గుడ్డు టెండర్ల బాధ్యత జిల్లాలకే
జిల్లా విద్యాధికారులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు
గతంలో రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలకు సరఫరా బాధ్యతలు అప్పగించగా.. నాణ్యతలేని గుడ్లు సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు ఈ బాధ్యతలు జిల్లాలకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కోడిగుడ్ల సరఫరాకు గతేడాది రాష్ట్రస్థాయిలో పిలిచిన టెండర్ల గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. గత నెలలో కొత్త టెండర్లు పిలిచినా.. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 31 వరకు పాత గుత్తేదార్లే కోడిగుడ్లు సరఫరా చేయనున్నారు.
కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. జిల్లాలవారీగా టెండర్లు నిర్వహించి, గుత్తేదార్లను ఎంపిక చేసే వరకు పాఠశాలల్లోని వంట ఏజెన్సీలే (వచ్చే నెల 1 నుంచి) కోడిగుడ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సైతం పాఠశాలల నుంచే ఆహారం అందిస్తున్నారు.
ఈ పథకంలో లబ్ధిపొందుతున్న పాఠశాలల విద్యార్థులు: 34,57,124, జూనియర్ కళాశాలల విద్యార్థులు: 1.75 లక్షలు, వారానికి ఒక్కొక్కరికి ఇస్తున్న కోడిగుడ్లు: 5.
0 comments:
Post a Comment