⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Friday, 26 October 2018

AP DSC - 2018- Notification ,Syllabus,Information Billiton ,District wise cadre wise vacancies List by cse.ap.gov.in

AP DSC - 2018- Notification ,Syllabus,Information Billiton ,District wise cadre wise vacancies List by cse.ap.gov.in

Teacher Recruitment Test(TRT) for the posts of School Assistants(SA’s),
Language Pandits(LPs), Physical Education Teachers(PETs), Music
Teachers, Craft teachers and Art & Drawing Teachers
and
TETcumTRT for the posts of Secondary Grade Teachers (SGTs)

📚✍డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల
♦ఎస్జీటీలకు టెట్‌ కమ్‌ టీఆర్టీ
♦టెట్‌ క్వాలిఫైడ్‌ డీఎడ్‌ అభ్యర్థులపై భారం
♦రెండు జీఓల్లో మార్గదర్శకాలు జారీ
🌻రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల్లో 7,765 పోస్టుల భర్తీకి మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈసారి ఎస్జీటీ పోస్టులనే ఎక్కువగా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్‌ 67, 68ను జారీ చేసింది. పరీక్షల సిలబస్‌, అర్హతలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ), లాంగ్వేజ్‌ పండిట్లు (ఎల్‌పీ), వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ), క్రాఫ్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ టీచర్లకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించనున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు (ఎస్‌జీటీ) పోస్టులకు టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహించనున్నారు. గత టెట్‌లో క్వాలిఫైడ్‌, అన్‌ క్వాలిఫైడ్‌ డీఎడ్‌, బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు డీఎస్సీ రాసుకునే అవకాశం ఉంది.
🌻 టెట్‌లో అర్హత పొందని వారితో సమానంగా మళ్లీ టెట్‌, టీఆర్‌టీ సిలబస్‌ను చదువుకోవటం వల్ల తమపై భారం పడుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. డీఎస్సీ 2018 నుంచి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించిన విషయం తెలిసిందే. అందువల్లే వీరి కోసం టెట్‌ కమ్‌ టీఆర్టఈ సిలబస్‌ను రూపొందించటం వివాదస్పదంగా మారింది. టీఆర్టీ, మోడల్‌ స్కూళ్ల విభాగాల రాత పరీక్షలన్నిటికీ ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ,ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7675 పోస్టులకు డిసెంబరు 6 నుంచి దశల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తారు.
*♦టెట్‌ కమ్‌ టీఆర్టీ పరీక్షా సిలబస్‌!*
ఎస్జీటీ పోస్టుల కోసం డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులకు 100 మార్కులకుగాను 3 గంటల వ్యవధితో టెట్‌ కమ్‌ టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి డీఎడ్‌, బీఈడీ చదివిన అభ్యర్థులు అర్హులు. ఇందులో సాధించిన మార్కులకు టెట్‌ వెయిటేజీ ఇస్తారు. ఎస్జీటీలకు టెట్‌ కమ్‌ టీఆర్టీని 8 విభాగాల్లో 200 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌-10 మార్కులు, పరస్పెక్టివ్‌ ఎడ్యుకేషన్‌-05, ఎడ్యుకేషనల్‌ సైకాలజీ-10, లాంగ్వేజీ కంటెంట్‌-10, లాంగ్వేజీ మెథడాలజీ-5, మేథమేటిక్స్‌ కంటెంట్‌-10, మేథమేటిక్స్‌ మెథడాలజీ-5, సైన్స్‌ కంటెంట్‌-10, సైన్స్‌ మెథడాలజీ-5, సోషల్‌ స్టడీస్‌ కంటెంట్‌-10, సోషల్‌ మెథడాలజీ-5 మార్కులను కేటాయించారు. ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.
*♦టెట్‌ కమ్‌ టీఆర్టీ పరీక్షల వెయిటేజీ ఇలా..*
ఎస్జీటీలకు నిర్వహించబోయే టెట్‌ కమ్‌ టీఆర్టీ పరీక్షలకు వెయిటేజీ మార్కుల శాతాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 100 మార్కులకు 20 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఒక అభ్యర్థి 100 మార్కులకు 80 మార్కులు సాధిస్తే 16 శాతం వెయిటేజీ ఇస్తారు. 75 వస్తే 15, 70 వస్తే 14 చొప్పున వెయిటేజీ కల్పిస్తారు.
ఎస్‌ఏ, ఎల్‌పీ సిలబస్‌
స్కూలు అసిస్టెంట్స్‌ (ఎస్‌ఏ), లాంగ్వేజీ పండిట్‌లÊఎ (ఎల్‌పీ) 80 మార్కులతో (160 ప్రశ్నలు-ప్రతి ప్రశ్నకు అర మార్కు) టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2.30 గంటలు ఉంటుంది. ఈ పరీక్షలకు కామన్‌గా జీకే అండ్‌ కరెంట్‌ ఆఫైర్స్‌-10, పరస్పెక్టివ్‌ ఎడ్యుకేషన్‌-5, సైకాలజీ-5, సంబంధిత సబ్జెక్టు కంటెంట్‌-40, మెథడాలజీ-20 మార్కులకు నిర్వహిస్తారు. పీఈటీలు, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ అండ్‌ ఆర్ట్‌ పోస్టుల టీఆర్టీ సిలబస్‌ను జీవోల్లో పూర్తిగా వివరించారు.

*♦మోడల్‌ స్కూళ్ల పోస్టులకు రెండు పేపర్లు*
మోడల్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టుల రాత పరీక్షలకు రెండు పేపర్లతో సిలబస్‌ రూపొందించారు. ఇందులో ప్రిన్సిపాల్‌, పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, లాంగ్వేజీ పండిట్లకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1 ఇంగ్లీషు, పేపర్‌-2 పరీక్షలను టీఆర్టీ కామన్‌ సిలబస్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌, పరస్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, సైకాలజీ, సంబంధిత సబ్జెక్టు, మెథడాలజీలతో నిర్వహిస్తారు.



DSC కి చెందిన ఖాళీలు , సిలబస్ ,ఇన్ఫర్మేషన్ బులిటెన్ కోసం CSE వారి కింద ఆఫీషల్ లింక్ ద్వారా చూడగలరు..
For more information view official web cseap.gov.in

1 comment:

  1. Sir send me 1000 basic english words for primare classes

    ReplyDelete

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top