Friday, 19 October 2018

Churrio Jabal Temple- పాకిస్తాన్ లోని ‘గాజుల అమ్మవారు చూరియా దుర్గ అమ్మ వారు’

Churrio Jabal Temple -పాకిస్తాన్ లోని   ‘గాజుల అమ్మవారు చూరియా దుర్గ అమ్మ వారు’

Churrio Jabal ( pronunciation: choo-ryo ja-bal) is a hill, named Churrio, located in Taluka Nangarparkar, district Tharparkar @ Mithi, province of Sindh, Pakistan. A few scores from the Taluka headquarters, the hill is located at the outermost border of the country in the south-east of the province, surrounded by India from three sides, primarily famous for three things: the valuable multi-colored granite hill, the historical bangles' business and the temple of goddess Durga that attracts pilgrims from the international community following Hinduism.

The name Churrio (Choryo)is a word from Sindhi language, derived from a word, to be pronounced as (Choo-rree), which means 'a bangle'; thus the word Churrio--an adjective in Sindhi language--means "belonging to/related to bangles", because in the vicinity of the hill there are a number of small villages that have historically remained attached to the profession of manufacturing bangles for women. These locally manufactured bangles are then transported out of the villages to the nearby towns like Nangarparkar up to Mithi in the west and Umerkot in the north. Accordingly, culturally, the women of the area dress in heavily embroidered clothes with bangles adorning their wrists.

Durga Mata temple, on Churrio Jabal hill in Choryo village, is one of the two Hindu temples in this place. On the top of this Churrio Hill is a temple of Hindu goddess Durga, a goddess of Hinduism, attributed as destroyer of evil, triumph of good over evil, the mother of universe, and power behind the creation, preservation, and destruction of the world. Owing to Durga's temple, thousands of pilgrims, not only from Pakistan, especially the provinces of Sindh, Baluchistan, Punjab and Khyber Pakhtunkhwa, but also from Nepal, India and other countries visit Churrio Hill for their religious festivals. The temple is a part of Hindu religious and cultural heritage in Sindh, Pakistan.
On Shivratri200,000 pilgrims visit the temples. Hindus cremate the dead and ashes are preserved till Shivratri for immersion in the into holy water. Richer Pakistani Hindus go to India to immerse the ashes in Ganges and the rest visit Nagarparkar to immerse the ashes. This area has been leased by the government for the mining by dynamite blasting of the hills on which the temples are located. This is posing a threat to the temples. Angry pilgrims held a protest against the destruction of this Hindu holy area by the miners with the complicity of the authorities who remain tight lipped about the destruction of Hindu holy sites.
Churrio Jabal (Churrio Hill)
Churrio Durga temple is under threat from the dynamite mining


పాకిస్తాన్‌లోని ‘గాజుల అమ్మవారు చూరియా దుర్గ అమ్మ వారు’

దేశ విభజన ముందు ఇప్పటి పాకిస్తాన్‌లో కూడా లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు ఉండేవి. హిందూ, ముస్లిం తారతమ్యాలు లేకుండా స్థానికులంతా వాటిని ఆదరించేవారు. కానీ ప్రత్యేక దేశం ఏర్పడిన తర్వాత హిందూ ఆలయాలు జీర్ణావస్థకు చేరుకోసాగాయి. స్థానికుల స్వార్థం వల్లనో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానో ఘనత వహించిన ఆలయాలెన్నో శిథిలమైపోయాయి. వాటిలో ఒకటే ‘చూరియా దుర్గ’ ఆలయం
పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలో ‘నంగర్‌పార్‌కర్‌’ అనే ఊరు ఉంది. ఒకప్పుడు అక్కడ అంతా నీరు ఉండేదట. ఆ నీటిని దాటుకుని ఆవలి ఒడ్డుకి చేరుకుంటేనే నాగరికత కనిపించేదట. అందుకనే ఈ ప్రాంతానికి ‘పార్‌కర్’ (దాటి వెళ్లాలి) అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఊరిలో ‘చూరియా జబల్‌’ అనే గ్రానైటు కొండ ఉంది. మిగతా ఎక్కడా కనిపించని విధంగా ఈ కొండరాయి ఎర్రటి రంగులో ఉండటం ఓ విశేషం. వేసవిలో ఈ కొండ నుంచి చిత్రవిచిత్రమైన శబ్దాలు రావడం మరో వింత. ఇవన్నీ కూడా ఆ కొండ మీద వెలిసిన అమ్మవారి మహత్తే అని కొందరి నమ్మకం.
చూరియా జబల్‌ కొండ మీద వెలసిన దేవిని ‘చూరియా దుర్గ’ అని పిలుస్తారు. చూరియా అంటే సింధీ భాషలో ‘గాజులు’ అని అర్థం. హిందూ సంప్రదాయంలో గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి, ఇక్కడి అమ్మవారికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. పేరు పెట్టడమే కాదు, ఈ కొండ చుట్టుపక్కల ఉండే జనం గాజుల తయారీ మీదే ఆధారపడుతూ ఉంటారు. తమ వృత్తిని ప్రతిబింబించేలా ఒంటినిండా గాజులు వేసుకుని కనిపిస్తారట.
చూరియా జబల్‌ ఆలయం భారత సరిహద్దుకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి పాకిస్తాన్లోని హిందువులు మాత్రమే కాకుండా... ఇండియా, నేపాల్‌ దేశాల నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారిని చూసేందుకు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా దసరా, శివరాత్రి సందర్భాలలో ఈ ఆలయానికి లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు.
అసలే హిందూ దేవాలయం, పైగా అరుదైన గ్రానైటు కొండ మీద ఉంది. దాంతో స్వార్థపరుల చూపు దీని మీద పడనే పడింది. 2011 శివరాత్రి తర్వాత ఈ కొండని తవ్వడం మొదలుపెట్టారు. వారి తవ్వకాలలో అమ్మవారి గుడిని చేరుకునే మార్గం కూడా ధ్వంసమైపోయింది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ విధ్వంసకాండని చూస్తూ ఊరుకుంది. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి ఆలయమైతే ఉంది కానీ... అది కూడా అతి త్వరలో అది కూడా కూలిపోయే ప్రమాదం లేకపోలేదు.
నంగర్‌పార్‌కర్‌లో దుర్గామాత ఆలయమే కాదు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన జైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఊళ్లో జైనులు చాలా ఎక్కువగా ఉండేవారట. పార్కర్‌ జైనులంటే గొప్ప పేరు ఉండేదట. దేశవిభజన తర్వాత జైనులు కాస్తా వలస వెళ్లిపోయారు. వారు నిర్మించిన దేవాలయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇలా ఒకటీ రెండూ కాదు... 14 అరుదైన జైన ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. యునెస్కో సైతం వీటిని సాంస్కృతిక సంపదగా గుర్తిస్తోంది. కానీ ఇవి కూడా శిథిలమైపోతున్నాయి.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top