ఉద్యోగుల పిల్లలకు పెన్నిధి! - ప్రతి సంస్థలోనూ ‘క్రెష్’ సెంటర్
ఉద్యోగుల పిల్లలకు పెన్నిధి! - ప్రతి సంస్థలోనూ ‘క్రెష్’ సెంటర్,ఆరు నెలల నుంచి ఆరేళ్ల వారికి సంరక్షణ
🌻 తల్లి అయిన ప్రతి ఉద్యోగినికీ సాధారణంగా ఉండే బెంగ... తను విధులకు లేదా పనులకు హాజరైతే.. తన చిన్నారిని ఎవరు సంరక్షిస్తారు? అనే! దీంతో విధుల్లో ఉన్నా.. మనసంతా చిన్నారులపైనే ఉంటుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేదిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
🌻 మాతృత్వ లబ్ధి సవరణ చట్టం-2017 కింద ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలకు ఆయా సంస్థలే సంరక్షణ కోసం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రతి సంస్థలో ఉద్యోగుల పిల్లల కోసం ‘క్రెష్’(రోజు వారీ సంరక్షణ) సెంటర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 50, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న ప్రతి సంస్థలోనూ ఈ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఇప్పటికే దీనిని అమల్లోకి తెచ్చింది.
🌻 ఈ క్రమంలో తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లల సంరక్షణే లక్ష్యంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. తాత్కాలిక, దినసరి వేతనం, కన్సల్టెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థల్లోనూ వీటి ఏర్పాటు తప్పనిసరని స్పష్టం చేసింది.
0 comments:
Post a Comment