Tuesday, 6 November 2018

DID YOU KNOW ABOUT THE 5 DAYS OF DIWALI?

DID YOU KNOW ABOUT THE 5 DAYS OF DIWALI?

All of us have a rough idea of why Diwali is celebrated. All of us have been celebrating it for the longest time. And Diwali is rarely a one-day long festival. Its preparations begin weeks in advance, with cleaning the house, gifting and Diwali parties and more, and they often have week long after-effects as well. Out of sheer curiosity, I asked my mother about the significance of whatever we celebrate. We are bound to have some mythological or factual reason to celebrate Dhanteras, Bhai Duj, etc. I kid you not, she didn’t have a clear idea herself. So, I took it upon myself to research, and I am pretty sure you guys didn’t know why we celebrate the 5 days of Diwali either

ఐదు రోజుల దీపావళి గురించి తెలుసుకుందామా?


భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ పరమార్థంతోనే ఏర్పడ్డాయి. అందుకనే పైకి కనిపించే వేడుకలు, వినోదాలతోనే సరిపుచ్చకుండా పండుగలలోని అంతరార్థాన్ని తెలుసుకుని మరీ వాటిని జరుపుకోవాలి. శరదృతువు అయిన ఆశ్వయుజ, కార్తిక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి.

🔱 ధనత్రయోదశి

ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు, బౌద్ధమతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది.  వెలిగించిందధన్వంతరి పాలసముద్రం నుంచి ఈ రోజు అమృతాన్ని పైకి తెచ్చాడు కాబట్టి ఆయన పేరిట ఇది ధనత్రయోదశి అయింది. ఈ రోజు దీపం పెట్టటం, లక్ష్మీపూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు.

🔱 నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. పండుగల తిథులన్నిటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది! స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరకచతుర్దశి.

భూదేవి తల్లి అయినా, పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. ‘అసుర’ బిరుదును కూడా కలుపుకుని నరకాసురుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్లింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్నీ చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతోపాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామాశ్రీకృష్ణులు.

🔱 దీపావళి

ఆశ్వయుజ అమావాస్యనాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళినాడు మహాలక్ష్మిపూజ ప్రధానం. అసలైతే అమ్మవారి దగ్గర, ఇంటిముందు, దేవాలయాల్లో; ఏనుగులు, గుర్రాలు, గోవులు ఉండేచోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ.

దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది.

🔱 కార్తీకం-పాడ్యమి

కార్తికమాసంలోవచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాడ్యమినాడు గోపూజ చేస్తే పశుసంపద వర్థిల్లుతుంది. పాడిపంటలకు లోటు ఉండదు. ఇందులో భాగం గా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి. సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి. అలాగే ఆవుపేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి.

🔱 భగినీహస్త భోజనం

కార్తిక శుద్ధ ద్వితీయను యమద్వితీయ (విదియ) అంటారు. ఆ రోజున యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టి కార్తిక శుద్ధ విదియనాడు అన్నదమ్ములు తప్పకుండా అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనం తిని రావాలి. దీనినే భగినీహస్త భోజనం అంటారు.

ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు, మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు. అందుకే కార్తిక శుద్ధ ద్వితీయ (విదియ) నాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి, వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు.

సరసిజ నిలయే సరోజ హస్తే
ధవళ తరాంకుశ గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్... అనే శ్లోకంతో శ్రీమహాలక్ష్మిని పూజించి దీపాలు వెలిగిస్తే సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతారని, ‘దీపైః నీరాజనాదత్ర సైషా దీపావళిః’... అంటే దీపాలు వెలిగించడం, మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అనీ ధర్మశాస్త్రం చెబుతోంది

దీపావళి పండుగను జరుపుకోవడానికి ముఖ్య కారణాలు

 లక్ష్మి దేవి పుట్టినరోజు

సంపద యొక్క దేవత లక్ష్మి దేవి,సముద్ర మథనం సమయంలో కార్తీక మాసంలో అమావాస్య రోజున అవతరించారు. అందుకే లక్ష్మిదేవికి దీపావళికి సంబంధం ఉంది.

 విష్ణువు లక్ష్మీదేవిని కాపాడిన రోజు

దీపావళి రోజున విష్ణువు తన ఐదవ అవతారం అయిన వామన అవతారంలో బలి చక్రవర్తి చేర నుండి లక్ష్మి దేవిని కాపాడెను. ఇది దీపావళి రోజున లక్ష్మి పూజలు చేయటానికి మరో కారణం.

కృష్ణుడు నరకాసురుడుని చంపిన రోజు

దీపావళి ముందు రోజు,కృష్ణుడు రాక్షసు రాజు నరకాసురుడుని చంపి మరియు తన నిర్బంధంలో ఉన్న 16,000 మంది మహిళలను రక్షించేను. ఈ స్వేచ్ఛ యొక్క వేడుకను దీపావళి రోజుతో సహా రెండు రోజుల పాటు జరుపుకుంటారు.

పాండవులు తిరిగి వచ్చిన సమయం

గొప్ప పురాణం మహాభారతం ప్రకారం,పాండవులు పాచికలు ఆట (జూదం) లో కౌరవుల చేతిలో పరాజయం పొందిన ఫలితంగా 12 సంవత్సరాల బహిష్కరణకు గురి అయ్యారు. పాండవులు 12 సంవత్సరాల తర్వాత కార్తిక అమావాస్య నాడు కనిపించారు.

రాముని యొక్క విజయం

గొప్ప ఇతిహాసమైన రామాయణంలో,శ్రీరాముడు,సీతా మరియు లక్ష్మణుడు రావణ సంహారం తర్వాత లంక నుండి అయోధ్యకు కార్తిక అమావాస్య రోజున తిరిగి వచ్చారు. అయోధ్య పౌరులు ఆ రోజున మట్టి దీపాలతో మొత్తం నగరంను ఎప్పుడు ప్రకాశవంతముగా ఉండేలా అలంకరించారు.

విక్రమాదిత్యుడు పట్టాభిషేకం

గొప్ప హిందూ మత రాజైన విక్రమాదిత్యుడికి దీపావళి రోజున పట్టాభిషేకం జరిగినది. అందుకే దీపావళి ఒక చారిత్రాత్మక సంఘటన అయింది.

ఆర్య సమాజం ప్రత్యేకమైన రోజు

హిందూమతం యొక్క గొప్ప సంస్కర్త మరియు ఆర్యసమాజ స్థాపకుడు మహర్షి దయానంద దీపావళి రోజున నిర్వాణం పొందారు.

జైనుల ప్రత్యేకమైన రోజు

ఆధునిక జైనమత స్థాపకుడు మహావీర్ తీర్థంకరుడు కూడా దీపావళి రోజున నిర్వాణం పొందారని భావిస్తారు.

సిక్కులకు ప్రత్యేకమైన రోజు

మూడవ గురువు అమర్ దాస్ రెడ్ లెటర్ దీపావళి రోజున సంస్థాగతమైనది. అప్పుడు సిక్కు గురువుల ఆశీర్వాదాలను సేకరించడానికి ఉంటుంది.1577 వ సంవత్సరంలో అమృత్సర్ లోని బంగారు ఆలయానికి పునాది రాయి దీపావళి రోజునే వేసారు. 1619 లో,ఆరవ గురువు హరగోబిండ్,మొఘల్ చక్రవర్తి జహంగీర్ అధీనంలో ఉన్నారు. ఆయనతో పాటు 52 మంది రాజులు గౌలియార్ కోట నుండి దీపావళి రోజున విడుదల అయ్యారు.

దీపావళి రోజున పోప్ ప్రసంగం

1999 లో,పోప్ జాన్ పాల్ II పూజావేదికను దీపావళి దీపములతో అలంకరిస్తారు. అలాగే భారతీయ చర్చిలో ప్రత్యేక ధన్యవాదాలను నిర్వహిస్తారు. పోప్ నుదుటిపైన ఒక తిలక్ మార్క్ మరియు అతని ప్రసంగం లైట్ పండుగకు సూచనలుగా ఇవ్వటం జరిగినది.

నరకాసురవధ వృత్తాంతము:దీపావళి స్పెషల్

విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రమున ప్రవేసించి, ఆ రాక్షసుడిని చంపి, భూమిని మరల పైకి తీసుకువచ్చాడు. ఆ సమయమున వరహా అవతారముననున్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణ్డువు తాను త్రేతాయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలుపాడు.
త్రేతాయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినపుడు, భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారము చేయవలెనని ప్రమాణము చేయించుకున్నది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమరుని పెంచి, నరకుడని నామమునిచ్చి విద్యా బుద్ధులను నేర్పించాడు. నరకునకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగాతీరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి అయుధాన్ని, దివ్య రధమును అనుగ్రహించి, కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరము రాజధానిగా పాలించుకొనుమని చెప్పి భూదేవితోగూడి అదృశ్యమయ్యాడు.

నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపరయుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్టులవారు "నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అవమానించుతున్నావు. నీ జన్మదాత చేతనే మరణించెదవు" అని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణములేకుండునట్లు వరమును పొందాడు. ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు.

వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించగా, ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామాదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు రోజులు ప్రజలు ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top