కొండారెడ్డి బురుజు - కర్నూలు - 'కొండారెడ్డి బురుజు' కు ఆ పేరెలా వచ్చింది ?
కర్నూలు ... ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. దీనినే 'కర్నూలు కోట' అని కూడా పిలుస్తారు. నగరం నడిబొడ్డున, పాత బస్ స్టాండ్ ఏరియా లో ఉన్నది. నగరంలో ఎక్కడి నుంచైనా పది రూపాయలు ఇచ్చి బురుజు చేరుకోవచ్చు. బురుజు మొత్తం ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. దీని పైకెక్కి చూస్తే నగరం అంతా సుందరంగా కనిపిస్తుంది.గతంలో కర్నూలు కోట లేదా కందనవోలు కోట (పూర్వం 'కర్నూలు' ను 'కందనవోలు' అని పిలిచేవారు) చుట్టూ నాలుగు బురుజులు ఉండేవి. అందులో ఒకటే ఈ కొండారెడ్డి బురుజు. మిగితా మూడు శిధిలమైనా నేటికీ చెక్కు చెదరకుండా ఒక్క కొండారెడ్డి బురుజు మాత్రమే నిలిచింది.
![]() | |
|
కర్నూలు కోటను రాయలసీమ ను పాలించిన విజయనగర రాజులలో ఒకరైన అచ్యుతరాయలు క్రీ.శ. 16 వ శతాబ్దంలో నిర్మించాడు. ఆతర్వాత బ్రిటిష్ వారు కొండారెడ్డి అనే దేశభక్తుడిని కోటలో బంధించడం వల్ల ఆ బురుజుకి కొండారెడ్డి బురుజుగా పేరు వచ్చింది. విజయనగర పాలకులు యుద్ధ తంత్రంగా శత్రువుల రాకను పసిగట్టేందుకు ఈ బురుజును ఎర్రరాతితో ఎత్తుగా నిర్మించారు.
![]() |
కొండారెడ్డి బురుజు లో ప్రస్తుతం ఎత్తైన స్తంభము ఒకటి ఉంది. అదే కర్నూలు నగరానికి తలమానికం అయ్యింది. ఈ బురుజు నుండి 52 దూరంలో ఉన్న గద్వాల కోట వరకు ఒక రహస్య సొరంగ మార్గం కలదు. తుంగభద్రా నది కింద నుంచి సొరంగం ఉండేదని, గద్వాల సంస్థానాధీశులు ఈ సొరంగాన్ని వాడేవారని కథనం. 1901 లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ సొరంగాన్ని మూసేసింది.
![]() |
మొదటి అంతస్తు లో ఉండే సొరంగ మార్గము |
శిధిలమైన మూడు బురుజులతో ఒకటి విక్టరీ టాకీస్ వద్ద కలదు. దీనిని 'ఎర్రబురుజు' అంటారు. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవతల ఆలయాలు, గోడలపై చిన్న చిన్న బొమ్మలు గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రా నదీ తీరానికి అనుకోని ఉన్న కుమ్మరి వీధి దాటాక, సాయిబాబా గుడి వద్ద ఉన్న బంగ్లా పక్కన ఉన్నాయి. ఈ బురుజులపై సైనికులు శత్రువులు నది దాటి రాకుండా పహారా కాసేవారు.
![]() |
వర్షపు నీరు పోవుటకు నిర్మించిన రంధ్రాలు |
![]() |
బురుజు పై ఉన్న స్తంభము |
0 comments:
Post a Comment