Thursday, 14 September 2017

స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీలు ఎందుకు పేలుతాయి..? పేలకుండా ఉండాలంటే మనమేం చేయాలి?

Why do smartphone batteries explode? What should we do to stay away from us?
The Samsung Galaxy Note 7 has recently released a new smartphone. But now it has become a hot topic in phone news. Now that we hear the main thing about this phone, Samsung has recalled its Galaxy Note 7 phones. The company also apologized to customers for the mistake. Many tech analysts say the phone is blasting because of the lack of battery. But why did it happen? Any company that generates mobiles usually releases all kinds of tests and releases the mobiles into the market. But why is this happening in Galaxy Note 7? Why do the original smartphone batteries explode? In the past too many phones have been blown up, it is only in very limited cases. If you are reading the blast news of these phones now, there are questions about how much smartphones we use are safe. What are the main reasons for the actual smartphone batteries explode? Can we be careful about them?

Smartphone batteries are made of lithium ions. These include electrodes called cathode and anode. These are called positive and negative ions. That's why the batteries are + (plus), - (minus). Both the cathode and the anodes are on the side to batteries. Because these two electrodes do not stick to one another. Otherwise, a large amount of chemical reaction occurs in the explosion. These two electrodes are directed towards the batteries. These electrodes are electrolytes carrying electricity. These are usually lithium ions. Separators are also put in between. This is because the electrocardiogram is not to grow. The ions flow in the same direction when charging batteries. When the same battery charging, those ions are supplied with electricity and then. But now let's understand why the batteries explode.

If the above said, both the cathode and the anods do not want to touch, and they will move them towards the battery. That's yes, yes. However, Samsung has recently released a Galaxy Note 7 phone battery, which has caused errors in the cathode and anodes. This means that when the phones are charging, they have a large chemical reaction, and the battery is heat and it leads to the explosion. That's why the phones are exploding. Such errors are made by battery manufacturers. What can we do to them?

Another reason for the explosion of batteries is the charging of the device for a long time. If charging, the device will be charging and charging, so that the charge on the batteries in the batteries increases. This leads to a heavy heat. In addition, the chemical reactions increase and the battery gradually explodes. Usually many people have a habit of sleeping night charging the phone. Immediately stop those who have this habit. Otherwise your phone's battery is likely to explode.



Besides the charger that comes with the device, the use of chargers from other companies will also have the upper limitations of the battery voltage and the possibility to explode. Furthermore, if the phones are in the sun for longer, or if the phone is longer, the battery will warm up. Charging occasionally is likely to be exploded due to less heat. So it is better to have the device charging at least 30 - 40 percent. Charging should be done at 95% again. This means that the battery does not last long, but your phone is safe too.




స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీలు ఎందుకు పేలుతాయి..? పేలకుండా ఉండాలంటే మనమేం చేయాలి?
శాంసంగ్ సంస్థ గెలాక్సీ నోట్ 7 అనే స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్పుడీ ఫోన్ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డ చూసినా ఈ ఫోన్ పేలింద‌నే విష‌య‌మే ఇప్పుడు మ‌న‌కు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. దీంతో శాంసంగ్ త‌న గెలాక్సీ నోట్ 7 ఫోన్ల‌ను రీకాల్ చేసింది. జ‌రిగిన త‌ప్పుకు ఆ సంస్థ వినియోగ‌దారుల‌ను క్ష‌మాప‌ణ‌లు కూడా కోరింది. కాగా బ్యాట‌రీలో లోపం ఉండ‌డం కార‌ణంగానే ఈ ఫోన్ పేలుతోందని ప‌లువురు టెక్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఎందుకిలా జ‌రిగింది..? సాధార‌ణంగా మొబైల్స్‌ను త‌యారు చేసే ఏ సంస్థ అయినా అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హించాకే మొబైల్స్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తాయి. కానీ గెలాక్సీ నోట్ 7 విష‌యంలో ఎందుకు ఇలా జ‌రిగింది..? అస‌లు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయి..? గ‌తంలోనూ ప‌లు ఫోన్ల బ్యాట‌రీలు పేలినా, అది చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే. అలాంటిది ఇప్పుడు ఈ ఫోన్ల పేలుడు వార్త‌ల‌ను చ‌దువుతుంటే, అస‌లు మ‌నం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు ఎంత వ‌ర‌కు సుర‌క్షిత‌మ‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అస‌లు స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీలు పేల‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఏమిటి..? మ‌నం వాటి నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌లేమా..?
స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీల‌ను లిథియం అయాన్ల‌తో త‌యారు చేస్తారు. వీటిలో క్యాథోడ్‌, ఆనోడ్ అనే ఎల‌క్ట్రోడ్లు ఉంటాయి. వీటిని పాజిటివ్‌, నెగెటివ్ అయాన్ల‌ని పిలుస్తారు. అందుకే బ్యాట‌రీల‌పై + (ప్ల‌స్‌), – (మైన‌స్‌) అనే సింబ‌ల్స్ ఉంటాయి. అయితే క్యాథోడ్, ఆనోడ్లు రెండూ బ్యాట‌రీలకు చెరో వైపు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు ఎల‌క్ట్రోడ్లు ఒక దానికొక‌టి అంటుకోకూడదు. లేదంటే పెద్ద ఎత్తున ర‌సాయ‌న చ‌ర్య జ‌రిగి పేలుడు సంభ‌విస్తుంది. క‌నుకే ఈ రెండు ఎలక్ట్రోడ్ల‌ను బ్యాట‌రీల‌కు ఒక్కో వైపు పెడ‌తారు. కాగా ఈ ఎల‌క్ట్రోడ్ల మ‌ధ్య విద్యుత్‌ను మోసుకునిపోయే ఎల‌క్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి సాధార‌ణంగా లిథియం అయాన్లే అయి ఉంటాయి. అయితే వీటి మ‌ధ్య కూడా సెప‌రేట‌ర్ల‌ను పెడ‌తారు. ఎందుకంటే విద్యుదావేశం ఒక్క‌సారిగా పెర‌గ‌కూడ‌ద‌ని అలా పెడ‌తారు. ఈ క్ర‌మంలో బ్యాట‌రీల‌ను చార్జింగ్ పెట్టిన‌ప్పుడు అయాన్లు ఒకే దిశ‌లో ప్ర‌వ‌హిస్తుంటాయి. అదే బ్యాట‌రీ చార్జింగ్ తీయ‌గానే ఆ అయాన్లు విద్యుత్‌ను అటు, ఇటు స‌ర‌ఫ‌రా చేస్తాయి. అయితే ఇప్పుడు బ్యాట‌రీలు ఎందుకు పేలుతాయో అస‌లు విష‌యం తెలుసుకుందాం.
పైన చెప్పాం క‌దా క్యాథోడ్‌, ఆనోడ్‌లు రెండూ ట‌చ్ కాకూడద‌ని, వాటిని బ్యాట‌రీకి చెరో వైపు పెడ‌తార‌ని. ఆ, అవును అదే. అయితే శాంసంగ్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్ల‌ బ్యాట‌రీలలో ఈ క్యాథోడ్‌, ఆనోడ్‌ల‌కు చెందిందే ఓ పొర‌పాటు జ‌రిగింద‌ట‌. దీని వ‌ల్ల ఆ ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టగానే వాటిలో పెద్ద ఎత్తున ర‌సాయ‌న చ‌ర్యలు జ‌రిగి, బ్యాట‌రీ హీట్ అయి అది పేలుడు వ‌ర‌కు దారి తీస్తోంద‌ట‌. అందుకే ఆ ఫోన్లు ఎక్కువ‌గా పేలుతున్నాయ‌ని తెలిసింది. ఇలాంటి పొర‌పాట్లను బ్యాట‌రీ త‌యారీ దార్లు చేస్తారు. వాటిని మ‌నం ఏం చేయ‌డానికి కూడా వీలుండ‌దు.
ఒక బ్యాట‌రీలు పేలేందుకు మ‌రో కార‌ణం ఏమిటంటే, డివైస్‌ను ఎక్కువ సేపు చార్జింగ్ పెట్ట‌డం. చార్జింగ్ అయిపోయినా డివైస్‌కు అలాగే చార్జింగ్ పెట్టి ఉంచితే దాని వ‌ల్ల బ్యాట‌రీల‌లో ఉండే అయాన్ల‌లో విద్యుదావేశం ఎక్కువ‌వుతుంది. దీంతో బ్యాట‌రీ ఎక్కువ హీట్‌కు గుర‌వుతుంది. అంతేకాకుండా అందులో కెమిక‌ల్ రియాక్ష‌న్స్ పెరిగి బ్యాట‌రీ క్ర‌మంగా పేలుతుంది. సాధార‌ణంగా చాలా మందికి రాత్రి పూట ఫోన్ చార్జింగ్ పెట్టి ప‌డుకోవ‌డం అల‌వాటు. ఇలాంటి అల‌వాటు ఉన్న‌వారు వెంట‌నే మానేయండి. లేదంటే మీ ఫోన్ బ్యాట‌రీ కూడా పేలేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.
డివైస్‌తో వ‌చ్చిన చార్జ‌ర్ కాకుండా, ఇత‌ర కంపెనీల‌కు చెందిన చార్జ‌ర్‌ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా బ్యాట‌రీ వోల్టేజీలో హెచ్చు త‌గ్గులు ఏర్ప‌డి అది పేలేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ల‌ను ఎక్కువ సేపు ఎండ‌లో ఉంచినా లేదంటే ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాల్లో ఫోన్ ఎక్కువ సేపు ఉన్నా బ్యాట‌రీ వేడెక్కి పేలుతుంది. ఒక్కోసారి చార్జింగ్ మ‌రీ త‌క్కువైనా హీట్ కార‌ణంగా పేలేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి డివైస్ చార్జింగ్ క‌నీసం 30 – 40 శాతం ఉన్న‌ప్పుడే పెట్ట‌డం మంచిది. మ‌ళ్లీ 95 శాతానికి చేరుకోగానే చార్జింగ్ తీసేయాలి. దీని వ‌ల్ల బ్యాట‌రీ ఎక్కువ కాలం మ‌న్న‌డ‌మే కాదు, మీ ఫోన్ కూడా సుర‌క్షితంగా ఉంటుంది.


0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels


CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top