Saturday, 20 October 2018

Chip Debit Cards: What You Need to Know - మీ డెబిట్‌ కార్డులో చిప్‌ ఉందా? - మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?


మీ డెబిట్‌ కార్డులో చిప్‌ ఉందా?సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా

డెబిట్‌ కార్డు.. మన జీవితంలో ఒక అంతర్భాగం.. ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలన్నా.. ఏదైనా కొనాలన్నా క్షణాల్లో మన అవసరాలను తీర్చే డెబిట్‌ కార్డు ఒక్కసారిగా పనిచేయడం మానేస్తే? ఇబ్బందే కదూ.. మీరు ఇప్పటికీ పాత మాగ్నెటిక్‌ డెబిట్‌ కార్డును వాడుతుంటే.. డిసెంబరు తర్వాత ఇలాంటి పరిస్థితే రావచ్చు. మరి, ఈ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దామా!

మీ డెబిట్‌ కార్డును ఎప్పుడైనా పరిశీలించారా? కార్డు వెనక భాగంలో నలుపు రంగు అడ్డ చార ఉండి, ముందు వైపు ఎటువంటి చిప్‌ లేకపోతే.. అది కేవలం మాగ్నెటిక్‌ కార్డు అన్నమాట. సూక్ష్మ మాగ్నెట్లతో కూడిన ఈ చారలో ఖాతా వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఎలక్ట్రానిక్‌ డేటా క్యాప్చర్‌ (ఈడీసీ) మెషీన్‌పై స్వైప్‌ చేసినప్పుడు, మాగ్నెటిక్‌ చారలోని సమాచారం ఆధారంగా పిన్‌ అవసరం లేకుండానే లావాదేవీ పూర్తవుతుంది.
దాదాపుగా అన్ని బ్యాంకులూ ఈ కార్డును పదేళ్ల కాలపరిమితితో జారీ చేశాయి. గడువును మరో పదేళ్లు పెంచాయి కూడా. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం ఈ మాగ్నెటిక్‌ కార్డులు డిసెంబరు 31 తర్వాత పని చేయవు.
మార్చుకోవాలంటే..
అన్ని బ్యాంకులూ పాత మాగ్నెటిక్‌ డెబిట్‌ కార్డును కొత్త ఈఎంవీ (యూరోపే మాస్టర్‌ వీసా) చిప్‌ కార్డుగా మార్పు చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. దీనికి సంబంధించి ఖాతాదారులకు సంక్షిప్త సందేశాలనూ పంపిస్తున్నాయి. పాత కార్డును మార్చేందుకు బ్యాంకులు ఎలాంటి రుసుములూ వసూలు చేయడం లేదు. మీరు చేయాల్సిందల్లా వీలైనంత త్వరగా మీ బ్యాంకు శాఖకు వెళ్లి మీ పాత ఖాతా కార్డును ఇచ్చి, కొత్త చిప్‌ కార్డును పొందడమే!
ప్రత్యేకతలేమిటి?
యూరోపే, మాస్టర్‌, వీసా కంపెనీలు సంయుక్తంగా ప్రారంభించిన సంస్థ ద్వారా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో జారీ చేస్తున్న కార్డు ఈఎంవీ చిప్‌ కార్డుగా వాడుకలోకి వచ్చింది. ఈ కార్డుకు ముందు వైపున ఉన్న చిప్‌లో ఖాతాదారుని సమాచారం సంకేత రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ కార్డును పాయింట్‌ ఆఫ్‌ షేల్‌ మెషిన్‌లో ఉంచిన ప్రతిసారీ ఆ లావాదేవీకి మాత్రమే పరిమితమయ్యే విధంగా ఒక ప్రత్యేక కోడ్‌ రూపొందుతుంది. ఆ కోడ్‌ మరొక లావాదేవీకి ఉపయోగపడదు. కాబట్టి, చిప్‌ కార్డు లావాదేవీలు ఖాతాదారులకు అధిక రక్షణ ఇస్తాయి. దానికి తోడుగా ఖాతాదారుడు నమో
దు చేసే రహస్య పిన్‌ రెండంచెల భద్రత కల్పిస్తుంది. కొన్ని కార్డుల్లో ముందువైపు చిప్‌తోపాటు వెనుక మాగ్నెటిక్‌ చార కూడా ఉంటుంది.


మా గ్నెటిక్‌ కార్డులోని సమాచారాన్ని దొంగిలించడం, క్లోన్‌ చేసి, నకిలీ లావాదేవీలు నిర్వహించడంలాంటి ఇబ్బందులు చిప్‌కార్డుతో ఉండవు. చిప్‌కార్డు ద్వారా ఒకవేళ సమాచారాన్ని సంపాదించగలిగినా, ఆ సమాచారాన్ని బట్టి మరొక లావాదేవీ నిర్వహించే వీలు లేదు. చిప్‌కార్డులో ఉన్న సాంకేతికత ద్వారా బ్యాంకులు ఎప్పటికప్పుడు ఖాతాదారుని సమాచారాన్ని తాజాగా ఉండేలా చూస్తాయి. చిప్‌ కార్డును ఎవరైనా దొంగిలించినప్పుడు, ఖాతాదారు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత బ్యాంకులు ఆ కార్డు దుర్వినియోగం కాకుండా తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Chip Debit Cards: What You Need to Know - మీ డెబిట్‌ కార్డులో చిప్‌ ఉందా? - మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?


మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?

సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు ఖాతాదారుల లావాదేవీలకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఖాతాదారులందరికీ పిన్‌తో పనిచేసే చిప్-బేస్డ్ డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయనుంది. డిసెంబర్ 31 లోగా ఖాతాదారులందరూ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను చిప్ కార్డులతో రీప్లేస్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. కార్డులపై జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది . ఈఎంవీ చిప్ కార్డుతోపాటు పిన్‌ ఖాతాదారులకు అదనపు భద్రత కల్పిస్తుంది. జూన్ చివరి నాటికి ఎస్‌బీఐ 28.9 కోట్ల ఏటీఎం కార్డుల్ని జారీ చేసింది. అందులో చాలావరకు చిప్‌ బేస్డ్ కార్డులే. ఒక్క ఎస్‌బీఐ మాత్రమే కాదు... మిగతా బ్యాంకులూ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డుల నుంచి ఈఎంవీ కార్డులకు మారుతున్నాయి.మరి కార్డు చిప్ కార్డు అవునో కాదో గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.

2018 చివరి నాటికి..
ప్రియమైన ఖాతాదారులారా... మారడానికి సమయమిది. ఆర్బీఐ సూచనల ప్రకారం 2018 చివరి నాటికి మీరు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులకు మార్చుకోండి. ఈ మార్పు చాలా సురక్షితమైంది. ఎలాంటి ఛార్జీలు ఉండవని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.

మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా..
మరి మీ దగ్గరున్న కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా అని ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవడం చాలా సులువు.

గోల్డెన్ చిప్ ఉంటే..
కార్డు ముందు వైపు గోల్డెన్ చిప్ ఉంటే అది ఈఎంవీ కార్డు. మీ దగ్గర అలాంటి కార్డే ఉంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు.

కార్డుపై చిప్ లేకపోతే..
ఒకవేళ కార్డుపై చిప్ లేకపోతే నేరుగా మీ హోం బ్రాంచ్‌కు వెళ్లి కార్డు రీప్లేస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో..
అలా సాధ్యం కాకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే
మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఎస్‌బిఐ అఫిషియల్ ఈ వెబ్‌సైట్ చూడవచ్చు.

Chip ATM card Information

ChipATM card Information
★ప్రస్తుతం ఉన్న Magnetic ATM కార్డ్ తో జరిగే మోసాలని అరికట్టడానికి బ్యాంకులు కొత్తగా Chip ATM కార్డులని పోస్ట్ ద్వారా అందిస్తున్నాయి.
★ఇప్పటికే కొందరికి న్యూ ATM కార్డులు పోస్ట్ చేయబడ్డాయి.
★ATM కార్డు అందగానే చేయవలసినవి.
➖➖➖➖➖➖➖➖
💳 SBI A/C holders:
➖➖➖➖➖➖➖➖
👉ATM కార్డు  ని ఏదేని SBI ATM లో Insert చేయండి.
👉రైట్ సైడ్ క్రిందిభాగములో కనిపించే "PIN Generation" ని నొక్కండి
👉 11 అంకెల బ్యాంకు ఎకౌంటు నెంబర్ ని ఎంటర్ చేయండి.
👉తర్వాత 10 అంకెల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
👉 ఓకే చేయండి.
👉మొబైల్ కి OTP వస్తుంది.
👉కార్డు ని రెండవసారి ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉 OTP ని ఎంటర్ చేయండి.
👉Right side top లో ఉండే "Banking" ని నొక్కండి.
👉 "Pinchange" ఆప్షన్ నొక్కండి.
👉 NEW PIN ని create చేయండి.మళ్ళీ కన్ఫర్మ్ చేయండి.
Now Your new card is ready to use with newly created pin.
                                
➖➖➖➖➖➖➖➖                  
💳 HDFC కార్డు హోల్డర్స్:
➖➖➖➖➖➖➖➖
👉మీ కొత్త చిప్ ATM కార్డు పోస్ట్ ద్వారా అందిన తర్వాత 2/3 రోజులలో మీ రిజిస్టర్డ్ మొబైల్ కి OTP ని పంపిస్తారు.
👉తర్వాత న్యూ కార్డు ని HDFC ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉రైట్ సైడ్ కింద ఉండే  Input your OTP to "create new ATM PIN" option ని నొక్కండి.
👉 O T P ని ఎంటర్ చేయండి.
👉 Registered mobile no ని ఎంటర్ చేయండి.
👉 4 అంకెల కొత్త PIN ని create చేయండి.మళ్ళీ confirm చేయండి.
   Your new card is ready to use vth newly created pin.


⭕నోట్:కొత్త ATM కార్డు activate అయిన తర్వాత పాతవి ఆటోమాటిక్ గా డీ.ఆక్టివేట్ అవుతాయి

https://bank.sbi/portal/web/personal-banking/magstripe-debit-cardholders

Are you an SBI ATM card holder? Your card might not work after December 31

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top