Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Monday, 13 November 2017

బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ గురించి వ్యాసం..

నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరంలో జన్మించాడు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగ నిమిత్తము కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ మరియు అయన తోబుట్టువులు అనంద్ భవన్ అనబడు ఒక భవంతిలో ఉంటూ, దుస్తుల విషయంలో హావాభావాల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లములో కూడా తర్ఫీదు ఇవ్వబడినారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండు పయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా పేరోందిన పాఠశాలలందు జరిగింది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించాడు. "జొ" అను ముద్దు పేరుతో పిలిచేవారు.

*జీవిత చరిత్ర*
నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో, సంపన్న న్యాయవాది అయిన మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూప్ రాణిల ప్రథమసంతానంగా నెహ్రూ జన్మించారు.నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణ వంశానికి చెందినది. మోతీలాల్ చాలా సంవత్సరాల క్రితం అలహాబాద్కు తరలి వెళ్లి న్యాయవాద వృత్తిలో విజయవంతమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రెక్కలు విప్పుకున్న భారత స్వతంత్ర పోరాటంలో అయన చురుకైన సభ్యుడు. నెహ్రూ మరియు అయన ఇద్దరు సోదరీమణులు-విజయలక్ష్మి పండిట్మరియు కృష్ణ- ఒక పెద్ద భవనమైన ఆనంద్ భవన్ నందు, ఆ రోజులలో శిష్ట వర్గం అవసరమని భావించిన, ప్రబలమైన ఆంగ్లసాంప్రదాయ పద్ధతులలో, పెంచబడ్డారు. వారికి హిందీ, సంస్కృతాలు నేర్పించడంతో పాటు భారతదేశానికి చెందిన సారస్వత గ్రంథాలలో పునాది వేయబడింది. మోతిలాల్ తన కుమారుడు ఇండియన్ సివిల్ సర్వీసులో అర్హత పొందాలని ఆశించి, యువ జవహర్ లాల్ ను ఇంగ్లాండ్ నందుగల హార్రోకి పంపారు. జవహర్ లాల్ తన పాఠశాల సిలబస్ ను కష్టమైనది గాను, మరియు నివాస షరతులు అనుకూలంగా లేనివి, భరింప శక్యం కానివిగా భావించి హర్రోలో గల పాఠశాల జీవితం ఆనందించలేకపోయారు. ఐనప్పటికీ, నెహ్రూ పాఠశాల విద్య పూర్తి చేసి, 1907 లో కేంబ్రిడ్జిఎంట్రన్స్ పరీక్ష వ్రాసి జీవశాస్త్ర అభ్యసనకు ట్రినిటీ కళాశాలకు వెళ్లారు. జవహర్ లాల్ తనట్రిపోస్లో రెండవ స్థానంలో నిలిచి 1910 లో పట్టా పొందారు. విశ్వవిద్యాలయంలోని స్వేచ్ఛాయుత వాతావరణం ఆయనను ఇతర కార్యక్రమాలు నిర్వహించేటట్లు ప్రోత్సహించి, సాధారణ దృష్టికోణంపై కీలక ప్రభావాన్ని చూపింది. పిమ్మట అయన అక్టోబర్, 1910 లో న్యాయ అభ్యసనకు ఇన్నెర్ టెంపుల్ లో భర్తీ అయ్యారు. హర్రో మరియు కేంబ్రిడ్జిలందు అభ్యసించాలనే నిర్ణయం న్యాయ విద్య యందు జవహర్ లాల్ కు ఉన్న ఆకర్షణవల్ల కాక వారి తండ్రి ఆజ్ఞానుసారం జరిగింది. జవహర్ లాల్ 1912 లో చివరి పరీక్ష ఉత్తీర్ణుడై అదే సంవత్సరంలో ఇన్నెర్ టెంపుల్ లో న్యాయ వాద వృత్తిని చేపట్టారు. దాని వెంటనే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే, రాజకీయాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకత్వంలోని భారత స్వాతంత్ర్య సంగ్రామం ఆయనను ఆకర్షించింది.1919 లో జలియన్ వాలా బాగ్ లో ఆందోళనకారులపై ఆంగ్లేయుల ఊచకోత తరువాత, నెహ్రూ తీవ్ర ప్రతీకారంతో తన శక్తులన్నీ స్వాతంత్ర్య సంగ్రామానికే కేటాయించారు.మొదట తన కుమారుని రాజకీయ యోచనను సందేహించినా, తరువాత స్వాతంత్ర్య సముపార్జనకు కాంగ్రెస్ ప్రయత్నాలలో మోతీలాల్ కూడా పాల్గొన్నారు. అతి త్వరగా నెహ్రూ, గాంధీ గారి నమ్మినబంటుగా గుర్తింపు పొందారు. ఆయన ఉద్యమాలు, ఆహింసాయుతమైనవే అయినప్పటికీ, ఆయన జీవితకాలంలో తొమ్మిది సంవత్సరాలు కారాగారంలో ఉండేటట్లు చేసాయి. కారాగారంలో ఉన్న కాలంలో నెహ్రూ, "గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ(1934), తన "జీవిత చరిత్ర " (1936), మరియు "ది డిస్కవరీ అఫ్ ఇండియా " (1946) రచించారు. ఈ రచనలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయనకు పెరుగుతున్న కీర్తితో పాటు రచయితగా కొంత ప్రత్యేకతను సంపాదించి పెట్టాయి.గాంధీ గారి మార్గదర్శకత్వంలో నెహ్రూ మొదటిసారిగా 1929 లో భారత జాతీయ కాంగ్రెస్, లాహోర్ సమావేశాలకు నాయకత్వం వహించారు. అయన మరలా 1936, 1937 చివరిగా 1946 లలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై స్వతంత్ర సంగ్రామంలో గాంధీ తరువాత రెండవ నాయకునిగా గుర్తింపు పొందారు.[4] 1916 ఫిబ్రవరి 8 లో కాశ్మీరి బ్రాహ్మణ వంశానికే చెందిన కమలా కౌల్ తో అయన వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఇందిరా ప్రియదర్శిని పుట్టింది.[4] ఈమె తరువాతి కాలంలో ఇందిరా గాంధీగాపిలువబడింది. కమలా నెహ్రూ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నారు కానీ 1936లో క్షయ వ్యాధితో మరణించారు. నెహ్రూ తన శేష జీవితం మొత్తం ఒంటరిగానే గడిపారు. అయితే 1946 నుండి వైస్రాయి భార్యగా నున్న ఎడ్విన మౌన్త్బట్టేన్తో అయన సంబంధం గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయన తన తరువాత జీవితకాలంలో ఎక్కువగా తన కుమార్తె పైన మరియు సోదరి విజయలక్ష్మి పండిట్ పైన ఆధార పడ్డారు.


*భారత దేశ మొదటి ప్రధాన మంత్రి*


తీన్ మూర్తి భవన్, ప్రధాన మంత్రిగా నెహ్రూ యొక్క నివాసము, ప్రస్తుతం అయన జ్ఞాపకార్ధ మ్యూజియం.

బ్రిటిష్ కాబినెట్ మిషన్ అధికార బదిలీ ప్రస్తావన చేసేందుకు వచ్చినపుడు, నెహ్రూ మరియు ఆయన సహచరులు విడుదల చేయబడ్డారు.

బ్రద్దలైన మతకలహాలు మరియు గతి తప్పిన రాజకీయాలు, ప్రత్యేక ముస్లిం రాజ్య మైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో నడుపబడుచున్న ముస్లింలీగ్ నుండి వ్యతిరేకతల నడుమ, నెహ్రూ అధిపతిగా నున్న తాత్కాలిక ప్రభుత్వం బలహీనపడింది. మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత, నెహ్రూ 1947 జూన్ 3 న ఆంగ్లేయులచే ప్రతిపాదించబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరించారు. ఆయన 15ఆగస్టున భారత దేశ ప్రధాన మంత్రిగా పదవీ స్వీకారం చేసి ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ :గా ప్రసిద్దమైన తన మొదటి ప్రసంగాన్ని చేసారు.

చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది.భారత దేశం కొరకు మరియు దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది." [5]

ఏమైనప్పటికీ, ఈ కాలం తీవ్రమైన మతహింసకు ఆనవాలుగా ఉంది. ఈ హింస పంజాబ్ ప్రాంతం, ఢిల్లీ, బెంగాల్ మరియు భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. శాంతిని పెంపొందించేందుకు, కోపోద్రిక్తులై, దిక్కుతోచక యున్న శరణార్ధులను శాంతింప చేసేందుకు, నెహ్రూ పాకిస్తానీ నాయకులతో కలిసి పర్యటనలు నిర్వహించారు. నెహ్రూ, మౌలానా ఆజాద్ మరియు ఇతర ముస్లింనాయకులతో కలిసి, ముస్లింలకు భద్రత కల్పించి, భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేసారు. ఈ కాలంలోని హింస నెహ్రూను తీవ్రంగా కలచి వేసి, కాల్పుల విరమణను పాటించేలా మరియు భారత-పాకిస్తాన్ యుద్ధం 1947, ఆపడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది. మతవిద్వేషాలకు భయమునొంది హైదరాబాద్ రాష్ట్రవిలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంశయించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరాలలో, తన బాగోగులు చూడడానికి మరియు వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు, నెహ్రూ తరచుగా తన కుమార్తె పై ఆధార పడేవారు. ఆయన నాయకత్వంలో, 1952 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది. ఇందిర, తన తండ్రి సంరక్షణకై ఆయన అధికారికనివాసం లోనికి మారారు. వాస్తవానికి ఇందిర నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ ఆయన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు.


*తీన్ మూర్తి భవన్ లో నెహ్రూ అధ్యయనము*

*ఆర్ధిక విధానాలు*

భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక మరియు నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు. వ్యాపార మరియు ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్, విద్యుత్ మరియు భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానాన్ని యోచించారు. నెహ్రూ భూపునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కమ్యూనిటీ అభివృద్ది పధకాలకు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యాన్ని ఇనుమడించే వివిధ కుటీర పరిశ్రమలను విస్తరింపచేసారు.భారీ ఆనకట్టలను ('నెహ్రూ వీటిని భారత దేశ ఆధునిక దేవాలయాలు' అనేవారు ) ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన మరియుజలవవిద్యుత్ ఉత్పత్తితో పాటు, నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశ పెట్టారు.

నెహ్రూ పదవీకాలంలో అభివృద్ధి మరియు ఆహారోత్పత్తి పెరుగుదల జరిగినప్పటికీ, భారత దేశం తీవ్రమైన ఆహారపు కొరతను ఎదుర్కొంటూనే ఉంది.నెహ్రూ ఆర్ధిక విధానాలు, ఆర్ధిక విధాన ప్రకటన 1956 లో పొందుపరచబడి, విభిన్న ఉత్పాదక మరియు భారీ పరిశ్రమలను [6]ప్రోత్సహించినప్పటికీ, దేశ ప్రణాళిక, నియంత్రణ మరియు క్రమబద్దీకరణలు ఉత్పాదకత, నాణ్యత మరియు లాభదాయకతలను బలహీన పరచాయి. భారతఆర్ధిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, విస్తారమైన పేదరికం, దీర్ఘకాల నిరుద్యోగిత అనే అంటురోగాల బారిన ప్రజలు చిక్కుకున్నారు. నెహ్రూ ప్రజాదరణ చెక్కుచెదరక పోగా, ఆయన ప్రభుత్వం విస్తారమైన భారత గ్రామీణ ప్రజానీకానికి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య రక్షణ, రహదారులు మరియు వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో విజయవంతమయ్యింది. స్రివత్సల్, హెమంథ్, సుమంథ్, స్రుథి,సరన్య\

*విద్య మరియు సంఘ సంస్కరణ*

భారత దేశ బాలలు మరియు యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ మరియుఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను మరియు వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు మరియు ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి మరియు సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.

కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించుటకు మరియు స్త్రీల యొక్క న్యాయ పరమైన హక్కులను మరియు సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది.[7][8][9] [10]షెడ్యుల్డ్ కులాలు మరియు తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను మరియు అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి మరియు ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు.

జాతీయ భద్రత మరియు విదేశాంగ విధానం

ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన నూతన స్వేచ్ఛా భారతానికి నెహ్రూ 1947 నుండి 1964 వరకు నాయకత్వంవహించారు. యు.ఎస్. మరియు యు.ఎస్.ఎస్.ఆర్.లుప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత దేశాన్ని తమ మిత్ర దేశంగా చేసుకోవడానికి పోటీ పడ్డాయి.

1948 లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జనాభిప్రాయ సేకరణకు నెహ్రూ అంగీకరించినప్పటికీ, తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితికి దూరమై 1953 లో జనాభిప్రాయ సేకరణకు నిరాకరించారు. అంతకుముందు తాను బలపరచిన షేక్ అబ్దుల్లా, వేర్పాటు వాద ఆశయాన్ని కలిగి ఉన్నారనే అనుమానంతో ఆయన అరెస్టుకు ఆదేశించి, ఆయన స్థానంలో బక్షి గులాం మొహమ్మద్ను నియమించారు. అంతర్జాతీయ రంగంలో నెహ్రూ ఒక శాంతి కాముక నాయకునిగా ఉండి ఐక్యరాజ్యసమితికి మంచి మద్దతుదారుగా నిలిచారు. ఆయన అలీన విధానాన్ని ప్రతిపాదించి, యు.ఎస్.మరియు యు.ఎస్.ఎస్.ఆర్. దేశాల నాయకత్వంలో ఉన్న వ్యతిరేక కూటముల మధ్య, తటస్థ వైఖరి అవలంబించే దేశాలతో అలీనోద్యమాన్ని స్థాపించి, దాని మూలధన ఏర్పాటుకు సహకారం అందించారు. స్థాపించిన వెంటనే పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాను గుర్తించి (అనేక పశ్చిమ కూటములు రిపబ్లిక్ అఫ్ చైనాతో సంబంధాలు కొనసాగించాయి), ఐక్యరాజ్య సమితిలోదానిని చేర్చు కోవాలని వాదించి, కొరియాతో వైరం వల్ల చైనీయులను కలహ కారకులుగా గుర్తించడాన్ని వ్యతిరేకించారు.[11] చైనా 1950 లో టిబెట్నుఆక్రమించినప్పటికీ దానితో సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పాలని భావించి, కమ్యూనిస్ట్ దేశాలకు మరియు పశ్చిమ కూటమికి మధ్య ఏర్పడిన ఒత్తిడులను తొలగించేందుకు మధ్యవర్తిగా ఉండాలని ఆశించారు. చైనాతో ఈ విధమైన శాంతి కాముక విధానం సమస్యాత్మకమైనదిగా,చైనా కాశ్మీర్ ప్రాంతంలో నున్న, టిబెట్ సరిహద్దుగా ఉన్న అక్సాయి చిన్ను ఆక్రమించి, భారత-చైనా యుద్ధం, 1962 కు దారి తీసినపుడు ఋజువైనది.

అణు ఆయుధాల బెదిరింపులను మరియు ప్రపంచంవ్యాప్తవత్తిడులను తగ్గించడానికి నెహ్రూ కృషి పలువురి ప్రశంసలు అందుకుంది.[12] అణు విస్ఫోటనం వల్ల మానవ జాతికి కలిగే ఫలితాల తొలి అధ్యయనాన్ని ప్రారంభించి, తాను'వినాశకర భయానక యంత్రాలు'గా పిలిచే, వాటి నిరోధానికి నిరంతరం దండెత్తారు. అణు అస్త్రాల పోటి వల్ల దారితీసే అతి-సైనికీకరణ అభివృద్ధి చెండుతున్న దేశాలైన, తన దేశం వంటివి భరించలేనిదిగా భావించడం, ఆయన అణునిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఉండడానికి కారణం.[13]

1956 లో సుఎజ్ కాలువపై ఆంగ్లేయ, ఫ్రెంచ్ మరియుఇజ్రాయిల్ ల ఉమ్మడి దండయాత్రను విమర్శించారు. అనుమానం మరియు అపనమ్మకము యు.ఎస్., మరియు భారత దేశాల మధ్య సంబంధాలను బలహీనపరచి, నెహ్రూ వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్ను బలపరుస్తున్నారనే అనుమానాన్ని కలిగించింది.1960 లో పాకిస్తాన్ పాలకుడైన ఆయుబ్ ఖాన్ తో సింధు నదీ జలాల ఒప్పందం పై సంతకం చేయడం ద్వారా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పంజాబ్ ప్రాంతంలోని నదీ వనరుల పంపక సమస్య సాధనకు, యునైటెడ్ కింగ్డం మరియు ప్రపంచ బ్యాంక్ల మధ్యవర్తిత్వానికి అంగీకరించారు.

*ఆఖరి సంవత్సరాలు*

1957 ఎన్నికలలో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధించిన్పటికీ, ఆయన ప్రభుత్వంవెల్లువెత్తుతున్న విమర్శలను ఎదుర్కొంది . పార్టీ లోఅంతర్గతంగా ఉన్న అవినీతి అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నెహ్రూ, పదవికి రాజీనామా చేసి, సేవను కొనసాగించాలని భావించారు.1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఎన్నిక బంధు ప్రీతి[ఆధారం చూపాలి] విమర్శలను రేకెత్తించింది, నెహ్రూ ఆమె ఎన్నికను ఆమోదించక, వంశానికి అపకీర్తిగా భావించి, దానిని పూర్తిగా అప్రజాస్వామికము మరియు అవాంచనీయంగా భావించారు, తన మంత్రివర్గంలో స్థానాన్ని తిరస్కరించారు .[14] ఇందిరా గాంధీ తన తండ్రి విధానంతో విభేదించారు; ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో ఉన్న వ్యక్తిగత విభేదాలను ఉపయోగించుకొని, ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా కేరళ లోని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాప్రభుత్వాన్ని రద్దు చేయించారు.[14] నెహ్రూ ఆమె దయలేని విధానాలు మరియు పార్లమెంటరీ సాంప్రదాయం పట్ల అగౌరవానికి తీవ్రంగా కలత చెందారు, ఆమె తండ్రిచాటు బిడ్డగా కాక, అకారణంగా నిర్దిష్ట చర్యలు తీసుకొనుట ఆయనను బాధించింది.

పంచ - శీల (శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలు)టిబెట్ పై భారత-చైనా ఒప్పందం 1954కు ఆధారం ఐనప్పటికీ,తరువాతి సంవత్సరాలలో సరిహద్దు వివాదాలు మరియు దలై లామాకు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలనే నెహ్రూ నిర్ణయం చైనాతో పెరుగుతున్న విభేదాలు నెహ్రూ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించాయి.అనేక సంవత్సరాల చర్చలు విఫలమైన తరువాత, నెహ్రూ 1961 లో పోర్చుగల్ నుండి గోవాను స్వాధీన పరచుకోవలసినదిగా భారతీయ సైన్యాన్నిఆజ్ఞాపించారు. చూడుము గోవా విముక్తి. సైనిక చర్య జరిపించినందుకు నెహ్రూ ప్రజాదరణతో పాటువిమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

1962 ఎన్నికలలో, ఆధిక్యత తగ్గినప్పటికీ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలైన, సాంప్రదాయ వాద పార్టీలు భారతీయ జన సంఘ్మరియు స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్లుమరియుకమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాలు కూడా గెలుపొందాయి.

కొద్దినెలల కాలంలోనే,సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చింది.సామ్రాజ్యవాద బాధితులుగా (భారత దేశం ఒక వలస రాజ్యం)మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, "హిందీ-చీనీ భాయి భాయి ", (భారతీయులు మరియు చైనీయులు సోదరులు)అనే మాటలలో నెహ్రూ తన భావాన్ని వ్యక్తం చేసారు.అభివృద్ధి చెందుతున్న దేశాలమధ్యసోదర భావం మరియు ఐకమత్యానికి ఆయన అంకితం అయ్యారు. నెహ్రూ స్వాభావికంగా ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశం పై పోరుసల్పదని భావించారు, ఏ సందర్భంలో నైనా భారతదేశం చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి. చైనా ఆక్రమించుకున్న వివాదాస్పద ప్రాంతాల్లో వారిని ఎదుర్కోవాలనే ఆలోచనను - "వారిని (చైనీయులను )బయటకు విసిరేయండి"-అనే జ్ఞప్తికి ఉంచుకోదగిన ప్రకటనలో సైన్యాన్ని ఆదేశించారు-చైనా ముందస్తు దాడిని ప్రారంభించింది.[16]

ప్రజల సందర్శనార్ధం నెహ్రూ భౌతిక కాయం, 1964

చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారత దేశంలోనిఅస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్నుతొలగించి, యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది. క్రమంగా నెహ్రూ ఆరోగ్యం మందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బందికి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం మరియు విశ్వాస ఘాతుకంగా భావిస్తారు [4]]కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుతో బాధపడి తరువాత మరణించారు. 1964 మే 27 వేకువ సమయంలో ఆయన మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గలశాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుప బడ్డాయి, వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో మరియు అంత్యక్రియా   వద్ద గుమికూడారు.
Read  ...Nehru biography

1 comment:

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top