Thursday, 18 May 2017

పాక్ లో బాహుబలి స్వైర విహారం…!

భారత్-పాక్ ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఈ ద్వేషం సినిమాల మీద కూడా పడుతూ వస్తుంది. ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరగడం తదితర అంశాలు ఇక్కడి సినిమాలను పాక్ లో విడుదల కానివ్వకుండా చేస్తున్నాయి.
ఒకటి రెండు భారతీయ సినిమాలు మినహా అక్కడ పెద్ద సినిమాలు ఏవి విడుదల కావట్లేదు. దీనికి ప్రధాన కారణం మాత్రం భారతీయ సినిమాల్లో హిందు మతానికి సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉండటమే. అంతే కాకుండా భారత దేశ జెండా కనపడినా సినిమాని విడుదల చెయ్యట్లేదు. అమీర్ ఖాన్ దంగల్ సినిమాని అక్కడ ఈ కారణంతోనే విడుదల చేయలేదు.
అలాగే బాహుబలి సినిమాని సినిమా విడుదల అయిన తొలి రోజుల్లో పాకిస్తాన్ లో విడుదల చెయ్యలేదు. హిందు మతానికి సంబంధించిన సీన్లు బాహుబలి లో ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. పాకిస్తాన్ యువత కూడా ఈ సినిమాకోసం ఆశక్తిగా ఎదురు చూసారు. అయితే ఎట్టకేలకు ఒక్క కట్ కూడా లేకుండా సినిమాని పాక్ లో విడుదల చేసారు.
దీనితో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుంది. పాకిస్తాన్ లో దాదాపు వందకు పైగా స్క్రీన్ల మీద ఈ సినిమా విడుదల అయింది. సిని విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా దాదాపు ఆరుకోట్ల వరకు అక్కడ వసూల్ చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రజలు ఈ సినిమాని విశేషంగా ఆదరించడంతో ఆ కలెక్షన్లు సులభంగా సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


0 comments:

Post a Comment

ADD

TEACHER TRANSFERS

More

AP District wise information

MORE TO VIEW
AP District Wise transfers LATEST INFORMATION

Important Labels

CCE -Acadamic Information

CLICK FOR More

LATEST INFO

CLICK FOR More

TLM For High School

CLICK FOR More
TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

AP Departmental Tests Info

CLICK FOR More

SOFTWARES

MORE TO VIEW
Top