Search This Blog

Thursday, 11 October 2018

UGC says original documents not mandatory for admission in colleges

UGC says original documents not mandatory for admission in colleges
ఒరిజినల్‌ సర్టిఫికెట్లు మీ వద్ద పెట్టుకోవద్దు
వర్సిటీలు, కళాశాలలకు యూజీసీ ఆదేశాలు
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి జావడేకర్‌
న్యూఢిల్లీ, అక్టోబరు 10:                                                               
 

వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థినీవిద్యార్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తమ వద్ద అట్టేపెట్టుకోవద్దని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను యూజీసీ హెచ్చరించింది. ఒకవేళ విద్యార్థి తన అడ్మిషన్‌ను రద్దు చేసుకున్న పక్షంలో అతనికి లేదా ఆమెకు నిబంధనల ప్రకారం ఫీజు వాపస్‌ చేయాలని కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలుచేయకపోతే ఉన్నతవిద్యా సంస్థలపై యూజీసీ చర్యలు తీసుకుంటుందని హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు తెలిపారు. ఆయా విద్యా సంస్థలకు అఫిలియేషన్‌, డీమ్డ్‌ హోదాను ఉపసంహరించుకుంటామని, యూజీసీ నుంచి అందే సాయాన్ని ఆపివేస్తామని ఆయన స్పష్టం చేశారు                                                                                 కోర్స్అడ్మిషన్‌ఫారం దాఖలు చేసే సమయంలో విద్యార్థి మార్కుల సర్టిఫికెట్‌, స్కూలు లీవింగ్‌ సర్టిఫికెట్‌ వంటి విద్యాపరమైన, వ్యక్తిగతమైన ఎలాంటి ఒరిజినల్‌ సర్టిఫికెట్లూ సమర్పించనవసరం లేదు. ఏ విద్యాసంస్థా విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తమ స్వాధీనంలో ఉంచుకోరాదు. స్వీయ ధ్రువపత్రం ఇస్తూ ఆయా సర్టిఫికెట్ల నకళ్లను మాత్రమే విద్యా సంస్థలు తీసుకోవాలి’’ అని జావడేకర్‌ తెలిపారు. ప్రకటించిన అడ్మిషన్‌ చివరితేదీ కన్నా 15 రోజులు ముందుగానే విద్యార్థి తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే అతను లేదా ఆమె చెల్లించిన ఫీజు మొత్తం వాపస్‌ ఇవ్వాల్సిందేనని మంత్రి చెప్పారు.

ఇలాంటి సందర్భాల్లో కొన్ని కళాశాలలు ప్రాసెసింగ్‌ ఫీజును మినహాయించుకున్నా...విద్యార్థి చెల్లించిన మొత్తంలో గరిష్ఠంగా 5 శాతం, (లేదా 5 వేలు లోపు) మాత్రమే మినహాయించుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్‌ చివరితేదీకి 15 రోజుల్లోపులో విద్యార్థి తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే అతనికి 90 శాతం ఫీజు రీఫండ్‌ చేయాలి. చివరితేదీ ముగిసిన 15 రోజుల్లోపు అడ్మిషన్‌ వాపస్‌ తీసుకుంటే 80 శాతం ఫీజు, 16 నుంచి 30 రోజుల్లోపు వాపస్‌ తీసుకుంటే విద్యార్థికి 50 శాతం ఫీజు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top