది. అటు పై ఇదే ప్రదేశంలో స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు. ఈ దేవాలయాన్ని కూడా భక్తులు సందర్శించుకుంటుంటారు.


తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు.

పెంచల కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు ఇక్కడ లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది.భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని కథనం. ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం

పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవి లోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. ఈ విషయాన్ని గ్రామంలోకి వచ్చి తాను కూడా చెబుతానని వృద్ధుని రూపంలో ఉన్న స్వామి వారు ఆ గొర్రెల కాపరికి చెబుతాడు. అయితే ఇందుకు ఒక షరతు విధిస్తాడు


వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెలుతాడు. అంతలో ఉత్సాహాన్ని ఆపుకోలేక సదరు గొర్రెల కాపరి వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ ఉంది.

చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు

 మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి.


ఇక్కడ ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి. కాని అంత అనువుగా ఉండవు. అందువల్ల ఇక్కడికి వచ్చేవారు దైవ దర్శనం తర్వాత తిరిగి నెల్లూరుకు వెళ్లిపోతుంటారు. అక్కడ రాత్రి బసకు అనువుగా అనేక లాడ్జీలు, హోటల్స్ ఉంటాయి. అందుకే గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు. నెల్లూరులో అచ్చ తెలుగు వంటకాలు యాత్రికులను రారమ్మని ఆహ్వానిస్తుంటాయి.

పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమిటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమిటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

నెల్లూరు పట్టణం నుంచి పెంచలకోన ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. రోడ్డు మార్గంలో ఇక్కడికి ప్రయాణం దారిపొడవునా మన వాహన వేగానికి అందనంతగా కొండలు కదులుతున్నట్లు భలే అనుభూతులను కలిగిస్తుంది

పెంచలకోన జలపాతం:

ఎత్తైన శేషాచలం కొండల మధ్యలో నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలంలో ఉన్న పెంచలకోన  జలపాతం 100 అడుగుల ఎత్తు నుండి జాలువారుతుంది.

కొండలు, కోనల్లో ఉండే నరసింహ స్వామి క్షేత్రం, గలగల శబ్ధాలు చేస్తూ జాలువారే జలపాతం చూడాలంటే పెంచలకోనకి వెళ్ళాల్సిందే.

పెంచల కోన -వీడియో





పెంచలకోన జల పాతం


0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top