Wednesday, 10 October 2018

Hasanamba temple ,Hassan, Karnataka - హాసనాంబ దేవాలయం..... ప్రత్యేకత - ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు

Hasanamba temple is a Hindu temple located in Hassan, Karnataka, dedicated to the Goddess Shakti or Amba. The temple was built in the 12th century and tourists are only allowed to visit the temple once a year during the Hindu festival Deepavali in October. Devotees visit the temple to seek blessings of the Goddess during this week


హాసనాంబ దేవాలయం..... ప్రత్యేకత - ఈ దేవత  ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు....

భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత.
అయితే ఆ విశిష్టతలకు కారణం మాత్రం ఆ పరమాత్ముడికే తెలుసు. అందువల్లే అటువంటి విశిష్టతల పై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.అటు వంటి దేవాలయాలు భారత దేశంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందులో ఒకటి కర్నాటకలో కూడా ఉంది.

ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి?...

దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకలో హాసన్ అనే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని అమ్మవారి పేరే హాసనాంబ. హాస్యం అంటే నవ్వు అని అర్థం.
ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు.
అలా మారిపోయన అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. అందుకు ఉదాహరణకు హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు.
దీంతో కోపగించుకొన్న హాసనాంబ ఆమెను బండరాయిగా మారిపోమ్మని శపించింది. ఆ బండరాయిని మనం ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో చూడవచ్చు.

అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది.

ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోతున్నారు.

ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని నమ్ముతారు.

ఇక ఈ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు.అందులోనూ ఏడు రోజులు మాత్రమే దేవాలయంలోని అమ్మవారిని దర్శించు కోవడానికి అనుమతి ఉంటుంది.
ఈ సమయంలో కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.
ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్నిమూసివేస్తారు. ఆ సమయంలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ విగ్రహం ముందు ఉంచుతారు.
అంతే కాకుండా కొన్ని పూలతో పాటు రెండు భస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు.

మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అదే విధంగా పువ్వులు వాడిపోయి ఉండవు.

ఇక ముఖ్యంగా దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్న కూడా వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది.

దీనిని భక్తులు ప్రసాదంగా తింటారని చెబుతారు. సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు.

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు.

ఈ ఆలయంలోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనిపిస్తాడు. అదే విధంగా సిద్ధేశ్వరస్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు. ఇవి రెండు చాలా అరుదైన విషయాలు.

బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

1 comment:

 1. Very nice article on Hasanamba Temple.But Hassan is not a small town...It's a city...Now became Corporation.

  ReplyDelete

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top