Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 14 May 2017

“అతనొక్కడే..” - పూసపాటి అశోక్ గజపతిరాజు --voice of andhraడబ్బుకు విలువుండొచ్చు.. కానీ ” “డబ్బుతోవిలువ రాదు.. ఆ విషయాన్ని నిరూపించిన అతికొద్దిమందిలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు.. ! విగ్రహంలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూనిండైన మనిెషి.. రాజు గారు…! నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…. చిన్న మరక కూడా లేకుండా.. స్వచ్చపాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. నాలుగుదశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన్ను ఎవరూ వేలెత్తి చూపింది లేదు.. పల్లెత్తు మాట అనింది లేదు..  రాజకీయనాయకుడు కాకముందే ఆయన రాజు.. దేశంలోని ప్రముఖ సంస్థానాల్లో ఒకటైన విజయనగర సంస్థాన వారసుడు.. కోటలని.. కోట్లని కాదనుకుని….భూములను బంగళాలను వదులుకన్న అసామాన్యుడు..! ఎలైట్ సర్కిల్ లో పెరిగినా.. విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు..! గ్వాలియర్ రాజసంస్థానాల్లో చదువుకున్నాడు. పెద్ద పెద్ద పట్టాలు లేకపోవచ్చు.. కానీ ఆయన డిగ్నిటీ ముందు అవన్నీ దిగదుడుపు..! కార్పోరేటర్ గా ఉంటేనే కళ్లు నెత్తికెక్కినట్లు బిహేవ్ చేస్తున్న రోజులివి..! ఎమ్మెల్యేగా.. మంత్రిగా..కేంద్రమంత్రిగా ఉన్నా ఆయన ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు విమానాల శాఖ మంత్రిగా ఉన్న అశోక్ ఫ్యామిలీకి.. 1945లొనే సొంత విమానం ఉండేది. కలకత్తా నుంచి చెన్నై వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ లో ఎక్కడా బీఎస్సీ కాలేజ్ లేదు.. అశోక్ తండ్రి పీవీజీ రాజు వందేళ్లకు మునుపే.. విజయనగం మహారాజకాలేజ్ లో బీఎస్సీ కోర్సు పెట్టించారు.
దాదాపు 2 లక్షల ఎకరాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం అది…!  తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కుగానీ ఎస్పీ ఆఫీసు కుగానీ ఫోన్ చేసి ఈ కేస్ మా వాళ్లే వదిలేయండి అని గాని పలానా వల్ల మీద కేస్ పెట్టండి అని గానీ చెప్పీన దాఖలా లేదు. . ఎమ్మెర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి ఔట్ ఆఫ్ ద వే పని చేయమని ఒకసారి కూడా అడగలేదు..
పనులు చేసిపెడితేనే మనవాడుఅనుకునే రాజకీయంలో జనం ఆయన్ను ఓసారి ఓడించారు..చివరకు జనమే తప్పు తెలుసుకున్నారుతప్పితే రాజుగారు తన వైఖరి తప్పలేదు. గల్లీ లీడర్లు కూడా ఫార్చునర్లూ.. ఎండీవర్లు వాడుతుంటే.. ఆగర్భ శ్రీమంతుడైన ఆయన.. నానోకారులో తిరిగేవారు ముందూ వెనుక పైలట్లు కూడా అవసరం లేదు.. సీటు బెల్టు పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు వ్యక్తిస్వామ్యం ఎక్కువుగా ఉండే ప్రాంతీయ పార్టీలో ఉన్నా.. కూడా ఆయన విలువఏమాత్రం తగ్గలేదు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు రాష్ట్రం అంతా ఆదేశిస్తారు..కానీ విజయనగరంలో పాటిస్తారు” . కొన్ని సందర్బాల్లో పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడన్నా అభ్యంతరం చెప్పినా అశోక్ చెప్పినట్లుచేయండంటారు. పార్టీ అధినేతకు ఆయనంటే అంత గౌరవం..! రిజల్ట్స్ వచ్చిన వెంటనే కేంద్రమంత్రిగా ఆయన్ను ప్రకటించగానే.. అంతా సైలెంట్..! రాజకీయాలకు సంబంధించి ఆయన రోల్ మోడల్.. ఎంపీ నిధులతో అంతా రోడ్డేసుకుని.. బిల్డింగులు కట్టిస్తేఈయన స్కూలు పిల్లలకు బెంచీలు చేయింతారు. వారికి KINDLE
ఈ- బుక్ రీడర్లు కొనిపించి పుస్తకాలు చదవమన్నారు. ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెబుతుంటే విని పసిపిల్లాడిలా ఏడ్చేశాడు.. (వీడియో క్రింద చూడండి..)
అశోక్ తన కారును తానే స్వయంగా కడుక్కుంటారు. ఓసారి ..ఆయన కారు కడుక్కుంటే చూసిన గన్ మెన్.. అదేంటి సార్ మీరు చేస్తున్నారు.. మేమున్నామంటూ.. వస్తే.. మీ డ్యూటీ మీరు చేయండని పంపేశారు.. కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పూ లేదు. పోయినవారం విజయనగరంలో తమ దివానంలో మేనేజర్ గా పనిచేసే ఆయన షష్టి పూర్తి కి వెళ్ళారు. .ఆయన షష్ఠి పూర్తికి అశోక్ దంపతులు, కూతురు వచ్చారు. పార్టీ లీడర్లే కాదు కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారువాళ్ళది రెండు అంతస్తుల ఇరుకు ఇల్లు. . మేడ మీద వరండాలో హోమం చేశారు. హోమం పూర్తయ్యే వరకూ వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు. హోమం తరువాత మరో గంటసేపు చిన్న గదిలో ఉన్నారు. షష్ఠి పూర్తి దంపతులకు మంగళ స్నానాలు చేయిస్తారు. అశోక్ దంపతులు మొదట గా వారి మీద నీళ్లు పోసి. అప్పుడు వెళ్లారు. మాములు ఎమ్మెల్యే కూడా . తాను వస్తే ఘనంగా స్వాగతం చెప్పాలిఎంతో గౌరవించాలి అనుకుంటాడు. కానీ అశోక్ తన ఉద్యోగి షష్ఠి పూర్తి కి మాములుగా వచ్చి రెండుగంటలున్నాడు.. అదీ అశోక్..!
ఉద్యోగులను గౌరవించడమే కాదు.. రూల్స్ తప్పితే అంతే కఠినం..!
అశోక్ కూతురు చిన్నప్పుడు 6 వ తరగతి కోసం విశాఖ వ్యాలీ స్కూల్ కి అప్లై చేశారు. అప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి గా ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు. ఆ స్కూల్ కమిటీ కి విశాఖ కలెక్టర్ చైర్మన్. అశోక్ ఆఫీసియల్ పీఏ కలెక్టర్ కి ఫోన్లో విషయం చెప్పాడు. ఆ విషయం అశోక్ కి కూడా చెప్పలేదు. ఇలాంటి చిన్న విషయం చెప్పేది ఏముంది.. వాళ్ళ అమ్మాయి కి సీట్ కోసమే కదా అనుకున్నాడు. కలెక్టర్ ఆ అమ్మాయికి సీట్ ఇచ్చాడు. ఓ వారం తరువాత అశోక్ ఎదో మీటింగ్ కొసం విశాఖ వెళ్లారు. అప్పడు కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి సార్, మీ అమ్మాయికి సీట్ ఇచ్చాము. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను పర్సనల్ గా కేర్ తీసుకుంటాను.అని చెప్పి.. అశోక్ దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకున్నాడు. దాంతో అశోక్ కు అసలు విషయం తెలిసింది. అక్కడే తన పీఏ ను పిలిచారు. మీరు మీ పేరెంట్ డిపార్టుమెంట్ కు వెళ్లిపొండిఅని చెప్పేశారు. తరువాత విజయనగరం కలెక్టర్ కు చెప్పి ఆయన్ని రిలీవ్ చేసేసి కొత్త పీఏ ను పెట్టుకున్నారు.
అశోక్ స్టేట్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కూతురుకు మెడిసిన్ సీట్ వచ్చింది. ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది. దాంతో నిజామాబాదో మరిదో తెలంగాణా జిల్లా కాలేజ్ లో సీట్ వచ్చింది. దాంతో ఆ అమ్మాయి రోజు తమ కార్ లో హైదరాబాద్ బస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసి బస్సులో కాలేజ్ కి వెళ్ళేది. ఈ విషయం తెలిసి సీఎం పేషీ అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్ లో హైదరాబాద్ ఉస్మానియా /గాంధీ మెడికల్ కాలేజ్ కు స్లయిడింగ్ లో తెచ్చేద్దాము అనుకున్నారు. అందుకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు. అదే విషయాన్ని చంద్రబాబు కు చెప్పారు. అశోక్ అందుకు ఒప్పుకోరు అని బాబు అన్నాడు. అయిన మీరు ట్రై చేయండి అని చెప్పాడు. దాంతో సీఎం పేషీ సెక్రటరీ అశోక్ తో మాట్లాడాడు.దానికి ఆశోక్ స్పందిస్తూ హైదరాబాద్ కాలేజ్ లో చదవాలి అంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంక్ తీసుకోవాల్సింది. తెచ్చుకోలేదు. కాబట్టి అక్కడే చదవాలి. అంతేఅని అనేశారు. ఇప్పుడు కేంద్రమంత్రిగానూ..అంతే.. !
విమానంలోకి లైటర్ తో వస్తే నన్ను పట్టుకోలోదేంటి అని విమానాశ్రయ సెక్యూరిటీకి షాక్ ఇచ్చారు.. దాదాపు దివాళాలో ఉన్న ఏవియేషన్ ను దారికి తెచ్చారు. తన సొంత ఊరిలో అంతరజాతీయ విమానాశ్రయం వస్తున్నా.. రూల్స్ కు విరుద్దంగా ఒక్క పనీ చేయలేదు. ఔట్ ఆఫ్ ది వే ఆయన డిక్షనరీలోనే లేదు. కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ లో క్యాజువల్ గా అంటే. నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నా అని భావిస్తే .. ఇప్పుడే కేబినెట్ కు రిజైన్ చేస్తాఅన్న నిెఖార్సైన మనిషి..!
అందుకే మళ్లీ చెప్పడం..
నిజాయితీ ఉన్నోళ్లు చాలా మంది ఉండొచ్చు.. కానీ బంధుప్రీతి.. కులభిమానం.. పక్షపాతంమొహమాటం ఇవేమీ లేని నేత అతనొక్కడే..Money can be valued but with "money" is not worth it..It proved that this was a little Possipati Ashok Gajapathy Raju ..! Not in the statue .. in personality ... the stupid manissi king ..! In politics for forty years ... without the slightest stain, the brand ambassador for the Swachapalitics. There is no one in the political life of the tongue. Not a penny. Not a politician. Before he was a politician, he was a king. Vigyanagar province of one of the leading provinces in the country, the fortress of the fortresses .. not the crooks. Elevite Circle Up .. Vizianagaram on the streets Gwalior studied in Rajasana. There are no bigger rails .. But he will do everything before dignity ..! Behayev is the day when the eyes are uprooted as a corporator ..! As MLA and minister, he is not even interfering in other affairs. Ashok Family is now the Floyd Minister of the Union. From Calcutta to Chennai, the entire Eastern Coast is nowhere near Em Bid Biscuits. In the course of the course .. Ashok's father PVV Raja Vannel .. Vizianagaram "Maharaja" college in BSc course.
About 2 lakh acres of educational institutions and temples gave it a family ...! In the 40 years of his political career, we have once visited the police station or the SP office and this case was ours ... they did not say that they should be given a case. . From the marmova to the collector, we can not call anyone out and work out the way.
Even if he did not do the "grandson" suspicion of defeat of the people in the politics of defeat .. At the end of the mistake of knowing the people ... otherwise the king lost his attitude. Gully Leaders is also used by Frochanur .. Endwriters .. He is not in the "Nano" car. He does not need the pilots behind the front seat .. the seat belt should be self-driving. There is also no "low" value in the local party where there is a person's religion. Chandrababu state "all in the state" relating to the affairs of the party, "but" in the Vannanagaraya. In some cases, if the party's local leadership has objected to any "objection to Ashok" That's the honor of the party's chief .. As soon as the results were announced immediately after the Union Minister .. Silent ..! His role model for politics was to go through the funds of the MPs .. If the buildings were constructed, his school children had benches. Kinsal for them

Read books that read e-book readers. Someone who says little about his greatness cried and cried as an infant .. (See below video)


1 comment:

 1. బాగుంది వ్యాసం
  కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.
  వ్యాసం లో ప్రస్తావించినవన్నీ వాస్తవాలే అని నమ్ముతూ,
  అలాంటి వ్యక్తి ఆ పార్టీలో కొనసాగడం గొప్ప విషయం .

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top