Saturday, 22 April 2017

About LENIN లెనిన్ గురించి( జయంతి ఏప్రియల్ 22 ) సందర్భముగా సంక్షిప్తముగా


🌷రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త..లెనిన్ జయంతి సందర్భంగా..🌷
■ 20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. 

■ లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన
వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ . ఇతడు 1917లో జరిగిన  అక్టోబ ర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922 వరకు ఆ పదవిలో కొనసాగాడు.  కార్ల్ మార్క్స్  ప్రతిపాదించిన  మార్క్సిజమ్‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతా న్ని  లెనినిజమ్ లేదా మార్క్స్సి జమ్-లెనినిజమ్ అని అంటారు.

■ లెనిన్ అసలు పేరు 'వ్లాడిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్ 'కాగా అమ్మ నాన్న పెట్టినపేరు మార్చుకొని కొత్త పేరుతో చలామణిగావడం ఒకసంప్రదాయం. అలాగే రహస్య పార్టీలో పనిచేసే వారు కూడా పేరు మార్చుకుంటుం టారు. 

■1870లో ఓల్గా నదీతీరానగల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అదిచూచి లెనిన్ మనస్సు రాయిచేసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో ఆరంభమైన యీ దృష్టి లెనిన్ లో రానురాను గట్టిపడింది. విప్లవ చర్యలకు ఉపక్రమించాడు. మాస్కో గ్రంథాలయంలో చాలా విషయ సేకరణ చేశాడు. ఒక సూట్ కేసు అడుగున మరో రహస్య అర ఏర్పరచి, నిషిద్ద గ్రంథాలు చేరవేస్తుండగా పట్టుబడి, సైబీరియా ప్రవాస జీవితార్ధం పంపబడిన లెనిన్ అక్కడే విప్లవ కారిణి క్రుపస్కయాను పెళ్ళాడాడు.

■ తన 31వ ఏట లెనిన్ మారుపేరు ధరించాడు (1901లో). తల్లిదండ్రులిరువురూ క్రైస్తవులు, కాని, లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరా మంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు పొలంపను లకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరిం చాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు.

◆ ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందాడు.

◆ అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండు రోజులకే, లెనిన్ పత్రికా స్వేచ్ఛను అరికట్టాడు.

◆ లెనిన్ అధికారానికి వచ్చిన తరువాత ఒక రహస్య సైనిక సంస్ధను స్థాపించాడు. ఆల్ రష్యన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ కమిషన్ ను పొడిగా 'చేకా'అంటారు. ఈ రహస్య సంస్థ లెనిన్ వున్నంతకాలం బయటవారికి తెలియలేదు.

◆ పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు.

☄లెనిన్‌ నిరాడంబరత..🕴

■ 'సగటు కార్మికుడి జీతం కంటె ఏ కమ్యూనిస్టు ఉద్యోగి జీతం కూడా ఎక్కువ ఉండకూడదనేది కమ్యూనిస్టు మూల సూత్రాలలో ఒకటి'.

■ 'ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు’ రచయిత జాన్‌ రీడ్‌తో పాటు లెనిన్‌తో సన్నిహితంగా ఉండి పెట్రోగ్రాడ్‌, పీటర్స్‌బర్గ్‌ నగరాలు, వింటర్‌ ప్యాలెస్‌, స్మోల్నీ భవన్‌ వంటి కీలక దశలన్నింటిని స్వయంగా పరిశీలించిన రచయిత. ఈయన ‘రష్యాలో విప్లవ దినాలు’ అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత కూడా. వక్రీకరణలు, అవాస్తవాలు, అతిశయోక్తులు లేకుండా వాస్తవిక దృష్టితో ఆనాటి రష్యన్‌ విప్లవ పరిస్థితులను, విప్లవానంతరం సోషలిస్టు ప్రభుత్వ తొలి పాలననూ అక్షరీకరించిన అరుదైన గ్రంథాలలో అదొకటి. విప్లవం విజయవంతమయ్యాక తొలి సోషలిస్టు ప్రభుత్వం రష్యాలో కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజర్ల జీవన భృతి పట్ల తీసుకున్న నిర్ణయాన్ని గూర్చి అల్బర్ట్‌ రీస్‌ విలియమ్స్‌పై విషయాన్ని పేర్కొన్నాడు.

■ ఇంకా ప్రభుత్వాధినేతలు, పార్టీ నాయకుల జీవన విధానం గూర్చి సోవియట్‌ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని ఆల్బర్ట్‌ రీస్‌ విలియమ్స్‌ ఓ సందర్భంలో మతంతో పోల్చడం గమనార్హం. ఆయన మాటల్లోనే చూద్దాం...‘ ఛీఫ్‌ కమిస్సార్‌ కావచ్చు. లేదంటే వంటశాలలో పనిపిల్లవాడు కావచ్చు. అందరికీ ఒకే భోజనం! అదేమంటే ‘అందరికీ బ్రెడ్‌ దొరికేంత వరకూ ఎవరికీ కేకు ఉండకూడదు’ అని కమ్యూనిస్టు మతంలో రాసి ఉంది’. తర్కానికీ, హేతువుకీ అతీతమైనదే మతం! అట్టి గుడ్డి విశ్వాసాలతో కూడిన మతాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. ‘అందరికీ బ్రెడ్‌ దొరికేంతవరకూ ఎవరికీ కేకు వుండదు’ అన్నది మత విశ్వాసంగా సోషలిస్టు ప్రభుత్వం అవలంబించిందన్నది అల్బర్ట్‌ చెప్పడం గమనార్హం!
■ ఇంకా ఆయన లెనిన్‌ జీవిత విధానం గూర్చి కూడా ఇలా మాట్లాడారు.. ‘అందరికీ దొరికే రేషన్‌నే లెనిన్‌ తీసుకొనేవారు. కిటికీలకు తెరలూ, గోడలకు పటాలు లేని బారకాసులు వంటి పెద్ద గదుల్లో ఎర్రసైనికులూ, వార్తా సిబ్బంది ఇనప మంచాల మీద నిద్రించేవారు. లెనినూ, అతని భార్య కృపా కూడా అంతే’ అని అల్బర్ట్‌ ఇంకా ఇలా రాస్తారు.
■ 'సామాజిక జీవితంలో లెనిన్‌ ఏ ఉక్కు క్రమశిక్షణను ప్రవేశపెట్టాడో, తన వ్యక్తిగత జీవితంలోనూ అదే పాటించారు. క్యాబేజీ పులుసు, బీట్‌, క్యాబేజీల మిశ్రమ పులుసూ, రాగిపిండి రొట్టెలూ, గోధుమ నూకతో అంబలి, చోడినూక జావ, టీ ఆనాడు స్మోల్నీ భవనంలోని జనం తినే తిండి! సరిగ్గా ఇవే లెనినూ, అతని భార్య, చెల్లెలూ తినేవాళ్ళు’. ఆయన ఇంకా లెనిన్‌ నేతృత్వంలో సోషలిస్టు ప్రభుత్వం రాజ్య ఆహార విధానాన్ని నియంత్రించిన తీరును ఇలా వ్యాఖ్యానించారు.
■ 'బ్రెడ్డు దొరకడమే కష్టం. ఆ బ్రెడ్‌ కూడా అప్పుడప్పుడు ప్రజలకు రవ్వంత ముట్టేది. ప్రజలతో ప్రతి ఒక్కరికీ ఎంత ముట్టేదో లె నిన్‌కూ అంత! కొన్ని కొన్ని రోజుల్లో అది కూడా వుండేది కాదు. అలాంటి రోజుల్లో లెనిన్‌కు కూడా వుండేది కాదు’. అని ఆల్బర్ట్‌ రాశారు ‘లెనిన్‌పై హత్య ప్రయత్నం తర్వాత వైద్యులు ప్రత్యేక పథ్యం చెప్పారు. వారు సూచించిన ఆహార పదార్థలు రేషన్‌ కార్డు మీద దొరికేవి కాదు.
■ చట్టా వ్యాపారుల దుకాణాలలోనే దొరికేవి. స్నేహితులు లెనిన్‌ను ఎంత బతిమిలాడినా రేషన్‌ కార్డు పై న్యాయంగా దొరకని వస్తువులు వేటినీ ససేమిరా ఆయన ముట్టనన్నారు’. ‘ఆ కష్టాలన్నీ లెనిన్‌ భరించాడంటే సన్యాసివలె జీవించాలనే భావోద్వేగంతో కాదు. కమ్యూనిజం ప్రాథమిక సూత్రాలన్నింటినీ అతడు తన నిత్య జీవితంలో అమలు పరిచాడు. అంతకంటే మరొకటి కాదు’ అని అల్బర్ట్‌ రాశారు.
■ అందరికీ బ్రెడ్డు దొరికేంత వరకూ ఎవరికీ కేకు వుండకూదన్న ప్రాథమిక సూత్రంలో చాలా అర్థాలున్నాయి. అందరికీ కేకులు దొరికే మంచి పరిస్థితులకోసం కృషి చేయకపోతే కమ్యూనిజానికి అర్థం లేదు. అందరికీ పరమాన్నం, సర్వసుఖాలూ సకల భోగాలూ, సమస్త భాగ్యాలూ చేకూర్చే లక్ష్యం కమ్యూనిజానిది. భౌతిక సంపదలూ సుఖాలూ, సౌఖ్యాలూ మానవజాతికి అధికాధికంగా చేకూర్చాలనీ అయితే కొందరి సుఖం ఎందరికో దుఃఖంగా మారే అసమానతలుండరాదనీ కమ్యూనిజం చెబుతుంది. అందుకే కమ్యూనిస్టుల, సోషలిస్టు ప్రభుత్వాధినేతల, ఉద్యోగుల జీవన విధానాన్ని కూడా నియంత్రించడమైనది.
■ తన విద్యార్థి జీవితంలోనూ; సమారాలో న్యాయవాద వృత్తిలోను; జైలులోను; ప్రవాస శిక్షాకాలంలోనూ; అజ్ఞాత జీవితంలోనూ; విదేశాలలో తలదాచుకున్న కాలంలోనూ లెనిన్‌ ఎలాంటి నిరాడంబర జీవనం సాగించాడో అనేక ఉదాహరణలున్నాయి. రాజ్యాధికారం సిద్ధించిన తర్వాత కూడా అంటే సుఖ, సౌఖ్యాలు అనుభవించే అవకాశాలు, లభించిన తర్వాత కూడా ప్రజలతో పాటు కలో గంజో తాగాలన్న నియమాన్ని విధించి, ఆచరించడం అసాధారణమైనది.
■ తొలి సోషలిస్టు రాజ్యం 14 పెట్టుబడిదారీ యుద్ధ దాడులకు ధ్వంసమైనా, అంతర్యుద్ధం పీడించినా, కరవుకాటకాలు పీడించినా, ప్రజల ఆకలి మంటలు జారు చక్రవర్తుల కాలంనాటి కంటే తీవ్రమైనా, అక్టోబర్‌ విప్లవం వల్ల ప్రజల జీవితాలు పెనం మీద నుంచి పొయిలో పడినట్లు ప్రచార సాధనాలు ఇంటా బయటా దుష్ప్రచారం చేసినా, లెనిన్‌ ఓ నయా జారుగా, మరో నికొలస్‌ చక్రవర్తిగా నిందా ప్రచారం జరిగినా, దేశంలోని దారిద్య్ర జన కోటి సోషలిస్టు ప్రభుత్వాన్నీ, లెనిన్‌నూ విశ్వాసంతో అనుసరించడానికి వారు అవలంబించిన పై విధానమే బలాన్నిచ్చింది. నిజానికి విదేశాలే రష్యాపై ఆంక్షలు విధించి ప్రజల ఆకలిపై ప్రయోగాలు చేశాయి.
■ రష్యన్‌ ప్రజల కడుపులు మాడ్చాలన్న సామ్రాజ్యవాద దేశాల లక్ష్యం వికటించడానికి కారణం తానూ తన భార్య, పార్టీ, ప్రభుత్వ నేతలందరూ తమ శరీరాలనే అర్ధాకలికి గురి చేసి సమానత్వం పాటించారు. అందుకే ఆనాడు సోవియట్‌ వ్యవస్థ నిలబలడింది. కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధికి కేవలం సిద్ధాంతాలే కాకుండా పార్టీ నాయకుల విప్లవాదర్శాలు నిరాడంబర జీవన విధానం కూడా ఉత్ర్పేరకంగా పనిచేస్తాయి

DOWNLOAD....లెనిన్ గురించి( జయంతి ఏప్రియల్ 22 ) సందర్భముగా సంక్షిప్తముగా

0 comments:

Post a Comment

ADD

TEACHER TRANSFERS

More

AP District wise information

MORE TO VIEW
AP District Wise transfers LATEST INFORMATION

Important Labels

CCE -Acadamic Information

CLICK FOR More

LATEST INFO

CLICK FOR More

TLM For High School

CLICK FOR More
TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

AP Departmental Tests Info

CLICK FOR More

SOFTWARES

MORE TO VIEW
Top