Wednesday, 30 May 2018

Indian Queen Durghavathi- మన భారతీయ వీరనారి రాణి దుర్గావతి

ఇప్పుడు  చెప్పబోయేది అక్బర్ ను మూడు సార్లు ఘోరంగా ఓడించిన మన భారతీయ వీరనారి రాణి దుర్గావతి గురించి ఎంతమందికి తెలుసు????

మన పాఠ్యపుస్తకాలలో మరియు చదువుకు సంబంధించిన ఏ పుస్తకంలోనూ తన గురించి ఉండదు...

మనం చాలా వరకు అక్బర్ గొప్పతనం గురించి చదువుకున్నాం అతను ఒక రాణా ప్రతాప్ సింగ్ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో ఓడిపోలేదని చదువుకున్నాం.. కానీ తను ఒక వీరనారి చేతిలో ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు ఓడిపోయాడు గొప్ప వీరనారి ఎవరో కాదు రాణి దుర్గావతి.....

5 అక్టోబర్ 1524 AD రాజపుట్ చందాలవ్ కిరట్ రాయ్ వంశానికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఆమె ఒక వీర  సైనికురాలే కాదు, మంచి వ్యక్తిత్వం మరియు రాజనీతి తెలిసిన స్త్రీ... ఆమెకు కళల పైన కూడా మంచి అవగాహన ఉండేది ఆమె కట్టించిన వాటిలో కలింజర్ పోర్ట్ మరియు ఖజరహో శిల్పాలు ఆమె హయంలో కట్టిన మరియు చెక్కబడినవి

ఆమే ఒక రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ రాజకీయ సింహాసనం అంత సులభంగా దక్కలేదు ఆమే కుటుంబం ఎప్పటినుండో ముస్లిం రాజు మహమ్మద్ గజినవి ఎదురునిలిచి పోరాడుతూ వస్తున్న కుటుంబం
ఆమెకు చిన్నప్పటినుండే యుద్ధ విద్యలలో ప్రావీణ్యం ఉండేది వల్ల రాజ్పుట్ వంశం గొప్పతనం మరియు పరాక్రమ చరిత్ర పైన మంచి అవగాహన ఉండటం వల్ల ఆమె అన్ని విద్యలలో ప్రవీణురాలుగా ఉండేది

1542 గోండ్ వంశానికి చెందిన దళప షహ అనే వ్యక్తిని పెళ్లాడింది 1545 వీర నారాయన్ అనే బాలుడికి జన్మనిచ్చింది
వీర నారాయన్ పుట్టిన కొన్ని సంవత్సరాలకి దుర్గావతి భర్త చనిపోయారు సింహాసనం అధిరోహించడానికి మరియు రాజ్యపాలన చేయడానికి తన కుమారుడికి సరైన వయసు కాదు మరియు చిన్న వయసు అవడంవల్ల రాణి దుర్గావతి సింహాసనం అధిరోహించి పరిపాలించే సాగింది

ఆమె సింహాసనం అధిరోహించిన మొదటి రోజునుండే ఆమె చతురత మరియు ఆమె రాజనీతి మరియు రాజ్య పరిరక్షణ దక్షతతో పాలించసాగింది తన రాజ్యాన్ని చండ్రాగ్రహ ప్రాంతంనుండి కొండ ప్రాంతాలైన  సింగగ్రహ అనే ప్రాంతానికి  మార్చేసింది
ఒక స్త్రీ రాజ్యాన్ని పాలిస్తుంది ఆమెకు ఏమి తెలుసు అని చిన్నచూపుతో మరియు అహంకారముతో బజ్ బహదూర్ ఎలాగైనాసరే రాజ్యాన్ని ఆక్రమించి దుర్గావతి ని ఓడించాలని పన్నాగం పన్ని ముందస్తు హెచ్చరిక ఏది ఇవ్వకుండానే తన సైన్యంతో రాణి దుర్గావతి రాజ్యం పైన విరుచుకుపడ్డాడు హఠాత్ పరిణామాన్ని గ్రహించలేని సైనికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు
అప్పటికే యుద్ధవిద్యల్లో ఆరితేరిన దుర్గావతి తన చతురతతో బజ్ బహదూర్ సైన్యాన్ని వీరోచితంగా పోరాడి కంగు తినిపించింది తన సైన్యం మొత్తం ఓడిపోవడం మరియు యుద్ధసామగ్రి మొత్తం అయిపోవడం గమనించిన బజ్ బహదూర్ తన ఓటమిని అంగీకరించి దుర్గావతి కి క్షమాపన చెప్పి తన రాజ్యాన్ని దుర్గావతి కి అప్పగించారు

మొగల్ సుబేదార్ అబ్దుల్ మజీద్ ఖాన్ అనే అక్బర్ సైన్యాధ్యక్షుడు అక్బర్తో పాటు మహా రాణి దుర్గావతి రాజ్యం పైన దండెత్త లేని నిర్ణయించుకొని ఒక పథకం తో దాడి చేయబోయాడు
అక్బర్ గురించి తెలియని మహారాణి దుర్గావతి ఒక చండీలా ఒక అపరకాళిలా అక్బర్ సైన్యం పైన విరుచుకుపడి చిత్తు చిత్తుగా ఓడించి అక్బర్ కి మొదటిసారి క్షమాభిక్ష పెట్టింది
తన ఓటమిని జీర్ణించుకోలేని అక్బర్ ఎలాగైనసరే రాణి దుర్గావతి ని ఓడించాలని ఇంతకంటే సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు  అమ్మకు సహాయంగా తన కొడుకు కూడా చేరడంతో అ అపర చండీలా ఓటమెరుగని మహారాణి కదనరంగంలో తను ఎంతో నిరూపించుకుంటూ అక్బర్ సైన్యానికి ముక్కు ముప్పుతిప్పలు పెట్టుకుంటూ మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది దొరికిన దొరికినట్టు వదిలిపెట్టకుండా చంపుకుంటూ అక్బర్ గుండెల్లో తన పేరు చెప్తేనే దడ పుట్టేలా రెండోసారి కూడా కాదు మూడోసారి కూడా యుద్ధం చేసి అక్బర్ సైన్యాన్ని ఓడించి క్షమాభిక్ష పెట్టిన మహా దీనురాలు మరియు యోధురాలు

అలా డైరెక్టుగా రాణి దుర్గావతి తో యుద్ధం చేయడం తగదని రాణి దుర్గావతి కి శత్రువులైన కొందరి రాజులతో అక్బర్ చేతులు కలిపి అకారణంగా రాణి దుర్గావతి రాజ్యం పైన ఒక్కసారిగా దండెత్తాడు

తన వీరత్వాన్ని తన ధైర్యాన్ని మరియు తన యుద్ధ విద్యల్ని నిరూపించుకుంటా నాలుగోసారి యుద్ధం చేయసాగింది కానీ ఈసారి కాలం కలిసిరాక తన సైన్యం సరిపోక మరియు తనదగ్గరున్న సామాగ్రి అయిపోయి తల వంచే స్థితికి రాణి సైన్యం వచ్చింది
ఓటమి అంటే ఎరగని ఆ మహారాణి అక్బర్కి తలవంచని మరియు లొంగిపోనని తన మంత్రులు ఎంతమంది చెప్పినా ఓడిపోతానని తెలిసికూడా యుద్ధం చేయసాగింది మరియు కదన రంగంలోకి దిగింది.... ఆఖరికి అక్బర్ కి తలవంచే స్థితికి వచ్చేసరికి తన దగ్గర ఉన్న తన కత్తితోనే పొడుచుకుని వీరమరణం పొందింది.

ఇన్నిరోజులు పరాయి దేశ సంకలు నాకే ప్రభుత్వాల వల్ల మన భారతదేశం గొప్ప రాణుల గురించి మనం తెలుసుకోలేకపోయాను ఎప్పుడు చూడు అక్బర్ ది గ్రేట్ అని పుస్తకంలో మరియు అక్బర్ గొప్పవాడు అని పుస్తకాలు చదివాను కానీ
అక్బర్ ని ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగి పించి మూడుసార్లు ఓడించిన ఈ గొప్ప వీరవనిత గురించి నేను ఇప్పటివరకు ఏ బుక్కులో చదవలేదు... మన చరిత్ర ఎంతలా కనుమరుగయ్యే స్థాయికి దిగజారింది ఇది ఒక మంచి ఉదాహరణ....

మన భారతదేశం కన్నా గొప్ప వీరనారి కి శతకోటి వందనాలు మరియు దశ కోటి పాదాభివందనాలు

జయహో మహారాణి దుర్గావతి కి

1 comment:

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top