Belum caves/ Belgam caves 5 km away to Kolimigundala mandal in Kurnool district. They are known as the longest caves in India. These caves are formed naturally in the underground of agricultural lands.
These are the second largest caves after Meghalaya caves. The caves are the most unique natural ancient caves. Local and foreign tourists will visit these caves . Long tunnels, rock plagues, and all the awesome wonders of the these caves attracts tourists.
As per the experts opinion Belgam caves formed over 10 million years ago.
These caves are spread over 10 km in the underground. Since February 2002, people have been allowed to visit the belgam caves.
Since then, the Andhra Pradesh Tourism Development Corporation has developed these caves and surrounding areas. In 1985 the state government acquired the belgam caves.
In 1999, the state tourism development authorities was paved a road with cement and slab stones up to 1.5 km for tourists. An artificial pool and fountain arranged in the caves with this, the caves became more and more beautiful.
Balloon caves are longer than the Borra caves in Visakhapatnam district. These include long routes, spacious chambers, and fresh water galleries.
Belum caves are 100 kms from Kurnool. It is 70 km away from Nandhyala. 35 km from Thadipatri and 75 km from Jammal Madugu
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో బెలుం గ్రామ సమీపంలో ఉన్నాయి. సాధారణంగా గుహలు అనగానే ఏ కొండల్లోనో, కోనల్లోనో ఉంటాయి. బెలూం గుహలు మైదాన ప్రాంతంలో భూమిలోపల ఏర్పడటం విశేషం. భూ ఉపరితలానికి దాదాపు ముప్పయ్ మీటర్ల లోతులో ఉన్న ఈ గుహలు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే అతిపెద్ద గుహలు.
బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు , తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటూ మరుగునపడిపోయిన వీటిని జర్మన్ దేశస్తుడైన గేబర్ సారథ్యంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత.
ఈ గుహలు ఎక్కడి నుంచి ఆరంభమైనవో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకే ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి.
భూమట్టానికి 120 అడుగుల కింద వరకు వెళ్ళగలిగిన ఈ గుహ లోపల, ప్రకృతి సహజంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. ఇంతటి అన్వేషణాభరితమైన గుహలు నిరంతం పర్యాటకులతో సందడి చేస్తోంది.
2002 ఫిబ్రవరి నుండి బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. గుహల్లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నయి.
బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన చాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. బెలూం గుహల్లోని క్రీ.పూ. 4500 నాటి పాత్రల అవశేషాలు చూస్తే, వాటి పురాతనత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను ' స్టాలక్ టైట్ 'లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతోంది. చదునైన వ్యవసాయ భూమికింద కలవు. బయటనుండి 3 బావులవలె ప్రవేశద్వారాలుంటాయి. మధ్యదారి నుండి ప్రవేశించాలి,
బెలూం గుహలు కర్నూలుకు 100 కి.మీ. దూరంలో కలవు..నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు,జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ప్రవేశరుసుము : పెద్దలకు రూ.50/-
పిల్లలకురూ.30/-
కొత్త అనూభూతి !
ప్రవేశద్వారం వద్ద నిర్మించిన పెద్ద బుద్ధవిగ్రహం చూపరులని ఆకట్టుకొంటుంది. దీని ఎత్తు 60 అడుగుల వరకూ ఉంటుంది. 2002 నుంచి సందర్శకులను లోపలకు అనుమతిస్తున్నారు. ఈ గుహలకు తుది ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకు ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబందించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. భూమట్టానికి 120 అడుగుల కింద వరకూ వెళ్ళగలిగిన ఈ గుహ లోపల, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి, సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. గుహల లోపలకు వెళ్ళే కొలదీ ఒకింత భయం, మరికొంత ఆతృత కలుగుతుంద. గుహలను సందర్శించే సమయమంతా ఏదో సాహసయాత్ర చేస్తున్నామా? అనే అనుభూతి కలుగుతుంది.
సందర్శనకు అనువుగా
వ్యవసాయ సమతల భూముల్లో వంద మీటర్లకు పైగా లోతులో గుహలు ఏర్పడటం అంటే అద్భుతంగానే ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు బాగానే చేశారని చెప్పొచ్చు. కాలినడకన వెళ్ళేందుకు మూడున్నర కిలోమీటర్ల వరకూ డెవలప్ చేశారు. అంతేకాదు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా గుహల్లో దాదాపు 40 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. లోపల ఉన్న సమయంలో ఇతరులతో మాట్లాడేందుకు ఆడియో సిస్టమ్‌ను అందుబాటులో ఉంచారు. ఈ సొరంగ మార్గాలు భూమిలోపల పది కిలోమీటర్ల వరకూ ఉన్నాయట! కానీ లోపలకు అనువుగా ఉన్న గుహలను మాత్రమే అంటే, మూడు కిలోమీటర్ల వరకు మాత్రమే అభివృద్ధి చేశారు. లోపల లైటింగ్ సిస్టమ్, రోడ్లు, వంతెనలు, మెట్లు, వాటర్ పౌంటేను, ఏర్పాటు చేశారు. ఈ గుహల ఆవరణలో కుటుంబ సమేతంగా గడిపేందుకు రెస్టారెంట్లు, డార్మెటరీలు, పిల్లల ఆట సామగ్రి, పార్క్ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
రైలు మార్గం తాడిపత్రి రైల్వే స్టేషన్ లో గాని లేదా బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో గాని దిగి , అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. రోడ్డుమార్గం ద్వారా ప్రయాణీంచేటప్పుడు అవుకు రిజర్వాజర్ కనిపిస్తుంది. రోడ్డుమార్గం బెలూం గుహలు చేరుకోవాలి అంటే కర్నూలు, బేతంచెర్ల, బనగానపల్లె నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డుమార్గం ద్వార చేరుకోవచ్చు.బెలూం గుహలు కర్నూలుకు 110 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 320 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు, జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
కొన్ని జాగ్రత్తలు
భూమికి శుమారు 120 మీటర్ల లోతులో ఉన్నాయి కాబట్టి – ముఖ్యంగా గాలిలో తేమ వల్ల విపరీతంగా ఉక్క పోస్తుంది. ఫ్లాష్ కెమేరాతో ఫోటో తీయాలని ప్రయత్నిస్తే, గాలిలో తేమ ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. ఈ క్రింది చిత్రం చూడండి!
కెమేరాలలో వీటి అందాలను బంధించడం కాస్తంత కష్టమైన పనే! చాలా మంది పర్యాటకులు (మగ వారు), తమ షర్టులు/టీ-షర్టులు విప్పేసి తిరుగుతూ కనిపిస్తారు. ప్రవేశించినది మొదలు బయటకు వచ్చేవరకు స్నానం చేసినట్టు చెమటలు పడతాయి. కాబట్టి పలచనైన దుస్తులు ధరించి వెళ్ళాలి.
చెమట రూపంలో శరీరం విపరీతంగా నీటిని కోల్పోతుందిగనుక, కనీసం మనిషికి రెండు లీటర్ల నీటినైనా వెంట తీసుకెళ్ళాలి. Electrol వంటివి కలుపుకొని ఒక లీటరు, మంచి నీరు ఒక లీటరు తిసుకెళితే బాగుంటుంది.
These are the second largest caves after Meghalaya caves. The caves are the most unique natural ancient caves. Local and foreign tourists will visit these caves . Long tunnels, rock plagues, and all the awesome wonders of the these caves attracts tourists.
As per the experts opinion Belgam caves formed over 10 million years ago.
These caves are spread over 10 km in the underground. Since February 2002, people have been allowed to visit the belgam caves.
Since then, the Andhra Pradesh Tourism Development Corporation has developed these caves and surrounding areas. In 1985 the state government acquired the belgam caves.
In 1999, the state tourism development authorities was paved a road with cement and slab stones up to 1.5 km for tourists. An artificial pool and fountain arranged in the caves with this, the caves became more and more beautiful.
Balloon caves are longer than the Borra caves in Visakhapatnam district. These include long routes, spacious chambers, and fresh water galleries.
Belum caves are 100 kms from Kurnool. It is 70 km away from Nandhyala. 35 km from Thadipatri and 75 km from Jammal Madugu
గుహనో అది మహలో! చూడాల్సిన బెలూం గుహలు - బెలుం గుహలలో అంతు చిక్కని రహస్యాలు
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో బెలుం గ్రామ సమీపంలో ఉన్నాయి. సాధారణంగా గుహలు అనగానే ఏ కొండల్లోనో, కోనల్లోనో ఉంటాయి. బెలూం గుహలు మైదాన ప్రాంతంలో భూమిలోపల ఏర్పడటం విశేషం. భూ ఉపరితలానికి దాదాపు ముప్పయ్ మీటర్ల లోతులో ఉన్న ఈ గుహలు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే అతిపెద్ద గుహలు.
బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు , తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటూ మరుగునపడిపోయిన వీటిని జర్మన్ దేశస్తుడైన గేబర్ సారథ్యంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత.
ఈ గుహలు ఎక్కడి నుంచి ఆరంభమైనవో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకే ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి.
భూమట్టానికి 120 అడుగుల కింద వరకు వెళ్ళగలిగిన ఈ గుహ లోపల, ప్రకృతి సహజంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. ఇంతటి అన్వేషణాభరితమైన గుహలు నిరంతం పర్యాటకులతో సందడి చేస్తోంది.
2002 ఫిబ్రవరి నుండి బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. గుహల్లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నయి.
బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన చాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. బెలూం గుహల్లోని క్రీ.పూ. 4500 నాటి పాత్రల అవశేషాలు చూస్తే, వాటి పురాతనత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను ' స్టాలక్ టైట్ 'లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతోంది. చదునైన వ్యవసాయ భూమికింద కలవు. బయటనుండి 3 బావులవలె ప్రవేశద్వారాలుంటాయి. మధ్యదారి నుండి ప్రవేశించాలి,
బెలూం గుహలు కర్నూలుకు 100 కి.మీ. దూరంలో కలవు..నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు,జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ప్రవేశరుసుము : పెద్దలకు రూ.50/-
పిల్లలకురూ.30/-
కొత్త అనూభూతి !
ప్రవేశద్వారం వద్ద నిర్మించిన పెద్ద బుద్ధవిగ్రహం చూపరులని ఆకట్టుకొంటుంది. దీని ఎత్తు 60 అడుగుల వరకూ ఉంటుంది. 2002 నుంచి సందర్శకులను లోపలకు అనుమతిస్తున్నారు. ఈ గుహలకు తుది ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకు ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబందించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. భూమట్టానికి 120 అడుగుల కింద వరకూ వెళ్ళగలిగిన ఈ గుహ లోపల, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి, సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. గుహల లోపలకు వెళ్ళే కొలదీ ఒకింత భయం, మరికొంత ఆతృత కలుగుతుంద. గుహలను సందర్శించే సమయమంతా ఏదో సాహసయాత్ర చేస్తున్నామా? అనే అనుభూతి కలుగుతుంది.
సందర్శనకు అనువుగా
వ్యవసాయ సమతల భూముల్లో వంద మీటర్లకు పైగా లోతులో గుహలు ఏర్పడటం అంటే అద్భుతంగానే ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు బాగానే చేశారని చెప్పొచ్చు. కాలినడకన వెళ్ళేందుకు మూడున్నర కిలోమీటర్ల వరకూ డెవలప్ చేశారు. అంతేకాదు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా గుహల్లో దాదాపు 40 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. లోపల ఉన్న సమయంలో ఇతరులతో మాట్లాడేందుకు ఆడియో సిస్టమ్‌ను అందుబాటులో ఉంచారు. ఈ సొరంగ మార్గాలు భూమిలోపల పది కిలోమీటర్ల వరకూ ఉన్నాయట! కానీ లోపలకు అనువుగా ఉన్న గుహలను మాత్రమే అంటే, మూడు కిలోమీటర్ల వరకు మాత్రమే అభివృద్ధి చేశారు. లోపల లైటింగ్ సిస్టమ్, రోడ్లు, వంతెనలు, మెట్లు, వాటర్ పౌంటేను, ఏర్పాటు చేశారు. ఈ గుహల ఆవరణలో కుటుంబ సమేతంగా గడిపేందుకు రెస్టారెంట్లు, డార్మెటరీలు, పిల్లల ఆట సామగ్రి, పార్క్ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
రైలు మార్గం తాడిపత్రి రైల్వే స్టేషన్ లో గాని లేదా బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో గాని దిగి , అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. రోడ్డుమార్గం ద్వారా ప్రయాణీంచేటప్పుడు అవుకు రిజర్వాజర్ కనిపిస్తుంది. రోడ్డుమార్గం బెలూం గుహలు చేరుకోవాలి అంటే కర్నూలు, బేతంచెర్ల, బనగానపల్లె నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డుమార్గం ద్వార చేరుకోవచ్చు.బెలూం గుహలు కర్నూలుకు 110 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 320 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు, జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
కొన్ని జాగ్రత్తలు
భూమికి శుమారు 120 మీటర్ల లోతులో ఉన్నాయి కాబట్టి – ముఖ్యంగా గాలిలో తేమ వల్ల విపరీతంగా ఉక్క పోస్తుంది. ఫ్లాష్ కెమేరాతో ఫోటో తీయాలని ప్రయత్నిస్తే, గాలిలో తేమ ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. ఈ క్రింది చిత్రం చూడండి!
![]() |
గాలిలో తేమ |
చెమట రూపంలో శరీరం విపరీతంగా నీటిని కోల్పోతుందిగనుక, కనీసం మనిషికి రెండు లీటర్ల నీటినైనా వెంట తీసుకెళ్ళాలి. Electrol వంటివి కలుపుకొని ఒక లీటరు, మంచి నీరు ఒక లీటరు తిసుకెళితే బాగుంటుంది.
0 comments:
Post a Comment