Tuesday, 16 May 2017

Sir Arthur Cotton (May 15, 1803 - July 24, 1899)- సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899)

Godavari people calling affectionately called Cotton Aristocrat General Sir Arthur Cotton (May 15, 1803 - July 24, 1899) .

The British Army and the British Indian Empire, with his life in the Cotton irrigation engineer, irrigation and canals built navikayogyamaina poured. He paksikamugane maranincesariki remains the goal of life. But his contribution to this gauravimpabadutunnaru Andhra Pradesh.

In 1819, the first to be involved in the Madras injanirula regiment participated in the Battle of Burma.

Cotton Sir knighted in 1861.

Dharmopadesakudu and Elizabeth Cotton, who is the father of the evangelists.

Life

1803 Arthur Cotton, Cotton and his srimatiki kalveli Henry on May 15, the tenth son was born. Cotton is one of the eleven brothers who survived settled in a variety of professions.

As a military cadet in 1818 at the age of 15 involved in the Cotton Company of Artillery and engineering services at addiskamb trained. Lieutenant in the Royal Engineers in 1819 and was appointed second in command.

Madras, India, for the first time at the age of 18, Sir Arthur Cotton and joined udyogartham. The British East India Company in the South, so he is the engineer appointed by the Ministry of the pond.

The construction of the dam across the Godavari dhavalesvaram Beginning in the 19th century, after which it was 9 feet swept away by the floods, and 22 yards. However, he was keen to work with the assignment of the dam was completed in front of many millions of acres in the waters of the Godavari. The statue was set up on the banks of the Godavari Telugus to forget him, so that he "leaves bhagirathudiga" kirtistunnaru still.

Agriculture

Successful projects, especially in the cotton farming and the construction of the first canals to be built from the Godavari. The division of the canal, which connects to all areas of the elastic expansion, once the development of agriculture in the general yield of the Godavari basin districts, districts with high agricultural yields marcivesinavi dream.

Cotton in 1836 - 38 years to build the dam on the river kolerun. Tanjore district of Madras state as well as the abundance of yavatbharata dhanadhanya took first place in the country.

Later, in 1847 - 52 years to complete the dam at dhavalesvaram Godavari. Kalakalaladindi sasyasyamalamai ksamapiditamaina Godavari delta. Shrinking population has increased three-fold. Had six million acres of land under cultivation. Mahatkaryanni he was just five years to complete.

They also persuaded anakattaku Cotton krsnanadipai at Vijayawada. Other than that, he Bengal, Orissa, Bihar, etc. to manavopayogyam many rivers in the analysis made. Tamils ​​are not themselves Telugu, Oriya, Bengali, Oriya, permanent rnagrastulu Biharis to the Indians.

Ubhayagodavarijillalu-Cotton

Krishnaand Khammam districts on either side of the jivanadiki by rain until the 18th century, lonagucu floodplains, due to droughts and famines vilavilaladayi.

Excess in 1831-32, underwent storms. Due to the drought caused by the drought in 1833, 2 million people were tuducupettuku.

In 1839 surge and drought, as well as more pottanapettukondi.

The dam, built in 1852, Cotton Aristocrat Godavari, Krishnaand Khammam districts, the farmers, the economy and changed jivanagatulanu. Dukhahdayiniga tamapalita the Godavari, Pranahitha bhagirathuduga irendujillala prajalagundello nilacipoyadu changed.

Dhavalesvaram production of the dam, snanamacarinci scholars to view, format will

A daily bath in the Godavari punyadoyomahamatih
National katanum than smaramyangleya bhagiratham

(Additional bhagiradhudu caused us fortune to bathe in the river Godavari, the English Cotton doragarini desiyudaina taristunnamu Recite daily. That the interpretation of these verses)

The protesters chanted. Gauravannipondadu over.

Most of the statues of the leaders of other countries Krishnaand Khammam districts in the villages, they do not seem to be a statue of Equestria aristocrat svaricestunna cotton, or cotton bastsaiju statue. 150 years later, the people of the region in the heart of much of the Chiranjeevi Cotton nilaci found. In recent years, more and more developed and then the dam, is firmly built.

Katanmyujiyam

Cotton Aristocrat memorize andhrapades service to the government to set up a museum ayanaperumida santosincadagga thing. Anakattaku dhavalesvaram the museum, close to the long-established in the building that was used as the office was set up kattunappudu katandora dam. Two-story building. Ratigodalakattadam, built on the roof tiles. Orchild bhavanancuttu campus, Fencing plants.

Avaranamiduga Museum, the Museum of the building nearest the road to anakattaku phlaiovar Bridge. Ivantena 160 years old machines used in the construction of the dam in the space (riveting machine, steam boilers, compressors, sanapattu machines, boring machines were placed.

Pirangulanu mukhyabhavananiki put two long-established right. Krindigadulalo museum, anakattaku of the details, there are a few models. Nirmananikicendina hallway between pictorial detail of the dam.

Cotton Aristocrat phalakalunnayi described life in another hallway. Rajahmundry Godavari from another hallway, there is a model to mingle in the ocean. On the wall behind the model, dam nirmanavisesalu, enniekaralaku nirandutunnadane details. Itaraprajektula details of Andhra Pradesh on the floor, some of the models, there are pictures of things that happened elsewhere under cotton. Written in response to a visit to the museum was the great grandson of the cotton in the bottom of the picture is not found. Cotton in the portraits of various ages, parents, pictures, Cotton bastsaiju statue.

Within the Bay of river Godavari in Nashik kaliyuvaraku namunakaladu avaranalo outside the museum show. Vicarincadagga thing, showing the negligence of the museum. Used machines by keeping them out of anakattaku dust ceripotunnadi. The building had a broken window. Jorabadi into evavaraina easily, may steal things. There is a museum inside the guide, to explain their pramukhyatyanu. Models are also ranguvelasi up. Remember the people and the Ayn ullalo're statues.

Cotton life-milestones
Sanvatsaramukatan life milestones

1826-29 Development of the Strait of Pamban

1836-39 Development of the Cauvery Delta Tanjore district, the construction of the dam koleron

The implementation of the project in 1836, the Madras Harbor

Redhilsu from Madras, was until 1837 the monitoring nirmanapanulapai

Visakhapatnam port construction project work in 1838-40. Became the most important port in the country today

Construction of the dam on the Godavari between 1843-52 dhavalesvaram-vijjesvaram

In 1852, the construction of GANNAVARAM akvidaktu

In 1856 the construction of the dam, offering krsnanadipai

Orissa government is prepared to present a report on irrigation in 1859

Interlinking of rivers south of the Tungabhadra canal nirmanamuuttarabharatanloninadulanu 1878

 సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899)

కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) జయంతి నేడు..
బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు అయిన కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయింది. కాని ఆంధ్ర ప్రదేశ్లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.
1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు.
1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు.
ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలు ఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.
జీవితం
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు.
15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.
సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది.
19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తిచేసి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేశాడు. అందుకే ఆయనను ఆంధ్రులు మరచిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి" అపర భగీరథుడిగా" కీర్తిస్తున్నారు ఇప్పటికీ.
కృషి
కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లా లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి.
కాటన్ 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది.
ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు.
కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్‌ దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒడిసా, బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.
ఉభయగోదావరిజిల్లాలు-కాటన్
పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు  అతివృష్టి వలన, వరదముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి.
1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు.
అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.
1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)
అని పఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు.
ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్టను మరింతగా అభివృద్ధి పరచి, దృఢంగా చేయబడి కట్టబడింది.
కాటన్‍మ్యూజియం
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం. ఈ మ్యూజియాన్ని ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి.
మ్యూజియం ఆవరణమీదుగా, మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారి యొక్క ఫ్లైఒవర్ వంతెన ఉంది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు.
ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి.
మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉంది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ బస్ట్‍సైజు విగ్రహం ఉన్నాయి.
మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు. విచారించదగ్గ విషయమేమంటే, ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని ఊళ్లలో విగ్రహాలు పెడుతున్నారు.
కాటన్ జీవితం-మైలురాళ్ళు
సంవత్సరముకాటన్ జీవితంలోని మైలురాళ్లు
1826-29 పాంబన్ జలసంధి అభివృద్ధి
1836-39 తాంజోర్ జిల్లాలోని కావేరి డెల్టా అభివృద్ధి, కోలెరోన్ ఆనకట్ట నిర్మాణము
1836 మద్రాసు హర్బరు పథకము అమలు
1837 మద్రాసు నుండి రెడ్‍హిల్సు వరకు రైలుమార్గం నిర్మాణపనులపై పర్యవేక్షణ
1838-40 విశాఖ నౌకాశ్రయ నిర్మాణ ప్రాజెక్టు పని. దేశంలోనే ప్రముఖ రేవుగా నేడు ఆవిర్భవించినది
1843-52 ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య గోదావరి పై ఆనకట్ట నిర్మాణము
1852 గన్నవరం అక్విడక్టు నిర్మాణం
1856 కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంపై నివేదిక సమర్పణ
1859 ఒడిసా ప్రభుత్వానికి నీటిపారుదల పై నివేదిక తయారుచేసి సమర్పించాడు

1878 తుంగభద్ర కాలువల నిర్మాణము.ఉత్తరభారతంలోనినదులను దక్షిణభారత నదులతో అనుసంధానంపై నివేదిక



























                                           సర్ ఆర్థర్ కాటన్  -సమాధి

0 comments:

Post a Comment

ADD

TEACHER TRANSFERS

More

AP District wise information

MORE TO VIEW
AP District Wise transfers LATEST INFORMATION

Important Labels

CCE -Acadamic Information

CLICK FOR More

LATEST INFO

CLICK FOR More

TLM For High School

CLICK FOR More
TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

AP Departmental Tests Info

CLICK FOR More

SOFTWARES

MORE TO VIEW
Top