Search This Blog

Tuesday, 16 October 2018

Kondaveedu Fort -రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీక.. 'కొండవీడు కోట'


About Kondaveedu Fort About 25 km from Guntur is the mystical fort of Kondaveedu. It was built by Anapotha Reddy, a prominent ruler of the Reddy Dynasty in 1250 AD. The fort was later ruled by the Gajapathis of Orissa. The fort attracts tourists for its mysterious history and location that can provide for an adventurous trek. There are two other forts nearby. All three forts are aligned in a narrow hill, now in ruins. The fort offer 21 stupas and its pillared walls, temples and gates are worth having a look at. The entry gate ways to east and west side are huge and are named as the “Kolepalli Darwaza” and “Nadella Darwaza.” They are three-storied and made of granite. A temple dedicated to Lord Krishna known as the Gopinathanswami temple is located at the foot of the hill. Archaeological excavations have unearthed a 14th-century inscription that was supposedly penned by poet Srinada. Also found was an idol of Raja Rajeshwari. Moreover, a five-kilogram golden “panchachola” idol was also found. Treasure hunters get ready, who knows there may lie similar hidden treasure deep down here! The Archaeology Department of Andra Pradesh is working on carrying our restoration works to glorify the forts.


రెడ్డిరాజుల పౌరుషంవైభవానికి ప్రతీక.. 'కొండవీడు కోట'


గుంటూరు నగర చరిత్రలో 'కొండవీడు కోట'కు ప్రత్యేక స్థానం ఉంది. నగరానికి 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ కోటలో మొత్తం 21 నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాలు చాలా వరకు శిధిలమైనప్పటికీ.. ఈ కోట రహస్యాలను మాత్రం సాక్షాత్కరిస్తాయి. కొండవీడు కోట నిర్మాణశైలి, ఇక్కడి అందాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తారు
ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్‌ చేయడానికి కూడా అనువుగా ఉండటం వల్ల నిత్యం ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది. ముఖ్యంగా సెలవురోజుల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి.. ముఖ్యంగా గుంటూరు ఘనకీర్తికి 'కొండవీడు కోట' తలమానికంగా నిలుస్తోంది.

రెడ్డిరాజుల వైభవం

ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శత్రుదుర్బేధ్య రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్‌ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది.

అద్భుత నిర్మాణ శైలి


కోట నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరాన్నుండి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ప్రాకారం ఉంది. కొండ దిగువన చుట్టూ భారీ కందకాలను ఏర్పాటు చేసి వాటి నిండా నీటి ని నింపి మొసళ్ళను వదిలి అగడ్తగా రూపొందించారు. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్బుతంగా తీర్చిదిద్దారు. కొండలపైనే రాజు, రాణిల కోటలు, ధాన్యాగారం, వజ్రాగారం, కారాగారం, అశ్వ, గజ శాలలు, నేతి కొట్టు, తీర్పుల మందిరాలను ఏర్పాటు చేశారు.
కొండలపై రాజప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందు లు తలెత్తకుండా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు. వర్షాలు కురిసినప్పుడు ఒక దాని తరువాత ఒక టి నిండేలా వాటిని మలచడం, ఎక్కువైన నీటిని బయటకు పంపేందుకు మత్తిడిని (తూము) నిర్మించడం విశేషం. కొండవీడులో అన్నిటికన్నా ఆసక్తిని కలిగించేవి ఇక్కడి బావులు.... ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఊహకందదు... వీటినుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళ్లు వాడేవారు. అందుకే 'కొండవీటి చాంతాళ్లు' అన్న నానుడి వచ్చింది.
 

అద్భుత శిల్పాలు

కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తులబావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్నముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయంలోనే. కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్బుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండలపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయం, మశీదు, దర్గాకొండ, దిగువన కొత్తపాలెంలోని వీరభద్రస్వామి ఆలయం, కొండవీడులోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట గ్రామం పరిధిలోని గోపీనాథస్వామి దేవాలయం, ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ కొండపై ఉన్న మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి.


ఎలా చేరుకోవాలి?

కొండవీడుకోట గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట - గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం.5 నుంచి బోయపాలెం, చెంఘీజ్‌ఖాన్ పేట మీదుగా కొండవీడుకు చేరుకోవచ్చు. గుంటూరు - నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్లమార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. జాతీయ రహదారి నెం.5కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కొండవీడుకోట ఉంది.
కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది. కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ.1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త) ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈ కందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించుకుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని అధికారులు నివేదికలు రూపొందించారు. 20 సెంట్ల కందకం ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి రూపురేఖలు మార్చారు. ఎనిమిది అడుగుల లోతు గల కందకాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టితో పూడ్చి వేసి చదునుచేశారు. కందకం పరిధిలో ఒకటి రెండు చోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

కొండవీడు కోట పరిధిలో అత్యంత గుర్తింపు కలిగిన ప్రాంతం కత్తులబావి. దీన్నే గోపీనాథ దేవాలయం అని కూడా అంటారు. రాజుల హయాంలో అక్కడ మణులు, మాణిక్యాలు, బంగారం తదితర విలువైన లోహాలను భద్రపరచి ఉంటారనే అంచనాలతో చారిత్రక నిర్మాణాల తొలగింపునకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మొదటి మండపం కప్పునకు ఉన్న పెద్ద రాళ్లను తొలగించేశారు. అంతరాలయంలో ఉత్తర మండపానికి పక్కనున్న కుంభాకార స్తంభాన్ని కూడా తొలగించారు. గర్భగుడినే కత్తులబావిగా భావించి విలువైన లోహాల కోసం విచ్చలవిడిగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top