Search This Blog

MORE TO VIEW

Saturday, 18 January 2020

ESE - 2 Dt:18.01.20 Introducing English Medium from Class I to VI -certain Instructions

ESE - 2 Dt:18.01.20 Introducing English Medium from Class I to VI -certain Instructions
▪2020-21 విద్యా సంవత్సరం నుండి  ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ప్రారంభించనుంది
▪21.01.20 న ప్రతి పాఠశాలలోనూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి
▪ తల్లిదండ్రులు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తారు Option ఫారం తీసుకోవాలి
▪23.01.20 లోపు RJDSEs వాటిని బైండింగ్ చేసి కమిషన్ ఆఫీస్ కు అందేలా చర్యలు తీసుకోవాలి
▪Option Form and Complete Details Download from.......
  


Friday, 17 January 2020

మీ పిల్లలను 4 ఏళ్లకే LKG /UKG అని స్కూళ్లకు పంపుతున్నారా?...మంచిదేనా...విశ్లేషణ....విదేశాలలో ఎలా ఉంది.....తెలుసుకోండి..

భారతదేశంలో చాలామంది చిన్నారులను 4 ఏళ్లలోపే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో 4 ఏళ్లు రాగానే పిల్లలను ప్లే స్కూల్ పంపుతున్నారు. ఆ తర్వాత నర్సరీ, LKG, UKG అంటూ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఎందుకంటే పిల్లాడికి స్కూల్ అలవాటు కావాలనో లేదా ముందునుంచే స్కూల్లో వేస్తే.. 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి నేరుగా ఫస్ట్ క్లాసులో వేయొచ్చులే అని ఇలా ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను అతి తొందరగా పాఠశాలలకు పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి విద్యా హక్కు (RTE) చట్టం 2009 ప్రకారం.. ఒక పిల్లాడు 6 ఏళ్ల వయస్సు కంటే ముందుగానే 1వ తరగతిలోకి ప్రవేశించాలని ఆదేశించింది. కానీ, భారతీయ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను 4 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్లాసులో చేర్పిస్తున్నారు.
నెమ్మదిగా అతడే అలవాటు అవుతాడులే అని పంపిస్తున్నామని అంటున్నారు. ఈ పద్ధతి.. ప్రస్తుతం నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా నడుస్తోంది.

వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక (ASER) 2019 ప్రకారం.. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలలో ఐదవ వంతు కంటే ఎక్కువ మంది 1వ తరగతి చదువుతున్నారు. అతి తక్కువ వయస్సులోనే ఫస్ట్ క్లాసులో చేరడం ద్వారా వారి కంటే పెద్ద పిల్లలే గణనీయంగా మెరుగ్గా చదువుల్లో రాణిస్తున్నారని నివేదిక సూచిస్తోంది. అంటే.. అక్షరాలతో పాటు సంఖ్యలను గుర్తించగలడం.. అలాగే చదవగల సామర్థ్యం ఎక్కువగా పెద్ద పిల్లల్లోనే ఉంటుందని తెలిపింది. 'పిల్లలను చాలా చిన్న వయస్సులోనే అధికారిక పాఠశాలల్లో చేర్పించడం కారణంగా వారి స్కూల్ లైఫ్.. విద్యాపరంగా ఇతరుల వెనుక ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం' అని నివేదిక పేర్కొంది.

UKలో 5 ఏళ్లు.. USలో 6 ఏళ్లు :
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యూకేలోని పిల్లలకు కనీసం 5 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి. అదే యూఎస్ లో అయితే 6 సంవత్సరాల వయస్సులోపు ఉంటే తప్పా అధికారిక పాఠశాల విద్యను ప్రారంభించరు. వాస్తవానికి కిండర్ గార్టెన్‌లో పిల్లల చదువు ప్రారంభం కావాలాన్నా, ఒక పిల్లవాడు కిండర్ గార్టెన్‌లో చేరేముందు UK లేదా USలో వరుసగా 5 లేదా 6 సంవత్సరాల వయస్సు తప్పనిసరిగా ఉండి తీరాలి. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం.. 5 లేదా 6 ఏళ్ల వయస్సులో పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడం ద్వారా వారి విద్యా విజయాలను మెరుగుపర్చడమే కాదు.. నేరాలకు పాల్పడే వారి ప్రవృత్తిని కూడా తగ్గిస్తుందని గుర్తించారు.

పిల్లల పాఠశాల ప్రారంభ వయస్సు ఒక వ్యక్తి దీర్ఘకాలిక ఆదాయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని వెల్లడించింది. ASER చట్టం కూడా ప్రస్తుత వయస్సు ప్రమాణాల ప్రతికూలతలను సూచిస్తోంది. ప్రస్తుతం ఫస్ట్ క్లాసు చదువుతున్న 41.1 శాతం మంది పిల్లలు 1 నుంచి 9 అంకెల వరకు గుర్తించగలరు.

NCERT ప్రకారం.. 1వ తరగతిలోని పిల్లలు 99 వరకు సంఖ్యలను గుర్తించగలగాలి. ఇప్పుడు అది కేవలం సంఖ్యల ఆట కాదనే విషయం ప్రతి పేరంట్స్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అతి తక్కువ వయస్సులోనే పిల్లలను స్కూళ్లకు పంపింతే మారి మానసిక స్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Kailasa temple-ఏకశిలా నిర్మాణం కైలాస దేవాలయం.. అద్భుత రహస్యాలు..

ఏకశిలా నిర్మాణం కైలాస దేవాలయం.. అద్భుత రహస్యాలు..

కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో, పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు. అత్యంత ఆశ్చర్యం, సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం( 756-773)లో రాష్ట్రకూటులు నిర్మించారు. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి.

కానీ కేవలం 18సంలు మాత్రమే పట్టింది. 18 ఏళ్ళపాటు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు. 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి. అంటే రోజుకు 60 టన్నులు. రోజులో 12గంటలపాటు పని చేసారనుకున్నా గంటకు 5 టన్నుల రాయిని పెకిలించాలి. అది కూడా అడ్డదిడ్డంగా కాదు. ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంతరాయిని తీసేయాలి. ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడినా గంటలో 5 టన్నుల రాయిని పెకిలించటం అసాధ్యం.

మరి అలాంటివాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్ లో ఉంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయనిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్యమార్గాలు, బాల్కానీలు, అప్‌స్టైర్స్ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అన్నికూడా రాయితో చెక్కినవే. ఔరంగజేబ్ అనేక హిందుఆలయాలను నాశనం చేసాడు.
ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని వెయ్యిమందిని పంపించాడు. వారు విశ్రాంతి లేకుండా 3 సంల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీ వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్ లు పెట్టడమే అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. ఏంవింతో గానీ కనీసం ఆలయంలోని గర్భ గుడిలో కూడా వెళ్ళలేకపోయాడు. మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో.ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనకవున్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు

Capital -ఏపీ సీఎం జగన్‌కి ప్రధాని పిలుపు.. ఏం జరుగుతుంది?

ఏపీ రాజధానిని అమరావతి నుంచీ మూడు భాగాలుగా చేసి... విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం... 20న కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. ఐతే... ఇంతలోనే కేంద్రం నుంచీ ఏపీ సీఎం జగన్‌కు పిలుపు రావడంతో... ఇవాళ హడావుడిగా ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జగన్... తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేయబోతున్న పనులపై ఇద్దరికీ వివరించి... రాజధాని తరలింపుపై ఇద్దరి అనుమతీ తీసుకోవాలని ప్రయత్నిస్తారని తెలిసింది. ఐతే... ఇందుకు అటు మోదీ గానీ, ఇటు అమిత్ షా గానీ ఒప్పుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి
మొదటిది... అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ప్రధాని మోదీయే స్వయంగా శంకుస్థాపన చేయడం. రెండోది... ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ... మొదటి నుంచీ రాజధాని తరలింపు అంశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండటం. ఇప్పుడు గనక కేంద్రంలో మోదీ, అమిత్ షాలు... జగన్ మాటను ఒప్పుకుంటే... రాజధాని తరలింపును అంగీకరిస్తే... అది ఏపీలో బీజేపీ, జనసేనల నిర్ణయాలకు వ్యతిరేక నిర్ణయం అవుతుంది. అందువల్ల అమిత్ షా అడ్డుపుల్ల వేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిజానికి రాజధాని తరలింపు అంశం రాష్ట్ర పరిధిలోనిది. అందువల్లే సీఎం జగన్... హైపవర్ కమిటీ... అన్నీ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 20న మూడు రాజధానుల అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి... అందులో ఆమోదం పొందేలా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐతే... అమరావతి రైతుల సంగతేంటని ప్రశ్నిస్తున్న బీజేపీ... ఈ విషయంపై సీఎం జగన్‌ను కేంద్ర స్థాయిలో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం గనక రాజధాని తరలింపుపై అభ్యంతరాలు చెబితే... అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతను దెబ్బతీస్తుంది. కేంద్రం నుంచీ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సహకారం అందకపోవచ్చు. అలాగని ఈ విషయంపై వెనక్కి తగ్గితే... వైసీపీ ప్రభుత్వం... కేంద్రం ముందు తలదించిందనే విమర్శలు వచ్చే అవకాశాలున్నాయి.

ఏపీలో విపక్షాలు, రాజధాని రైతులు... అందరూ కేంద్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు... ప్రధాని మోదీయే తమను కాపాడాలంటున్నారు. ఆల్రెడీ జనసేనతో పొత్తుపెట్టుకున్న కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచే అవకాశాలున్నాయి. అందులో భాగంగా... రాజధాని అంశంపై గట్టిగానే ఒత్తిడి చేస్తారనే వాదన వినిపిస్తోంది. సీఎం జగన్ గత నెలలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లినా పార్లమెంటు సమావేశాలు, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో మోదీ, అమిత్ షా బిజీ అవ్వడంతో... భేటీ కుదరలేదు. ఇప్పుడు జనసేనతో పొత్తువల్ల జగన్‌కి అనుకూల పరిస్థితులు మరింత తగ్గాయి. ఈ క్రమంలో ఇవాళ్టి భేటీలో అటు మోదీ, ఇటు అమిత్ షా ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.

Netbanking -గుడ్ న్యూస్.. నెట్ బ్యాంకింగ్ లాగిన్'కు ఇక పాస్వర్డ్‌ అక్కర్లేదు....ఓన్లీ ఓటీపీ!

సాధారణంగా నెట్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరి. వీటిని ఎంటర్ చేస్తేనే ఈ సేవలు పొందగలం. అయితే ఇప్పుడు పాస్‌వర్డ్ అవసరం లేకుండానే ఈ సేవలు యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా నెట్ బ్యాంకింగ్ కోసం ఓటీపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఈ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ లాగిన్ కోసం పాస్‌వర్డ్‌ను గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ సాయంతో నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ఓటీపీ నెట్ బ్యాంకింగ్ సేవలకు పాస్‌వర్డ్ అవసరం లేకున్నా సరిపోతుంది. కానీ డెబిట్ కార్డు పిన్ మాత్రం కచ్చితంగా తెలిసి ఉండాలి.
ఓటీపీతోపాటు డెబిట్ కార్డు పిన్ సాయంతోనే నెట్ బ్యాంకింగ్ సేవల్లోని లాగిన్ అవ్వగలం. బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఓటీపీ ఆధారిత లాగిన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు వేగంగా నెట్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. లావాదేవీలకు ఎలాంటి డేటా ముప్పు ఉండదని, రెండంచెల అథంటికేషన్ ప్రాసెస్ ఉంటుందని పేర్కొంది.
కస్టమర్లు బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని వినియోగించుకోవాలని భావిస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ లాగిన్‌పై క్లిక్ చేయాలి. తర్వాతి స్టెప్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని, డెబిట్ కార్డు పిన్‌ను ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టాలి. దీంతో లాగిన్ అవ్వొచ్చు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ ఓటీపీ ఆధారిత సేవలను అదనపు ఆప్షన్‌గా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే ఓటీపీ ప్రాసెస్ అందుబాటులో ఉన్నా కూడా పాస్‌వర్డ్ లాగిన్ సేవలు కూడా పొందొచ్చు. అందువల్ల ఓటీపీ విధానం వద్దనుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేసి నెట్ బ్యాంకింగ్‌ సేవలు యాక్సెస్ చేయొచ్చు.

Ambedkar Quotes-అంబెడ్కర్ వివిధ సందర్భాల్లో తన ప్రసంగాల్లో జాతికి అందించిన అణిముత్యాలు

అంబెడ్కర్ వివిధ సందర్భాల్లో తన ప్రసంగాల్లో జాతికి అందించిన అణిముత్యాలు
 
◆ఎంత *ఎక్కువ కాలం* బ్రతికామన్నది కాదు. *ఎంత గొప్పగా* బ్రతికామన్నదే ముఖ్యం.

◆ *నా దేశ సమస్యలకు-నా జాతి సమస్యలకు* మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను.
కానీ *నేను - నా దేశం* ఈ రెండింటిలో *నా దేశానికి మొదటి ప్రాధాన్యత* ఇస్తాను..

◆దేశం అభివృద్ధి చెందడమంటే *అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.* ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి.

◆జీవించేందుకు తినాలి.
 సమాజ సంక్షేమానికై జీవించాలి.

◆నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు.
జనం కోసం జీవిస్తే... జనం లో నిలిచి పోతావు.

◆ఓటుహక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో,
అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది..

◆ కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గాని నిర్ములించలేము.

◆ వినయం,శీలం లేని విద్యావంతుడు మృగం కంటే హీనుడు.

◆ఆశయాలను ఆచరణలో పెడితే మహానీయు లవుతారు.

◆ నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి. దేవుడి మీదకాని, మహానుభావుల మీద కానీ ఆధార పడకు.

◆ ఏ కారణము లేకుండాఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేసే పనిలో విజయం సాధిస్తావని అర్థం.

◆రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చెప్రాసి నుండి రాష్ట్రపతి ని చేస్తుంది.
మతాన్ని నమ్ముకుంటే....మళ్ళీ నిన్ను బానిసగా తయారు చేస్తుంది.

◆నేను హిందుమతంలో పుట్టాను కానీ నేను హిందువుగా చావను.ఎందుకంటే కులవ్యవస్థ లేని,అంటరాని తనంలేని హిందూమతాన్ని నేను *స్వాగతిస్తాను.

◆ఈ కుల వ్యవస్థ వల్ల నేను నా జాతి ఎన్ని అవమానాలు భరించామో భారతీయులకె కాదు ప్రపంచానికి కూడా తెలుసు.కాబట్టి కులవ్యవస్థను రూపు మాపాలి. సమ సమాజ నిర్మాణానికి తోడ్పడాలి.

◆ తల్లి దండ్రులకు నలుగురు సంతానం ఉంటే నలుగురిని సమానంగా పెంచి,పెద్ద చేసి ఆస్తులను సమబాగాలుగా ఇస్తారు.కానీ దేవుడు పుట్టించిన బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర(బీసీ,ఎస్సి, ఎస్టీ) లలో శూద్రులను గుల్లోకి రానివ్వద్దని,ఊళ్ళోకి రావద్దని,చెరువు నీళ్లు ముట్ట వద్దని,అగ్ర కులాలు వీరిని తాక రాదని చెప్పిన మనువాద శాస్త్రాన్ని తగుల బెట్టండి తప్పులేదు,ఎందుకంటే అన్నివర్ణాల వారికి సమన్యాయం చేయలేదు కాబట్టి.

_భారత రత్న డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబెడ్కర్.

School bus -పొరబడి ఎక్కొద్దు ! ఈ బస్ మీ ఊరు పోదు...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం బడితండా పంచాయతీ పరిధి వరంబండతండా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల గురువులు ఆ దిశగా మరింత వినూత్నతను జోడించారు. గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణవేణి, సర్పంచి నరేశ్‌ ఆర్థిక సాయంతో పాఠశాలను పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలు.. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోవని తెలిపేందుకే ఈ ప్రయత్నమని ప్రధానోపాధ్యాయుడు పి.ప్రేమ్‌చంద్‌ పేర్కొన్నారు.

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top