Wednesday, 28 November 2018

Gandikota fort Jammalamadugu, Kadapa History- రాయలసీమలో విశిష్టమైన దుర్గం గండికోట- శత్రుదుర్భేధ్య 'గండికోట' రహస్యమిదే..!- ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట -గండికోట లోయ - గండికోట అంతర్భాగం లోని రంగనాధ ఆలయం- మాధవరాయ ఆలయం- జామియా మసీదు- గండి కోట ఘన చరిత్ర పై ఒక మంచి వీడియో- గండికోట ను గగనతలం నుంచి చూపు వీడియో

రాయలసీమలో విశిష్టమైన దుర్గం గండికోట- శత్రుదుర్భేధ్య 'గండికోట' రహస్యమిదే..!- ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట -గండికోట లోయ - గండికోట అంతర్భాగం లోని రంగనాధ ఆలయం- మాధవరాయ ఆలయం- జామియా మసీదు 


రాయలసీమలోనే గండికోట (దుర్గం) అత్యంత విశిష్ఠమైంది. జమ్మలమడుగు పట్టణం నుంచి గండికోట 14 కి.మీ. దూరంలో ఉంది. జిల్లాలో గండికోట ఉండడం జిల్లాకే గర్వకారణం. పెన్నానదికి కుడివైపున ప్రవాహానికి 90 మీటర్ల ఎత్తులో ఈ కోట నిర్మించబడింది. పెన్నానది ప్రవాహం కారణంగా ఏర్పడిన పొడవైన గండిపై నిర్మించడంతో ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. పెన్నానది గండి పడమర-ఉత్తర దిశలలో తవ్వని కందకంలా ఉండటంతో గండికోట శత్రు దుర్భేద్యమై నిలిచింది. ఇక్కడ పెన్నానది ఎర్రమల కొండల మధ్య ప్రవహిస్తుంది

క్రీ.శ.1123లో గండికోటను నిర్మించిన కాకరాజు

కాకరాజు గండికోట సమీపంలోని పూర్వపు బొమ్మేపల్లె వాసిగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. అతని అసలు పేరు చిద్దన చోళ మహారాజు. కల్యాణి చాళుక్య రాజు అయిన త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వర మహారాజు పాలించేవాడు. ఈ ప్రాంతాన్ని ములికనాడుసీమగా పిలిచేవారు. అప్పట్లో ఇందులో కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, వేముల , వేంపల్లె, వీరపునాయునిపల్లె, తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల, జమ్మలమడుగు తదితర ప్రాంతాలు ఉండేవని తెలుస్తోంది.
గండి కోట ఎంట్రన్స్


పరిపాలనా సౌలభ్యం కొరకు ములికినాడు సీమకు రాజప్రతినిధిగా కాకరాజు అనే నమ్మకమైన వ్యక్తిని నియమించినట్టు తెలుస్తోంది. అప్పట్లో కాకరాజు ములికినాడుసీమ ప్రాంతంలో అనువైనచోట మంచికోటను నిర్మించి పరిపాలించాలని భావించి సైనికులతో 12మంది ఆయగాండ్లతోనూ, 26మంది గురికాండ్లతోనూ, వెయ్యిమంది గడేకాండ్లతోనూ, వెయ్యిమంది వడ్లవాండ్లతోనూ, పురోహితులతో కర్ణాటక రాష్ట్రం నుంచి బయల్దేరి బళ్లారి, గుత్తి, తాడిపత్రి మీదుగా భానుకోటిమలను చేరుకున్నాడు. కొండాపురం మండలం పెన్నా ఒడ్డున గండ్లూరు వద్దనున్న భానుకోటిమలను చూసి కొండపై అతిశీతలమైన మధురోదకం కలిగిన ఒక దేవఘాతమును చూసి కోట కట్టించాలనుకున్నాడు. తర్వాత కొండపైకి ఎక్కి చూసి సరిగా లేకపోవడంతో మరికొంత దూరం వచ్చి అగస్త్యేశ్వరకోనకు చేరుకుంటాడు. నెలలు తరబడి తిరుగుతున్నా కోట కట్టడానికి సరైన స్థలం లభించలేదట.
గండి కోట ప్రాకారం లో కొంత భాగం
 అలా తిరుగుతూ ప్రసు ్తతం గండికోట ఉన్న కొండ దిగువ ప్రాంతంలోనే ఉన్న అగస్త్యేశ్వర కోన వద్దకు వచ్చినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పట్లో జనవరి నెల కావడంతో విపరీతమైన చలి ఉందని, సంక్రాంతి పండుగ దగ్గర పడుతోందని, ఇప్పటిలో కోటకు సరైన స్థలం దొరకడం కష్టమని ఇంటికి వెళ్దామని కాకరాజును సైనికులు అభ్యర్థిస్తారు. అయితే చివరిసారిగా ఈ అడవి ప్రాంతాన్ని కలియచూసి ఆ ప్రాంతాల్లో బాగా కనిపిస్తున్న పందులను వేటాడి వేటమాంసం తిని ఇంటికి వెళ్దామని సైనికులకు వివరిస్తూ కాకరాజు తాను కూడా వేటకు బయల్దేరుతాడు. కాకరాజు కొండను ఎక్కి ప్రస్తుతం గండికోట ఉన్న ప్రాంతంలో సంచరిస్తుంటే హఠాత్తుగా ఒక తెల్లని పంది ప్రస్తుతం గండికోటలోని రఘునాథస్వామి దేవాలయం ఉన్న స్థలంలో కనిపించినదట. ఆశ్చర్యభరితుడైన కాకరాజు పంది ఏమిటి, తెల్లగా ఉండటం ఏమిటని భావిస్తూనే బాణాన్ని ఎక్కుపెట్టి చంపాలని ప్రయత్నిస్తాడు. అంతలోనే తెల్లని పంది రూపంలో నుంచి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై శత్రుదుర్భేద్యమైన కోట కట్టుటకు అనువైన స్థలం ఇదేనని, అలాగే కోటలోని ఈ ప్రదేశంలో రఘునాథస్వామి దేవాలయం నిర్మించాలని ఆయనకు సూచించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పట్లో కాకరాజు ఆ రోజునే పండితులచే మొదట రఘునాథస్వామి గుడికి, తర్వాత గండికోటకు పునాదులు వేసి గండికోటను మట్టితో కీ.శ.1123 జనవరి 9వ తేదీ నిర్మించినట్లు గండికోట దుర్గం చరిత్ర ద్వారా తెలుస్తోంది.

గండికోట నిర్మాణం

గండికోటకు చుట్టూ మూడు రాతి ప్రాకారాలు, ఒక కందకం ఉంది. తూర్పు, పశ్చిమాన రెండు ప్రవేశ ద్వారాలు, ఒక అగర్త ఉన్నాయి. ప్రవేశ ద్వారం పైకప్పులు తోరణాలతో కూడిన కమాన్లతో నిర్మితమై హంపీలోని పద్మమహల్‌ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. కోట గోడలను ఒక టన్ను బరువు ఉండే ఎర్రటి సున్నపు శాణపు రాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండానే కొండ బండలపై కోట గోడలను నిర్మించడం ఈ కోట ప్రత్యేకత.

తూర్పు నుంచి పడమర వరకు కోట పొడవు 1200 మీటర్లు, వెడల్పు 800 మీటర్లు కలిగి 40 అడుగుల ఎత్తైన కోట. కోట గోడ చుట్టూ 101 బురుజులు ఉన్నాయి. వీటిలో 20 వలయాకారంలోనూ, 22 బురుజులు చతురస్రాకారంలోనూ ఉన్నాయి. తూర్పు, దక్షిణ దిశలోనూ బురుజులను ఫిరంగుల ప్రయోగానికి అనువుగా నిర్మించుకున్నారు. కోట తూర్పువైపున ఉన్న ప్రధాన ప్రవేశద్వారం 20 అడు గుల ఎత్తులో ఉంటుంది. ద్వారాలకు ఇనుప గుబ్బడాలు బిగించి శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. కోట ద్వారాలను మూయడానికి, తెరవడానికి అప్పట్లో ఏనుగులను వినియోగించేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కోత గోడపై చుట్టూ సైనికులు ప్రహారా కాచేందుకు అయిదు మీటర్ల బాటను నిర్మించారు. శత్రువుల రాకను గమనించేందుకు గండ్లు, ఫిరంగుల ప్రయోగానికి రంధ్రాలు ఏర్పాటు చేశారు. గండికోట చరిత్రకు తాడిపత్రి, తలమంచిపట్నం, ఎనుమదల, గరికపర్రు శాసనాలు ఆధారంగా నిలుస్తున్నాయి. ఇనగలూరు, తాడిపత్రి, కురివికులం, తొండూరు, నడిమిదొడ్డిపల్లె, పామిడి, పాలూరు, యాడికి, సింగనమల కైఫీయత్తులు గండికోట చరిత్రను ప్రస్తావిస్తాయి.
 ఫ్రెంచి పర్యాటకుడు టావెర్నియర్‌ గండికోటను రెండవ హంపీగా అభివర్ణించినట్టు తెలుస్తోంది. నాగఝురివాగులో ప్రవహించే నీరు కోటకు ఆగ్నేయ దిశలో కోట గోడలను తాకి రాయల చెరువులోకి ప్రవేశిస్తాయి. చెరువులో నుంచి నాగఝురికోన మీదుగా పడమర, దక్షిణ దిశగా ప్రవహించి పెన్నానదిలో కలుస్తాయి. పెన్నానది కోటకు పడమర నుంచి వాయువ్య ఉత్తర దిశల్లో ప్రవహిస్తూ ఉండటంతో కోటకు మూడువైపుల నీటి ప్రవాహం ఉందని చెప్పవచ్చునని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
గండికోట కి 3 వైపులా రక్షణ గా ఉన్న పెన్నా నది 


విజయనగర రాజ్య ప్రస్తావన 

16వ శాతాబ్దంలో గండికోటను తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఈ గండికోటను పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నమైనప్పుడు కుతుబ్ షాహీలు ఈ గండికోటను కుట్రపన్ని వశం చేసుకున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజుల పౌరుషాలకు, యుద్ద తంత్రాలకు నిలయంగా చెబుతారు.

గండికోట లోయ 



గండికోట ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. ఎర్రటి గ్రానైట్ శిలలు, లోయలో నదీ ప్రవాహం, పక్షుల సవ్వడులు లోయ యొక్క అదనపు ఆకర్షణలు.

ఆలయాలు, మసీదు 

రంగనాథ ఆలయం

ఇక్కడ నిర్మితమైన 'రంగనాథ ఆలయం' కళాకారుల నైపుణ్యాన్ని చాటిచెబుతోంది. క్రీ.శ.1557 నాటి ఒక శాసనంలో రంగనాథ ఆలయం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే.. రంగనాథాలయం విజయనగర రాజుల నిర్మాణ శైలికి అద్దంపడుతోంది.
మాధవరాయ ఆలయం

ఇక్కడ మాధవరాయ ఆలయం అనే మరో దేవాలయం ఉంది. ఇక క్రీ.శ.16 శతాబ్దానికి చెందిన అక్కడి శాసనాల్లో మాధవరాయ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది. ఆలయంలో మనకు కనిపించే శిల్పకళా లక్షణాలు, ఆలయ నిర్మాణశైలి అద్భతంగా ఉన్నాయి.

ఇక్కడ ఉన్న జామియా మసీదు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇండో-ఇరానీ వాస్తు శైలిలో దీని నిర్మాణం ఉంది.


గండి కోట ఘన చరిత్ర పై  ఒక మంచి వీడియో

 click on the video to view...




Gandikota Aerial View - Grand Canyon of India
గండికోట  గగనతలం నుంచి 

 click on the video to view...

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top